Pages

Subscribe:

Tuesday 22 October 2013

ప్రేమ లేదనీ ప్రేమంచరాదనీ

   

చిత్రం: అభినందన
సంగీతం: ఇళయరాజా
గానం: ఎస్ పి బాలు
రచన:




ప: ప్రేమ లేదనీ, ప్రేమించరాదనీ
ప్రేమ లేదనీ, ప్రేమించరాదనీ
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటనీ
ప్రియ, జోహారులు

౧. మనసు మాసిపోతే మనిషే కాదని
కటిక రాయికైన కన్నీరుందనీ
వలపుచిచ్చు రగులుకుంటె ఆరిపోదని
గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పనీ
ఉసురు కప్పి మూగబోయి నీవుంటివీ
ఉసురు కప్పి మూగబోయి నీవుంటివీ
మోడుబారి నీడ తోడు లేకుంటినీ

ప్రేమ లేదని లలలాలలాలలా


౨. గురుతు చెరిపివేసీ జీవించాలని
చెరప లేకపోతే మరణించాలని
తెలిసి కూడ చెయ్యలేని వెర్రి వాడిని
గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించనీ!!ప్రేమ!!

0 comments:

Post a Comment