Pages

Subscribe:

Tuesday 19 November 2013

నగుమోము గనలేని

                


చిత్రం: వివాహ బంధం
సంగీతం: ఎమ్ బి శ్రీనివాసన్
రచన: త్యాగరాజ స్వామి
గానం: భానుమతీ రామకృష్ణ

ప. నగు మోము కన లేని నా జాలి తెలిసి

నన్ను బ్రోవ రాదా శ్రీ రఘువర నీ (నగు)

అ. నగ రాజ ధర నీదు పరివారులెల్ల
ఒగి బోధన జేసే వారలు కారేయటులుండుదురే నీ (నగు)

చ. ఖగ రాజు నీయానతి విని వేగ చన లేడో
గగనానికిలకు బహు దూరంబనినాడో
జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు
వగ జూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజ నుత నీ (నగు)

కమ్మనీ ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే

                 
చిత్రం: గుణ
సంగీతం:
రచన:
గానం: ఎస్ పి బాలు,


కమ్మనీ ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఊహలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో
ఓహో... కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
గుండెల్లో గాయమేమో చల్లంగ మానిపోయె మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది
నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నదీ
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచ్ఛమైనదీ
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
ఉమాదేవిగా శివుని అర్థభాగమై నాలోన నిలువుమా
శుభ లాలి లాలి జో లాలి లాలి జో
ఉమాదేవి లాలి లాలి జో లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
నా హృదయమా...




పూసింది పూసింది పున్నాగ

      
చిత్రం: సీతారామయ్య గారి మనవరాలు
సంగీతం:కీరవాణి
రచన: వేటూరి
గానం: ఎస్ పి బాలు, చిత్ర

ప.పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ జతులాడ
పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

1. ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికె నీ నడకే వయ్యారంగ
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కధ చెప్పాయిలే
అనుకోని రాగమే అనురాగ దీపమై
వలపన్న గానమే ఒక వాయు లీనమై
పాడె మది పాడె!!పూసింది!!

2. పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా
అరవిచ్చేటి ఆ భేరి రాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
అల ఎంకి పాటలే ఇల పూల తోటలై
పసి మొగ్గరేకులే పరువాల చూపులై
పూసె విరబూసె!!పూసింది!!

ముందరున్న చిన్నదాని అందమేమో

     
చిత్రం : కాలం మారింది (1972)
సంగీతం : సాలూరి రాజేశ్వర రావు 
రచన : దాశరథి 
గానం :ఘంటసాల, సుశీల

ముందరున్న చిన్నదాని అందమేమో
చందమామ సిగ్గు చింది సాగిపోయే దాగిపోయే(2)
పొందు కోరు చిన్నవాని తొందరేమో
మూడుముళ్ల మాట కూడా మరచిపోయే తోచదాయే

పాలబుగ్గ పిలిచింది ఎందుకోసమో ఎందుకోసమో
పైట కొంగు కులికింది ఎవరికోసమో ఎవరికోసమో
నీలోని పొంగులు నావేనని(2)
చెమరించు నీ మేను తెలిపెలే
పొందు కోరు....

కొంటె చూపు రమ్మంది ఎందుకోసమో ఎందుకోసమో
కన్నె మనసు కాదంది ఎందుకోసమో ఎందుకోసమో
సరియైన సమయం రాలేదులే(2)
మనసైన తొలిరేయి మనదిలే..
ముందరున్న ...

ఎన్నాళ్ళు మనకీ దూరాలు ఏనాడు తీరునీ విరహాలు
కాదన్న వారు ఔనన్నా నాడు కౌగిళ్ళ కరిగేది నిజములే...
ముందరున్న ...

Ho maine pyar kiya

                 
Film : Jis Desh Mein Ganga Behti Hai ( 1960)
Lyrics : Hasrat Jaipuri
Music : Shankar, Jaikishan
Singer : Lata Mangeshkar

ho maine pyaar kiyaa oy hoy kyaa jurm kiyaa
in aankhon kaa rang ho gayaa gulaabi-gulaabi
Haay haay haay dil ki haalat sharaabi-sharaabi


Ho maine pyaar kiyaa ...

Thar-thar man meraa kaanpe aankh meri sharamaaye
O gore-gore tan par aaj pasinaa aaye
Haay kahaan tak dil sambhaaloon
Tir saa chubhaa kaise nikaaloon hoy
Ho badh gai aur dil ki betaabi-betaabi
Ho maine pyaar kiya oy hoy kya jurm kiya song lyrics on http://www.lyricsoff.com

Ko :haay haay haay dil ki haalat ...
La :ho maine pyaar ...

La :jab-jab unako dekhoon aane lage angadaai
Ko :jab-jab unako dekhoon aane lage angadaai
La :dhire-dhire aakir band kali muskaai
Ko :dhire-dhire aakir band kali muskaai
La :haay karoon kyaa hosh nahin hai
Ham kahin aur dil kahin hai hoy
Ho ban-ban dole umariyaa shabaabi-shabaabi
Ko :haay haay haay dil ki haalat ...
La :ho maine pyaar ...

Kyaa hain khataayen meri aaj koi batalaaye
Ho kaun se dil ko todaa kaun se dil tadapaaye
Pyaar kiyaa hai pyaar ko jaanoon
Aur koi insaaf naa maanoon hoy
Ho pyaar ki har adaa laajavaabi-laajavaabi
Ko :haay haay haay dil ki haalat ...
La :ho maine pyaar ...




తెలిసిందిలే తెలిసిందిలే

                    
చిత్రం :  రాముడు భీముడు (1964)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
రచన : సి.నారాయణ రెడ్డి 
గానం : ఘంటసాల, పి.సుశీల
 
తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే
తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే
చలిగాలి రమ్మంటూ పిలిచిందిలే
చెలి చూపు నీ పైన నిలిచిందిలే(2)
ఏముందిలే ఇపుడేముందిలే
మురిపించు కాలమ్ము ముందుందిలే
నీ ముందుందిలే(తెలిసిందిలే)

వరహాల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా ఆ...(2)
అవునందునా కానందునా(2)
అయ్యారే విధి లీల అనుకొందునా అనుకొందునా(తెలిసిందిలే)

సొగసైన కనులేమో నాకున్నవి
చురుకైన మనసేమో నీకున్నది(2)
కనులేమిటో ఈ కధ ఏమిటో(2)
శృతి మించి రాగాన పడనున్నది పడుతున్నది
ఆ....(తెలిసిందిలే)

ఏమో ఏమో ఇది

                 
చిత్రం : అగ్గి పిడుగు (1964)
సంగీతం : రాజన్ - నాగేంద్ర
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : ఘంటసాల , ఎస్. జానకి


ఏమో... ఏమో... ఇది నాకేమొ ఏమొ అయినది ||2||
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఏమో... ఏమో... అది నీకేమి ఏమి అయినది
ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులౌతున్నది
హ... ఏమో ఏమో ఇది...


కనులలో నీ కనులలో నా కలలే పొంగినవి
కురులలో ముంగురులలో నా కోరికలూగినవి
అహ హా.. అహా.. ఆ ఆ..
వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినది
చెంతగా నువు చేరగా గిలిగింతగ తోచినది
గిలిగింతగ తోచినది.. ||ఏమో..||

ఎందుకో సిగ్గెందుకో నా అందాల బొమ్మకు
అందుకో చేయందుకో మరి ఆ వైపు చూడకు
అహహా.. ఓహో.. అహా..
నవ్వుతో.. ముసి నవ్వుతో హోయ్‌..
నను దోచివేయకు
మాటతో సయ్యాటతో నను మంత్రించి వేయకు..
మంత్రించి వేయకు.. ||ఏమో..||

అపరింజి మదనుడే అనువైన సఖుడులే

                  


చిత్రం: మెరుపుకలలు
సంగీతం: ఏ . ఆర్ . రెహమాన్
గానం : అనురాధా శ్రీరామ్
రచన: వేటూరి సుందర రామమూర్తి
అపరంజి మదనుడే అనువైన సఖుడులే
అతడేమి అందగాడే...
వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై
వచ్చె వలపంటివాడే...
వినువీధిలో ఉండే సూర్యదేవుడునే
ఇల మీద ఒదిగినాడే
కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు
శిశుపాలుడొచ్చినాడే
అపరంజి మదనుడే అనువైన సఖుడులే
అతడేమి అందగాడే...అతడేమి అందగాడే...
పోరాట భూమినే పూదోట కోనగా
పులకింప జేసినాడే...పులకింప జేసినాడే...!!
కల్యారి మలమేలు కలికి ముత్యపు రాయి
కన్న బిడ్డతడు లేడే..
నూరేళ్ళ చీకటి ఒకనాడే పోగొట్టి
ఒడిలోన చేరినాడే..
ఇరుకైన గుండెల్లో అనురాగమొలకగా
ఇలబాలుడొచ్చినాడే
ముక్కారు కాలమ్ము పుట్టాడు పూజకై
పుష్పమై తోడు నాకై..




స్వరరాగ గంగా ప్రవాహమే

             
చిత్రం: సరిగమలు
సంగీతం: రవి
రచన: వేటూరి సుందర రామ్మూర్తి
గానం: కె జె ఏసుదాస్

స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే  
ప్రాప్తే వసంతే త్రికాలికే
పలికే కుహు గీతికా
గాన సరసీరుహమాలికా        !! స్వర రాగ !!

గమపని గమపని గమపని గమపని
మపనిస మపనిస మపనిస మపనిస
పనిసగ సగసని సనిపమ పమగమ గ

కొండల లోపల నిండిన నింగిలో
ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో
కురిసెను రాగం ఈనాటికి
మట్టింటి రాయే మాణిక్యమైపోయె
సంగీత రత్నాకరానా
స్వర సప్తకాలే కెరటాలు కాగా
ఆ గంగ పొంగింది లోన          !! స్వర రాగ !!

సని సని సగగస గసగస పమపమ
మగమగ పమపమ నిసనిప సనిసని

చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి
వినిపించు రాగాలనంతాలులే
ఈ చక్రవాకాలు ఎగిరే చక్కోరాలు
జగమంత విహరించు రాగాలులే
పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు
పులకింతలా పుష్యరాగాలులే
మలిసందె దీపాలు గుడిగంట నాదాలు
మౌనాక్షరీ గాన వేదాలులే     !! స్వర రాగ !!