Pages

Subscribe:

Tuesday 22 October 2013

ఆకాశ పందిరిలో

            
చిత్రం: శ్రీ రాజరాజేశ్వరీవిలాస్ కాఫీ క్లబ్
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
రచన: దేవులపల్లి
గానం: సుశీల

ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంటా
అప్సరలే పేరంటాళ్ళు దేవతలే పురోహితులంటా
దీవనలు ఇస్తారంటా||ఆకాశ||

తళుకు బెళుకు నక్షత్రాలు తలంబ్రాలు తెస్తారంటా ||2||
మెరుపు తీగ తోరణాలు మెరిసి మురిసి పోయేనంటా
మరపు రాని... వేడుకలంటా||ఆకాశ||
పిల్ల గాలి మేళ గాళ్ళు పెళ్ళి పాట పాడేరంటా ||2||
రాజహంస జంట చేరీ రత్న హారతిచ్చేరంటా
రాసకేళి...జరిపేరంటా...||ఆకాశ||

వన్నె చిన్నెలా ఇంధ్ర ధనసు పై వెన్నెల పానుపు వేసేనంట ||2||
మబ్బులు తలుపులు మూసేనంటా............
మబ్బులు తలుపులు మూసేనంటా..
మగువలు తొంగి చూసేరంటా
మనలను.. గేలి.. చేసేరంటా..




0 comments:

Post a Comment