Pages

Subscribe:

Friday 18 October 2013

వాడిన పూలే వికసించెనే


చిత్రం: మాంగల్యబలం
రచన: శ్రీశ్రీ, కొసరాజు
సంగీతం: మాస్టర్ వేణు
గానం: పి. సుశీల, ఘంటసాల
రాగం: సింధుభైరవి

ప: వాడిన పూలే వికసించెనే   2సార్లు
చెర వీడిన హృదయాలు పులకించెనే ఏఏ
వాడిన పూలే వికసించెనే
తీయని కలలే ఫలియించెనే
తీయని కలలే ఫలియించెనే
ఎల కోయిల తన గొంతు సవరించెనే ఏఏ
తీయని కలలే ఫలియించెనే

౧. వేయిరేకులు విరిసింది జలజం  
తీయ తేనియ కొసరింది భ్రమరం
లోకమే ఒక వుద్యానవనము  
లోటు లేదిక మనదే సుఖము
తీయని కలలే ఫలియించెనే
ఎల కోయిల తన గొంతు సవరించెనే ఏఏ
తీయని కలలే ఫలియించెనే

౨. పగలే జాబిలి ఉదయించెనేలా
వగలే చాలును పరిహాసమేలా
పగలే జాబిలి ఉదయించెనేలా
వగలే చాలును పరిహాసమేలా
తేట నీటను నీ నవ్వు మొగమే
తేలియాడెను నెల రేని వలెనే!!వాడిన!!

౩. జీవితాలకు నేడే వసంతం
చెదిరిపోవని ప్రేమానుబంధం
ఆలపించిన ఆనంద గీతం
ఆలకించగ మధురం మధురం!!వాడిన!!



0 comments:

Post a Comment