Pages

Subscribe:

Sunday 20 October 2013

విధి చేయు వింతలన్నీ

                    
చిత్రం : మరోచరిత్ర
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్
గానం : వాణీజయరాం


ప: విధి చేయు వింతలన్నీ
మతిలేని చేతలేనని విరహాన వేగిపోయి
విలపించే కథలు ఎన్నో
విధి చేయు వింతలన్నీ
మతిలేని చేతలేనని విరహాన వేగిపోయి
విలపించే కథలు ఎన్నో

౧.  ఎదురుచూపులో ఎదను పిండగ
ఏళ్ళు గడిపెను శకుంతల
విరహ బాధను మరచిపోవగ
నిదురపోయెను ఊర్మిళ
ఎదురుచూపులో ఎదను పిండగ
ఏళ్ళు గడిపెను శకుంతల
విరహ బాధను మరచిపోవగ
నిదురపోయెను ఊర్మిళ
అనురాగమే నిజమని
మనసొకటే దాని ఋజువని
తుది జయము ప్రేమదేనని
బలియైనవి బ్రతుకులెన్నో!!విధి!!

౨.  వలచి గెలిచీ కలలు పండిన
జంట లేదీ ఇలలో
కులము మతమో ధనము బలమో
గొంతు కోసెను తుదిలో
అది నేడు జరుగరాదని
ఎడబాసి వేచినాము
మనగాథే యువతరాలకు
కావాలి మరో చరిత్ర కావాలి మరో చరిత్ర
విధి చేయు వింతలన్నీ
మతిలేని చేతలేనని విరహాన వేగిపోయి
విలపించే కథలు ఎన్నో విలపించే కథలు ఎన్నో





0 comments:

Post a Comment