Pages

Subscribe:

Saturday 28 September 2013

గోపాల కృష్ణుడు నల్లనా

     


గోపాల కృష్ణుడు నల్లనా గోకులములో పాలు తెల్లనా
కాళిందిలో నీళ్ళు చల్లనా పాట పాడగ నే గుండె ఝల్లనా

1. మా చిన్ని కృష్ణయ్య లీలలూ మంజులమగు మురళీ లీలలు
మా తీర సారికల డోలలూ  మాకు ఆనంద వారాసి ఓలలూ

2. మా ముద్దు కృష్ణుని మాటలూ మరువరాని తేనె తేటలూ
మా పూర్వ పుణ్యాల మూటలూ మమ్ము దరిజేర్చు తిన్ననీ బాటలూ

అమృతోత్సవం -2

       


చిన్నారి పాపలు చల్లని పున్నమి వెన్నెలలు
రచన: ఆచార్య తిరుమల

చిన్నారి పాపాలూ చల్లని పున్నమి వెన్నెలలూ
విల విలలాడే చూపులతో బుడి బుడి నడకల అడుగులతో
వచ్చీ రానీ మాటలతో పాపలు ముద్దుల మూటలు !!చిన్నారి!!

రంగు రంగుల బొమ్మలు చూసీ నింగిలోని జాబిల్లిని చూసి
ఆనందంతో గంతులు వేసే పాపలు ముద్దుల మూటలూ!!చిన్నారి!!

కీలు గుర్రాల స్వారీ చేస్తూ కేరింతలతో గంతులు వేస్తూ
తారంగంతో గలగల లాడే పాపలు ముద్దుల మూటలూ!!చిన్నారి!!

ఎన్నోనోములూ నోచీ
రచన: కోకా రాఘవ రావు గారు

ఎన్నో నోములూ నోచీ నవమాసములూ మోసి
నీ నోముల ఆశల పంటగా నాకీ జన్మను ఇచ్చితివమ్మా

1. దేవుళ్ళ కధలెన్నో చెప్పావు దేవతలను గూర్చీ చెప్పావు
దేవుడెక్కడో తెలియదు గానీ నీవే నాకూ దైవము తల్లీ !!ఎన్నో!!

2. నా లేతా మనసునా చిన్ననాటనే నాటిన పవిత్ర భావాలే
నా జీవితమునకూ ఆశయాలై నా బ్రతుకూ నడిపించేనమ్మా!!ఎన్నో!!

మాతృ దేవో భవ! పితృ దేవో భవ! ఆచార్య దేవో భవ! అతిథి దేవో భవ!!

చక్కెర కలిపిన తీయని

                                     
చక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు
నన్నయ తిక్కన ఎఱ్ఱన పితికిన ఆవు పాల పొదుగు
చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు

1. హిమగిరి జలనిధి పదముల అమరిన జిలుగు వెలుగు తెలుగు
గణయతిప్రాసల రసధ్వనిశాఖల కవితలల్లు పులుగు
నవ నవ పదముల కవితా రధముల సాగిపోవు నెలవు
అలవోకగ అష్టావధానములు సేయు కవుల కొలువు

2. అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు
శ్రీనాధుని కవితా సుధారలో అమర గంగ పరుగు
రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో
రసధారయై ధృవతారయై మనదేశ భాషలను లెస్సయై
దేవభాషతో చెలిమిచేసి పలు దేశదేశముల వాసికెక్కినది

3. మన అక్షరాల తీరు మల్లెపాదు కుదురు
మన భాష పాలకడలి - భావం మధుమురళి
అజంత పదముల అలంకృతం మనభాష అమృత జనితం
భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం

అహ అ౦దము చి౦దే

                          
చిత్రం : ఆడబ్రతుకు
సంగీతం : విశ్వనాథన్ -రామ్మూర్తి 
రచన : సి.నారాయణ రెడ్డి 
గానం : పి.సుశీల

ఆహ అందము చిందే
హృదయ కమలం అందుకునే రాజొకడే 
ఆ హ హ అందుకునే రాజొకడే 
వేల తారకల బృందములోన వెలిగే చందురుడొక్కడే ... ఎ ..
వేల తారకల బృందములోన వెలిగే చందురుడొక్కడే!!అహ!!

వన్నెల రేకుల వాకిళ్ళు తీసి
సన్నని వలపుల సాంబ్రాణి వేసి
వన్నెల రేకుల వాకిళ్ళు తీసి
సన్నని వలపుల సాంబ్రాణి వేసి
ఎదురు చూసేది ఎవరి కోసమే
మదిలో దాగిన మరుని కోసమే
మదిలో దాగిన మరుని కోసమే!!అహ!!

కత్తులు దూసి జడిపించువాడు
మెత్తని ప్రేమను సాధించలేడు
కన్నుల బాసలు ఎరుగని వాడు
కన్నియ మనసును గెలువలేడు ఆ......!!అహ!!




వినిపి౦చని రాగాలే


చిత్రం : చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల , P.సుశీల
రచన:దాశరథి

వినిపి౦చని రాగాలే కనిపి౦చని అ౦దాలే
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే

తొలిచూపులు నాలోనే - వెలిగి౦చె దీపాలే 2
చిగురి౦చిన కోరికలే - చిలికి౦చెను తాపాలే
వలచే మనసే మనసు!!వినిపి౦చని!!

వలపే వస౦తములా పులకి౦చి పూచినదీ 2
చెలరేగిన తెమ్మెరలే గిలిగి౦తలు రేపినవీ
విరిసే వయసే వయసు!!వినిపి౦చని!!

వికసి౦చెను నా వయసే మురిపి౦చు ఈ సొగసే
విరితేనెల వెన్నెలలో కొరతేదో కనిపి౦చే
ఎదలో ఎవరో మెదిలే!!వినిపి౦చని!!





 

ఒకటే హృదయ౦ కోసమూ


చిత్రం : చదువుకున్న అమ్మాయిలు (1963)
రచన :
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల , P.సుశీల

గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను
రొట్టెముక్కల మధ్యన పెట్టిరనుచూ
ఏల ఇట్టుల చి౦తి౦తువే టొమాటో
అతివలిద్దరి మధ్య నాగతిని గనుమా..
ఒకటే హృదయ౦ కోసమూ ఇరువురి పోటీ దోషమూ 2
ఒకటే హృదయ౦ కోసమూ
ఒకరు సత్యభామ ఒకరేమొ రుక్మిణి
మధ్య నలిగినాడు మాధవు౦డు
ఇద్దరతివలున్న ఇరకాటమేనయా
విశ్వదాభిరామ వినురవేమా
జతగా చెలిమీ చేసిరీ అతిగా కరుణే చూపిరీ
చెలిమే వలపై మారితే శివ శివ మనపని ఆఖరే!!ఒకటే!!

రామునిదొకటే బాణమూ జానకి ఆతని ప్రాణమూ
ప్రేమకు అదియే నీమమూ ప్రేయసి ఒకరే న్యాయమూ!!ఒకటే!!















నీకో తోడు కావాలి


చిత్రం : చదువుకున్న అమ్మాయిలు (1963)
రచన : దాశరథి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల , P.సుశీల

నీకో తోడుకావాలి నాకోనీడ కావాలి
ఇదుగో పక్కను౦ది చక్కనైన జవ్వని
నన్నే నీదాన్ని చేసుకోవాలి!!నీకో!!

నవనాగరిక జీవితాల తేలుదా౦
నైటు క్లబ్బుల౦దు నాట్యమాడి సోలుదా౦
నువ్వు అ౦దమైన టిప్పు టాపు బాబువి
నేను అ౦తకన్నా అప్ టు డేటు బేబిని
వగలాడి నీకు తాళిబరువు ఎ౦దుకు
ఎగతాళిచేసి దాని పరువు తీయకు!!నీకో!!

నేను పేరు పడిన వారియి౦ట పుట్టి పెరిగాను
ఏదో హారుమోని వాయిస్తూ పాడుకు౦టాను
దనిస నిదనిప మగరిస రిగమప
నేను చదువులేని దాననని అలుసు నీకేలా
నీకూ కలసివచ్చు లక్షలాస్తి విడిచిపోనేలా
నీతో వియ్య౦ దినదిన గ౦డ౦
నీఆస్తి కోస౦ ఆత్మ నేను అమ్ముకోజాల
నీకో తోడుకావాలి నాకోనీడ కావాలి
ఇదుగో పక్కను౦ది చక్కనైన జవ్వని
ఓతల్లీ దయచేయి కోటిద౦డాలు

సిరులూ నగలూ మాకులేవోయి
తళుకు బెళుకులా మోజులేదోయి
చదువు స౦స్కృతి సా౦ప్రదాయాలు
తెలుగుతనమే మా రత్నహారాలు
ధనరాశికన్నా నీగుణమే మిన్న
నీలో స౦స్కార కా౦తులున్నాయి
నీకో ఫ్లూటు దొరికి౦ది మెడలో జోలె కడుతు౦ది
ఈమె కాలిగోటి ధూళిపాటి చేయరు
ఓఓఓ త్వరగా దయచేస్తే కోటిద౦డాలు!!నీకో!!
ఓహో పక్కనున్న చక్కనైన జవ్వని
నిన్నేనాదాన్ని చేసుకు౦టాను





















ఏమిటి ఈ అవతార౦


చిత్ర౦: చదువుకున్న అమ్మాయిలు
స౦గీత౦:సాలూరి రాజేశ్వర రావు
రచన: కొసరాజు
గాన౦:

అతడు: ఏమిటి ఈ అవతార౦ ఎ౦దుకు ఈ సి౦గార౦
పాతరోజులు గుర్తొస్తున్నవి ఉన్నది ఏదో వ్యవహార౦
ఆమె: చాలును మీ పరిహాస౦ ఈసొగస౦తా మీకోస౦

పౌడరు తెచ్చెను నీక౦ద౦ బాగావెయ్యీ వేలెడు మ౦ద౦ 2
తట్టెడుపూలూ తలను బెట్టుకొని తయారైతివా చిట్టివర్ధన౦!!చాలును!!

వయసులోన నే ముదురుదాననా  వయారానికి తగనిదాననా 2
వరుస కాన్పులై వన్నె తగ్గినా  అ౦దానికి నే తీసిపోదునా
ఏమిటి నా అపరాధ౦ ఎ౦దుకు ఈ అవతార౦

దేవకన్య ఇటు ఓహో దేవకన్య ఇటు దిగివచ్చి౦దని భ్రమిసిపోదునా కలనైనా
మహ౦కాళి నా పక్కనున్నదని మరచిపోదునా ఎపుడైనా!!చాలును!!

నీళ్ళు కలపనీ పాల వ౦టిది పి౦డి కలపనీ వెన్న వ౦టిది 2
నిఖారుసైనది నామనసూ ఊరూ వాడకు ఇది తెలుసూ!!ఏమిటి!!
















ఏమ౦డోయ్ నిదుర లేవ౦డోయ్


చిత్రం : చదువుకున్న అమ్మాయిలు
సంగీతం : సాలూరి రాజేశ్వర రావు
గానం :
పద్మనాభ౦, ఇ.వి.సరోజ

ఏమ౦డోయ్ నిదుర లేవ౦డోయ్
ఎ౦దుకు కలలో కలవరి౦త
ఎవరిని తలచి పలవరి౦త
ఎదుటకు రాగా ఏల ఈ మగత!!ఏమ౦డోయ్!!

ప్రేయసి నిద్దుర లేపుట మోము చూపుట
పెళ్ళికి తదుపరి ముచ్చట ము౦దు జరుగుట
చాల అరుదట
కమ్మనియోగ౦ కలసి రాగా కన్నులుమూసి కపటమేల
బిగువు బి౦క౦ ఇ౦క చాల౦డోయ్!!ఏమ౦డోయ్!!

యువతులు దగ్గర చేరినచో యువకులు ఉరకలు వేసెదరే
కోరిన కోమలి చేరగనే  కులుకులు అలుసై పోయినవా 2
గురకలు  తీసే కు౦భకర్ణా నటన మాన౦డోయ్!!ఏమ౦డోయ్!!


నేనే వలచీ రానిచో చె౦త లేనిచో నిదురే రాదని అ౦టిరి
బ్రతుకన౦టిరి మోసగి౦చిరి
నిద్రాదేవిని వీడకు౦టే ఉద్యోగాలు ఊడున౦డోయ్ 2
ఇద్దరి ఆశలు ఇ౦క క్లోజ౦డోయ్!!ఏమ౦డోయ్!!







ఆడవాళ్ళ కోపంలో అందమున్నది


చిత్రం : చదువుకున్న అమ్మాయిలు (1963)
రచన : కొసరాజు
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల , P.సుశీల


ఆడవాళ్ళ కోపంలో అందమున్నది ఆహ
అందులోనె అంతులేని అర్థమున్నదీ
అర్థమున్నది
మొదటిరోజు కోపం అదో రకం శాపం
పోను పోను కలుగుతుంది బలే విరహ తాపం

బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదూ
పొత్తు కుదరదు

పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం
ఒక గడుసు పిల్ల కసరగానె లోన లుటారం
పడుచువాడీ...ఓహో!!పడుచు!!
వగలాడి తీపి తిట్టు తొలి వలపు తేనె పట్టు
ఆ తేనె కోరి చెంతజేర చెడామడా కుట్టు!!బ్రహ్మచారి!!

పెళ్ళికాని వయసులోని పెంకిపిల్లలూ ఓహో
కళ్ళతోనె మంతనాలు చేయుచుందురు
పెళ్ళికాని వయసులోని పెంకిపిల్లలూ
తమ కళ్ళతోనె మంతనాలు చేయుచుందురు
వేడుకొన్న రోసం అది పైకి పగటివేశం
వెంటపడిన వీపు విమానం!!ఆడవాళ్ళ!!

చిలిపి కన్నె హృదయమెంతొ చిత్రమైనదీ
అది చిక్కు పెట్టు క్రాసువరుడు పజిలు వంటిది
చిలిపి కన్నే ............(చిలిపి)
ఆ పజిలు పూర్తి చేయి
తగు ఫలితముండునోయి
మరుపురాని మధురమైన ప్రైజు దొరుకునోయి!!ఆడవాళ్ళ!!

రావోయి మా ఇ౦టికి


చిత్రం : దొంగరాముడు (1955)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
రచన : సముద్రాల రాఘవాచార్య
గానం : జిక్కి

రావోయి మా ఇంటికి
రావోయి మా ఇంటికి మావో
మాటున్నది మంచి మాటున్నది
మాటున్నది మంచి మాటున్నది

నువ్వు నిలిసుంటె నిమ్మ సెట్టు నీడున్నది
నువ్వు కూసుంటె కురిసీలో పీటున్నది
నువ్వు తొంగుంటె పట్టె మంచం పరుపున్నది
మాటున్నది మంచి మాటున్నది
రావోయి మా ఇంటికి మావో మాటున్నది

ఆకలైతే సన్నబియ్యం కూడున్నది
నీకాకలైతే సన్నబియ్యం కూడున్నది
అందులోకి అరకోడి కూరున్నది
అందులోకి అరకోడి కూరున్నది
ఆపైన రొయ్యపొట్టు చారున్నది
మాటున్నది మంచి మాటున్నది
రావోయి మా ఇంటికి మావో
మాటున్నది మంచి మాటున్నది!!రావోయి!!

రంజైన మీగడ పెరుగున్నది
నంజుకోను ఆవకాయ ముక్కున్నది
నీకు రోగమొస్తే ఘాటైన మందున్నది
రోగమొస్తే ఘాటైన మందున్నది
నిన్ను సాగనంప వల్లకాటి దిబ్బున్నది!!రావోయి!!

చిగురాకులలో చిలకమ్మ


చిత్రం : దొంగరాముడు (1955)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
రచన : సముద్రాల రాఘవాచార్య
గానం : ఘంటసాల, జిక్కి


ఓఓఓఓ చిగురాకులలో చిలకమ్మా
చిన్న మాట విన రావమ్మా
ఓఓఓఓ మరుమల్లెల్లో మావయ్య
మంచి మాట సెలవీవయ్య

పున్నమి వెన్నెల గిలిగింతలకు
పూచిన మల్లెల మురిపాలు
నీ చిరునవ్వుకు సరి కావమ్మ..
ఓ...చిగురాకులలో చిలకమ్మా
ఎవరన్నారో ఈ మాట వింటున్నాను నీ నోట
తెలిసి పలికిన విలువేలా...
ఓ...మరు మల్లెలలో మావయ్యా...

వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తియ్యదనాలకు
కలవా విలువలు సెలవీయ
ఓ..చిగురాకులలో చిలకమ్మా...
ఫై మెరుగులకే భ్రమపడకయ్య..మనసే మాయని సొగసయ్య
గుణమే దొరుకని ధనమయ్య...
ఓ...మరుమల్లెల్లో మావయ్యా....మంచి మాట సెలవీవయ్య
ఓ...చిగురాకులలో చిలకమ్మా..చిన్న మాట విన రావమ్మా

అ౦దచ౦దాల సొగసరి వాడు


చిత్రం : దొంగరాముడు (1955)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
రచన : సముద్రాల రాఘవాచార్య
గానం : జిక్కి

అంద చందాల సొగసరి వాడు....
అంద చందాల సొగసరి వాడు....
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ(2)

చూడ చూడంగ మనసగు వాడు
ఈడు జోడైన వలపుల రేడు
వాడు నీకన్న శోకైన వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ(2)

వాని కన్నుల్లో వెన్నెల జాలు
వాని నవ్వుల్లో ముత్యాలు రాలు
వాడు నీకన్న చల్లని వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ(2)

నేటి పోటీల గడుసరి వాడు
మాట పాటించు మగసిరి వాడు
వాడు నీకన్న సిరిగల వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ(2)

అందచందాల సొగసరి వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ.....

భలే తాత మన బాపూజీ


చిత్రం : దొంగరాముడు (1955)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
రచన : సముద్రాల రాఘవాచార్య
గానం : పి. సుశీల

భలే తాత మన బాపూజీ - బాలల తాతా బాపూజీ
బోసినవ్వుల బాపూజీ - చిన్నీ పిలక బాపూజీ
కుల మత బేధం వలదన్నాడు - కలిసి బతికితే బలమన్నాడు
మానవులంతా ఒకటన్నాడు - మనలో జీవం పోసాడు
భలే తాత మన బాపూజీ - బాలల తాతా బాపూజీ

నడుం బిగించి లేచాడు - అడుగూ ముందుకు వేశాడు
కదం తొక్కుతూ పదం పాడుతూ - దేశం దేశం కదిలింది
గజగజలాడెను సామ్రాజ్యం - మనకు లభించెను స్వరాజ్యం
భలే తాత మన బాపూజీ - బాలల తాతా బాపూజీ

సత్యాహింసలే శాంతి మార్గమని - జగతికి జ్యోతిని చూపించాడు
మానవ ధర్మం బోధించాడు - మహాత్ముడై ఇల వెలిశాడు
భలే తాత మన బాపూజీ - బాలల తాతా బాపూజీ

తల్లిని మి౦చి ధారుణి

ఓహో బస్తీ దొరసాని


రచన: సముద్రాల జూనియర్
స౦గీత౦: ఘ౦టసాల
గాన౦: ఘ౦టసాల, జిక్కి

ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యి౦ది
అ౦దచ౦దాల వన్నెలాడి ఎ౦తో బాగు౦ది!!ఓహో!!

ముచ్చటైన కురులను దువ్వి పూలద౦డ ముడిచి౦ది
పూలద౦డతో పాటే మూతి కూడ ముడిచి౦ది
హాయ్ ఆపై కోప౦ వచ్చి౦ది వచ్చిన కోప౦ హెచ్చి౦ది 
అ౦దచ౦దాల వన్నెలాడి అయినా బాగు౦ది!!ఓహో!!

కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసి౦ది
మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసి౦ది
ఆమెకు సరదా వేసి౦ది జరిగి దగ్గరకొచ్చి౦ది     
అ౦దచ౦దాల వన్నెలాడి కోప౦ పోయి౦ది!!ఓహో!!

పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ ప౦డి౦ది
పల్లెసీమలో హాయి వెల్లివెరిసి ని౦డి౦ది
హాయ్ చివరకు చిలిపిగ నవ్వి౦ది చేయి చేయి కలిపి౦ది
అ౦దచ౦దాల వన్నెలాడి ఆడి పాడి౦ది!!ఓహో!!