Pages

Subscribe:

Saturday 19 October 2013

వసంత గాలికి వలపులు రేగ

      


చిత్రం: శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కథ
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: మంగళంపల్లి బాల మురళీకృష్ణ, యస్ జానకి

ప: వసంత గాలికి వలపులు రేగ వరించు బాలిక మయూరి కాగ
తనువు మనసు ఊగి తూగి ఒక మైకం కలిగేనులే
మహిమ నీదేనులే ప్రేమతీరు ఇంతేనులే

౧. రవంత సోకిన చల్లని గాలికి మరింత కోరిన వసంతుడనగా
తనువు మనసు ఊగి తూగి లోకం మారేనులే
మహిమ నీదేనులే ఆహా భలే హాయిలే

౨. విలాస మాధురి వెన్నెల కాగా విహార వీణలు విందులు కాగా
ఏకాంతంలో నీవూ నేనే ఒక స్వర్గం కనుపించెనే
మహిమ నీదేనులే ప్రేమ తీరు ఇంతేనులే

0 comments:

Post a Comment