Pages

Subscribe:

Friday 18 October 2013

పాడలేను పల్లవైనా

                  
చిత్రం: సింధుభైరవి
రచన: రాజశ్రీ
సంగీతం: ఇళయరాజా
గానం: చిత్ర
రాగం: సింధుభైరవి

ప: పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను
తోచింది చెప్పాలనీ ఎదుటకొచ్చినిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా

౧. అమ్మజోల పాటలోన రాగమెంత ఉన్నదీ
పంటచేల పాటలోన భాష ఎంత ఉన్నదీ
ఊయలే తాళం పైరగాలే మేళం
మమతే రాగం శ్రమజీవనమే భావం
రాగమే లోకమంతా ఆ ఆ
రాగమే లోకమంతా కష్ట సుఖములే స్వరములంటా
షడ్జమ కోకిల గాన స్రవంతికి పొద్దుపొడుపే సంగతంటా!!పాడలేను!!

౨. రాగానిదేముంది రసికులు మన్నిస్తే
తెలిసిని భాషలోనే తీయగా వినిపిస్తే
ఏ పాటైనా ఎద పొంగిపోదా
ఏప్రాణమైనా తనివితీరిపోదా
చెప్పేది తప్పో ఒప్పో ఓ ఓ
చెప్పేది తప్పో ఒప్పో రహస్యమేముంది విప్పి చెపితే
అహూ ఉహూ రోకటి పాటలో లేదా మధుర సంగీతం
ఆహూ ఊహూ రోకటి పాటలో లేదా మధుర సంగీతం!!పాడలేను!!

మ ప ద మ పాడలేను పల్లవైనా
స రి గమ ప ద మ పాడలేను పల్లవైనా
ప ద ని స ని ద మ గ స రి పాడలేను పల్లవైనా
స స రి గ స రి గ మ గ స ప ద మ
మ మ ప ద మ ప ద ని ద మ ప ద ని
పదనిసరిగ సనిదమ పదనిస
నిదపద నిదమప దమగమ పదమగ మగస
సాసస సా సస సా స సరిగమ గమగసనిద
మా మమ మా మమ మా మ పదనిస నిసనిదమగ
సస రిరి గగ మమ పప దద నిని సస
నిససస నినిదనిద
మపదని దని దదమా
గమగ సరిగమ గమపద మపదని
సరిగమ గమసనిదమగ
మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదా
మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదా
మరి మరి నిన్నే మరి మరి నిన్నే ఏ ఏ...








1 comments:

gopal said...

PL CHECK THE LYRICIST ..

Post a Comment