Pages

Subscribe:

Saturday 19 October 2013

హాయి హాయిగా ఆమని సాగే

     
                        
చిత్రం : సువర్ణ సుందరి
సంగీతం : ఆది నారాయణ రావు
రచన : సముద్రాల
గానం : ఘంటసాల , జిక్కి
రాగం: రాగమాలిక 

: హాయి హాయిగా ఆమని సాగే
హాయి హాయిగా ఆమని సాగే
సోయగాల గన ఓయి సఖా హాయి సఖా 
హాయి హాయిగా ఆమని సాగే
లీలగా పువులు గాలికి వూగా 
లీలగా పువులు గాలికి వూగా 
లీలగా పువులు గాలికి వూగా
సనిదమ దనిసా గమ గమ దనిసా
రిసనిద సరిసని దనిని దనిని దని
మగద మగద మద గరిగ మదని
లీలగా పువులు గాలికి వూగా
కలిగిన తలపుల వలపులు రేగా
కలిగిన తలపుల వలపులు రేగా
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా
హాయి హాయిగా ఆమని సాగే

. ఏమో ఏమో తటిల్లతికమే మెరుపు
ఏమో తటిల్లతికమే మెరుపు మైమరపేమో
మయిలు రాజు దరి మురిసినదేమో మైమరపేమో
మయిలు రాజు దరి మురిసినదేమో
వలపు కౌగిలుల వాలి సోలి
వలపు కౌగిలుల వాలి సోలి
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా
హాయి హాయిగా ఆమని సాగే

. చూడుమా చందమామ... అటు చూడుమా చందమామ
కనుమా వయ్యారీ శారదయామిని కవ్వించే ప్రేమా చూడుమా చందమామ
వగలా తూలే విరహిణులా..... వగలా తూలే విరహిణులా
మనసున మోహము రేపు నగవులా
మనసున మోహము రేపు నగవులా
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా
హాయి హాయిగా ఆమని సాగే

. కనుగవా తనియగా ప్రియతమా
కలువలు విరిసెనుగా
కనుగవ తనియగా ప్రియతమా
కలువలు విరిసెనుగా  కనుగవ తనియగా
చెలువమూ కనుగొనా......చెలువమూ కనుగొనా
మనసానంద నాట్యాలు సేయునోయీ ...ఆనంద నాట్యాలు సేయునోయీ
సరిగమదనిసా దనిసా సనిసగరిగ సరిసని
దనిమదనిస నిరినిరి దనిదని మదమద గమగమ గమ
దనిసా గమ దనిసాదనిసా


0 comments:

Post a Comment