Pages

Subscribe:

Sunday 20 October 2013

కనులు పలుకరించెను

                  


చిత్రం : ఆడబ్రతుకు
రచన : డా.సి.నారాయణరెడ్డి
సంగీతం: విశ్వనాథన్ - రామ్మూర్తి
గానం: పి బి శ్రీనివాస్ 

ప: కనులు పలుకరించెను  
పెదవులు పులకించెను
బుగ్గలపై లేత లేత సిగ్గులు
చిగురించెను

౧. నిన్ను నేను చూసేవేళ...
నన్ను నీవు చూడవేల (2)
నేను పైకి చూడగానే... నీవు నన్ను చూతువేల
తెలిసిపోయె నీలో ఏదో వలపు తొంగిచూసెను

౨. మొలక నవ్వు దాచుకోకు... జిలుగుపైట జారనీకు (2)
కురులు చాటు చేసుకోకు... తెరలు లేవు నీకు నాకు
తెలిసిపోయె నీలో ఏదో వలపు తొంగిచూసెను

౩. అందమైన జలపాతం... ఆలపించె తీయని గీతం
ఒహొహో ఒహొహో... ఒహొహో...
అందమైన జలపాతం... ఆలపించె తీయని గీతం
కనిపించని నీ హృదయంలో...
వినిపించెను నా సంగీతం
తెలిసిపోయె నీలో ఏదో వలపు తొంగిచూసెను






0 comments:

Post a Comment