Pages

Subscribe:

Saturday 19 October 2013

ముందు తెలిసెనా ప్రభూ



చిత్రం: మేఘసందేశం
రచన: దేవులపల్లి
సంగీతం: రమేష్ నాయుడు

గానం: పి సుశీల
రాగం:

ముందు తెలిసెనా ప్రభూ
మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు
మధుర క్షణమేదో.. కాస్త||ముందు తెలిసెనా||

అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే !!2!!
సుందర మందార కుంద సుమదళములు పరువనా !!2!!
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును||ముందు తెలిసెనా||

బ్రతుకంతా ఎదురు చూచు పట్టున రానే రావు !!2!!
ఎదుర రయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు !!2!!
కదలనీక నిముసము నను వదలి పోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హౄదయము సంకెల చేసి||ముందు తెలిసెనా||



0 comments:

Post a Comment