Pages

Subscribe:

Ads 468x60px

Featured Posts

Saturday 22 October 2022

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఆండాళ్లు తిరుప్పావు కీర్తనలు


 తెల్లతెలవారె వ్రేపల్లెలో వినరమ్మ చల్ల తరిచే సవ్వడి!

నల్లనగు నా స్వామి నడయాడు వాడలో వల్లమాలిన నిదుర వలదమ్మ! చెలులార!

అల్లన బయళ్ళలో ఆలమందలు మూగె, పల్లెలో ప్రతిబాట పరవశమ్మున నూగె!! తెల్ల!!

కొమ్మ కొమ్మా పిల్లగ్రోవి నాట్యమ్మాడె! కొమ్మలారా! పులుగు గోవింద అని పాడె!! తెల్ల!!

రారమ్మ ఓ అమ్మలారా! రారేమమ్మ!(బిలహరి రాగము – ఆదితాళము)

రారమ్మ ఓ అమ్మలారా! రారేమమ్మ!

నీరాడ మనసున్న వారు, మీరూ – మీరు!

శ్రీరమ్యమైన మన వ్రేపల్లెలోన

చేరి, కన్నియలార! కూరిమి చెలులార!!రారమ్మ!!

ఇది మార్గశిరము, వెన్నెలవేళ, భాసురము!

ఇది పరవాద్యవ్రతారంభ వాసరము!

మదిలోన జగమెల్ల ముదమంది పొగడ,

కదిసి కంకణ కటక కింకిణులు కదల!!రారమ్మ!!

మరిమరీ కనికనీ మెరసేటి కనులతో

మురిసే యశోదమ్మ ముద్దు సింగపు కొదమ,

కరిమొయిలు మెయిహొయలు గల అందగాడు,

వరదుడౌ మన ఱేడు వ్రతమేలువాడు!!రారమ్మ!!

కరమందు కరకువాల్ కాపుగా దాలిచి

వరలేటి మేటినందుని నందనుండు

అరుణశశింబనిభ శుభవదనుడు

సరసిజాక్షుడె నోము కరుణింపగా!!రారమ్మ!!

 

Tuesday 13 September 2022

అయోధ్యవాసీ రామ్ దశరథ నందన రామ్

అయోధ్యవాసీ రామ్ దశరథ నందన రామ్! జానకి జీవన రామ జయజయ రామరామరామ!!

సరయూ తీర విహారీ దండక వన సంచారీ! రావణ కుల సంహారీ శ్రీరామచంద్ర కా  --!!

యమునా తీర విహారీ బృందావన సంచారీ! గోవర్ధన గిరిధారీ గోపాలకృష్ణ మురారీ!!

గంగాతీర విహారీ దారుక వన సంచారీ! త్రిపురాసుర సంహారీ శ్రీకాలకంఠమురారీ!!

Sunday 18 July 2021

జీవితమే కృష్ణ సంగీతమూ


చిత్రం : శ్రీమద్విరాటపర్వము (1979)

సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి

సాహిత్యం : వేటూరి

గానం : మంగళంపల్లి బాలమురళీకృష్ణ

జీవితమే కృష్ణ సంగీతమూ.. సరిసరి నటనలు స్వరమధురిమలు 

అంతరంగాన ఊగే రస తరంగాల తేలే 

అంతరంగాన ఊగే రస తరంగాల తేలే 

యమునా నదీ లహరికా నాట్య గీతము.. 


నందుని నట్టింటి కరి లేగదూడా.. కాళింది లో కేళిగా పాము తలనాడా.. 

గోకులమది చూడ గోపబాలకులాడ 

ఆఆఅ..ఆఆ....

గోకులమది చూడ గోపబాలకులాడ 

అది విన్న ఇల్లాలు యశోదమ్మ అల్లాడ.. 

ఆనంద తాండవమాడినా ఆనందనందనుని 

శ్రీ పాద యుగళ శ్రీ పారిజాత సుమదళాలా 

పరిమళాల పరవశించే!!

వెన్నల రుచికన్నా మన్నుల చవిమిన్నఅన్నన్నా ఇది ఏమి అల్లరిరా అన్నా..

తెరచిన తన నోట తరచి చూచిన కంట 

ఈరేడు భువనాలు కనిపించెనంట 

ఆబాలగోపాలమది కని ఆ బాల గోపాల దేవుని 

పదమునాను కథలు విన్న 

ఎదలు పొంగి యమునలైన మా!!