Pages

Subscribe:

Thursday 24 October 2013

ఏ దివిలో విరిసిన పారిజాతమో

                 
చిత్రం: కన్నెవయసు
సంగీతం: మాధవపెద్ది సత్యం
రచన: దాశరథి
గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెదిలిన ప్రేమ గీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే!!ఏ దివిలో!!
నీ రూపమే దివ్య దీపమై నీ నవ్వులే నవ్య తారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే!!ఏదివిలో!!

౧. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే
నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన రాజహంసలా రావే!!ఏ దివిలో!!

౨. నిదుర మబ్బులను మెరుపు తీగవై కళలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా కావ్యకన్యలా రావే!!ఏ దివిలో!!

0 comments:

Post a Comment