Pages

Subscribe:

Friday 18 October 2013

ఏమని పాడెదనో ఈవేళా

  
చిత్రం : భార్యాభర్తలు
రచన : శ్రీశ్రీ
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : పి.సుశీల
రాగం: సింధుభైరవి

ప: ఏమని పాడెదనో ఈవేళా...
ఏమని పాడెదనో ఈవేళా...
మానసవీణ మౌనముగా నిదురించిన వేళ
ఏమని పాడెదనో ఈవేళా...

1. జగమే మరచి హృదయం విపంచి
జగమే మరచి హృదయం విపంచి
గారడిగా వినువీధి చరించి
గారడిగా వినువీధి చరించి
కలత నిదురలో కాంచిన కలలే గాలిమేడలై కూలిన వేళ
ఏమని పాడెదనో ఈవేళా...

2: వనసీమలలో హాయిగ ఆడే
వనసీమలలో హాయిగ ఆడే
రా చిలుకా నిను రాణిని చేసే
రా చిలుకా నిను రాణిని చేసే
పసిడి తీగలా పంజర మిదిగో పలుక వేమని పిలిచే వేళ
ఏమని పాడెదనో ఈవేళా...
మానసవీణ మౌనముగా నిదురించిన వేళ
ఏమని పాడెదనో... ఓ... ఓ...

0 comments:

Post a Comment