Pages

Subscribe:

Saturday 19 October 2013

మావిచిగురు తినగానే

      
చిత్రం : సీతామాలక్ష్మి (1978)
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రీ
సంగీతం : కే. వి. మహదేవన్
గానం : S.P.బాలు, P.సుశీల


ప: మావి చిగురు తినగానే కోయిల పలికేనా
మావి చిగురు తినగానే కోయిల పలికేనా
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
ఏమో ఏమనునో గాని ఆమని ఈ వని!!మావి!!

౧. తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా
తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా
తారాటలా సయ్యాటలా్ సయ్యాటలా తారాటలా
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
బింకాలు బిడియాలు పొంకాలు పోడుములు
ఏమో ఎవ్వరిదో గాని ఈ విరి గడసరి!!మావి!!

౨: ఒకరి ఒళ్ళు ఊయ్యాల వేరొకరి గుండె జంపాల
ఊయ్యాల జంపాల జంపాల ఊయ్యాల
ఒకరి ఒళ్ళు ఊయ్యాల వేరొకరి గుండె జంపాల
ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో
ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో
పలకరింతలో పులకరింతలో
పలకరింతలో పులకరింతలో
ఏమో ఏమగునో గాని ఈ కథ మన కథ!!మావి!!

చిత్రం : సీతామాలక్ష్మి (1978)
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రీ
సంగీతం : కే. వి. మహదేవన్
గానం : S.P.బాలు, P.సుశీల

0 comments:

Post a Comment