Pages

Subscribe:

Tuesday 22 October 2013

ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం

                    
చిత్రం: కార్తీకదీపం
సంగీతం: మాధవపెద్ది సత్యం
రచన: దేవులపల్లి
గానం: పి సుశీల, జానకి


ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం
చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం
ఇదే సుమా నా కుంకుమ తిలకం
ఇదే సుమా నా మంగళ సూత్రం!!ఆరనీకుమా!!

౧. ఇంటిలోన నా పాప రూపునా గోరంత దీపం
కంటికెదురుగా కనపడు వేళల కొండంత దీపం
నా మనస్సులో వెలిగే దీపం
నా మనుగడ నడిపే దీపం!!ఆరనీకుమా!!

౨. ఆకాశాన ఆ మణిదీపాలే ముత్తైదువలుంచారో
ఈకోనేటా ఈ చిరుదివ్వెల చూసి చుక్కలనుకుంటారు
ఏమైనా ఏదైనా కోవెలలో కొలువై ఉండే
దేవికి పట్టిన హారతులే!!ఆరనీకుమా!!

౩. నోచిన నోములు పండెనని ఈ ఆనందదీపం
నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశాదీపం
ఎటనైనా ఎపుడైనా నే కొలిచే కళ్యాణదీపం
నేవలచే నాప్రాణ దీపం!!ఆరనీకుమా!!



0 comments:

Post a Comment