Pages

Subscribe:

Tuesday 22 October 2013

ఎదుట నీవే ఎదలోనా నీవే

       
చిత్రం: అభినందన
సంగీతం: ఇళయరాజ
రచన: ఆత్రేయ
గానం: ఎస్ పి బాలు


ప: ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే

౧. మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం 
అందుకే ఈ గాయం 
మరుపే తెలియని నా హృదయం 
తెలిసీ వలచుట తొలి నేరం 
అందుకే ఈ గాయం 
గాయాన్నైనా మాననీవు
హృదయాన్నైనా వీడిపోవు 
కాలం నాకు సాయం రాదు
మరణం నన్ను చేరనీదు 
పిచ్చి వాన్ని కానీదు అహహహ ఒహొహొహో ఉహుహుహు!!ఎదుటా!!

౨.  కలలకు భయపడి పోయాను ....
నిదురకు దూరం అయ్యాను 
వేదన పడ్డాను 2సార్లు
స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్ని నరకాలేగా 
స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందా 
ప్రేమకింత బలముందా అహహహ...ఒహొహొహొ...ఉహుహుహు... !!ఎదుట!!

0 comments:

Post a Comment