Pages

Subscribe:

Saturday 21 December 2013

కల ఇదనీ నిజమిదనీ తెలియదులే

            
చిత్రం: దేవదాసు
సాహిత్యం:
సంగీతం: సి ఆర్ సుబ్బరామన్
గానం:


కల ఇదనీ నిజమిదనీ తెలియదులే,
బ్రతుకింతేనులే, ఇంతేనులే (౨)
పసితనపూ మనోరథం
వెన్నెలనీడై పోయేనులే, బ్రతుకింతేనులే, ఓ . . .
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే, బ్రతుకింతేనులే

ఎవియో మురిపాలెటకో పయనాలు
దైవాల నీమాలింతే (౨) వరమింతే
చివురించిన పూదీవే విరియగా
విరితావులు దూరాలై చనేనులే,
ప్రేమ ఇంతేలే పరిణామమింతేలే ||కల ఇదనీ||

నెరవేరని ఈ మమకారాలేమో
ఈ దూరభారాలేమో (౨) ...హితవేమో
ఎద నేరని ప్రాయానా చనువునా
రవళించిన రాగమ్మే స్థిరమ్మౌ
యోగమింతేలే అనురాగమింతేలే ||కల ఇదనీ||




Wednesday 18 December 2013

కోయిల కోయని పిలిచినది

     
చిత్రం: రంగులరాట్నం
సాహిత్యం: దాశరథి
గానం: పి సుశీల
సంగీతం: ఎస్ రాజేశ్వరరావు

 కోయిల కోయని పిలిచినది
ఓయని నా మది పలికినది..ఆ...ఆ..ఆ...ఆఆఆ

ఎవరిరూపో...ఎవరిరూపో...కనులలోన మెరిసినది
నా....బుగ్గలపై....తొలిసిగ్గు...తొణికినది...||కోయిల||

విరబూసే పూలూ సరదాలూ రేపే
వేయీ వసంతాలు ఉయ్యాలలూపే (2)
వలపులతో...వెచ్చని తలపులతో...
ఒయ్యారి నా మనసు సయ్యాటలాడే...||కోయిల||

తెలిమబ్బుమీద...తేలేను నేనే
చిరుగాలి కెరటాల...తూలేను నేను..తూలేను నేను
తారకనూ ...తీయని కోరికనో
మిన్నేటి నావకూ చుక్కాని నేనూ...||కోయిల||






Monday 16 December 2013

కలనైనా నీ వలపే

     
చిత్రం: "శాంతి నివాసం" .
సాహిత్యం..: సముద్రాల
సంగీతం : ఘంటసాల
గానం : శ్రీమతి పి.లీల


తుషార శీతల సరోవరాన ..
అనంత నీరవ నిశీధిలోన ఈ..కలువ నిరీక్షణా..
నీ..కొరకే..రాజా .. వెన్నెల రాజా...!

కలనైనా నీ వలపే..(క)
కలవరమంధైనా నీ తలపే..

కలువ మిటారపు కమ్మని కలలు.. (2)
కళలు కాంతులు నీ కొరకేలే
చేలియారాధన సాధన నీవే
జిలిబిలి రాజ జాలి తలచరా

కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే

కనుల మనోరథ మాధురి గాంచి ..ఆ ఆ......
కానుక చేసే వేళకు కాచి ....
వాడే రేకుల వీడని మమతల
వేడుచు నీకై వేచి నిలచెరా

కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే -


Sunday 15 December 2013

మధురానగరి సమీపంలో

           

రావోయి బంగారి మామా

      
రావోయి బంగారి మామా
నీతోటి రాహస్యమొకటున్నదోయీ

నీళ్ళ తూరల వెన్క
నిలుచున్న పాటనే
జలజలల్ విని గుండె
ఝల్లుమంటున్నాది!!రావోయి!!

అవిసె పువ్వులు రెండు
అందకున్నయి నాకు
తుంచి నా సిగలోన
తురిమిపోదువుగాని!!రావోయి!!

ఏటి పడవ సరంగు
పాట గిరికీలలో
చెలికాడ మనసొదల్
కలబోసుకుందాము!!రావోయి!!

పంటకాలువ ప్రక్క
జంటగా నిలుచుంటె
నీడల్లో మన యీడు
జోడు తెలిసొస్తాది!!రావోయి!!

ఈవెన్నెల సొలపు
ఈతెమ్మెరల వలపు
రాత్రి మన సుఖకేళి
రంగరించాలోయి!!రావోయి!!

ఈనాటి మనవూసు
లేనాటికీ మనకు
ఎంతదూరానున్న
వంతెనల్ కట్టాలి!!రావోయి!!

జొన్నచేలో గుబురు
జొంపాలలో గూడ
సిగ్గేటొ మనసులో
చెదరగొడుతున్నాది!!రావోయి!!






























Friday 13 December 2013

లీలాకృష్ణా నీలీలలు నే లీలగనైనా తెలియనుగా

    
లీలాకృష్ణా నీలీలలు నే లీలగనైనా తెలియనుగా
తెలిసీ తెలియని బేలల కడ నీ జాలములేవీ చెల్లవుగా!!

౧.  వేణుగానమున తేరగ పిలిచి
మౌనము పూనగ ఏలనో 2సార్లు
అలకయేమో యని దరి రాకుండిన
జాలిగ చూచేవేలనో!!లీలా!!


1.      
2.       ౨. నీ చిరునవ్వుల వెన్నెలలో
మైమరువగ చేయగ ఏలనో
మైమరచిన చెలి మాటే లేదని
మైమరచిన చెలి మాటే లేదని ఓరగ చూచేవేలనో!!లీలా!!


ఓహో మోహన రూపా కేళీ కలాపా

                  
 చిత్రం: శ్రీకృష్ణ తులాభారం
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
రచన: శ్రీ శ్రీ
గానం: బి వసంత, ఘంటసాల, పి సుశీల

ఓహో మోహనరూపా కేళీ కలాపా కృష్ణా
నిను గని మురిసెను నా మనసే 2సార్లు
మధువులు చిందే మందహాసం
మరులూరించే వేణుగానం
వినివిని పరవశనైతినిలే 2సార్లు
బిగిబిగి కౌగిట కరగితిలే!!ఓహో!!

ప్రణయారాధన వేళ బాలా
పతిపూజలు నీకేల బేలా
వలపు చిలుకు నీ చూపులు నాపై
నిలుపవే శుభాంగీ నిలుపవే లతాంగీ!!ఓహో!!

మధుర సుధా రాగమే
మదిలో కదిలే తీయగా 2 సార్లు
శిఖిపింఛమౌళీ నన్నేలగా
తనువే ఊగే హాయిగా
అహో లీలామానుషవేషధారీ మురారీ
తనివార నినుగాంచి ధన్యతనొందితి శౌరీ!!ఓహో!!





Tuesday 10 December 2013

kora kaagaz tha ye mann mera

                  
Movie: Aaradhana



kora kaagaz tha ye mann mera
likh liya naam is pe tera
suna aangan tha jivan mera
bas gaya pyaar jis pe tera
toot na jaaye sapane main darata hun
nit din sapanon men dekha karata hun) \- 2
naina kajaraare matavaare ye ishaare
khaali darapan tha ye mann mera
rach gaya roop is men tera
kora kaagaz tha ye man mera
likh liya naam is pe tera
chain ganvaaya maine nindiya ganvaai
saari saari raat jaagun dun main duhaai
kahun kya main aage neha laage ji na laage
koi dushman tha ye mann mera
ban gaya meet ja ke tera
kora kaagaz tha ye mann mera
likh liya naam is pe tera
baagon men phoolon ke khilane se pahale
tere mere nainon ke milane se pahale
kahaan ki ye baaten
mulaaqaaten
Aisi Raaten
Toota Taara Tha Ye Mann Mera
Ban Gaya Chaand Hoke Tera!!

Thursday 5 December 2013

ఎవరో ఒకరు ఎపుడో అపుడు

                
చిత్రం: అంకురం
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: ఎస్ పి బాలు, చిత్ర
సంగీతం: హంసలేఖ


ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు..
మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి
మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి
వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు..

౧. కదలరు ఎవ్వరు వేకువ వచ్చినా
అనుకొని కోడి కూత నిదరపోదుగా
జగతికి మేలుకొలుపు మానుకోదుగా
మొదటి చినుకు సూటిగా దూకి రానిదే
మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే
వాన ధార రాదుగా నేల దారికి
ప్రాణమంటు లేదుగా బ్రతకటానికి!!ఎవరో!!


౨. చెదరకపోగా చిక్కని చీకటి
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి
దానికి లెక్క లేదు కాళరాతిరి
పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతిని
రెప్ప వెనక ఆపనీ కంటి నీటిని
సాగలేక ఆగితే దారి తరుగునా
జాలి చూపి తీరమే దరికి చేరునా!!ఎవరో!!


౩. యుగములు సాగినా నింగిని తాకక
ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా
ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా
ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే
అంత వాడి ఆవిరై వెల్లి చేరదా
అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా
నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా!!ఎవరో!!

నిగ్గదీసి అడుగు

       
చిత్రం: గాయం
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: ఎస్ పి బాలు
సంగీతం: శ్రీ

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం

గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ ఙానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలనే సూక్తి మరవకుండ
శతాబ్దాలు చదవలేద ఈ అరణ్య కాండ