Pages

Subscribe:

Sunday 14 December 2014

గుట్ట మీద గువ్వ కూసింది


చిత్రం: బుద్ధిమంతుడు 
సంగీతం: కె.వి. మహదేవన్ 
రచన: ఆరుద్ర 
గానం: ఘంటసాల, పి సుశీల 

ప: గుట్ట మీద గువ్వ కూసింది
కట్ట మీద కంజు పలికింది(2)
గుడిలోన జేగంట మోగింది
నా గుండెలో తొలివలపు పండింది(2)
గుండెలో తొలివలపు పండింది

౧. నల్లనల్లని మబ్బు నడిచింది
తెల్లతెల్లని అంచు తోచింది
తనువు జలరేఖలై వెలిగింది
చల్లచల్లని జల్లు కురిసింది!!

౨. కొమ్మ మీద వాలి గోరింక
కమ్మకమ్మని ఊసులాడింది
గోరింక తానింక గూడు కట్టకపోతే(2)
కొమ్మ ఎంతో చిన్నబోతుంది(2)

సన్నజాజుల రవళి పిలిచింది
సన్నజాజుల దండ వేసింది(2)
మనసైన జవరాలే వలచింది(2)
మనుగడే ఒక మలుపు తిరిగింది(2)

Thursday 4 December 2014

తలనిండ పూదండ దాల్చిన రాణి


ఆ రజనీకర మోహన బింబము నీ ననుమోమును బోలునటే
కొలనిలోని నవ కమల దళమ్ములు నీ నయనమ్ముల బోలునటే
ఎచట చూచినా ఎచట వేచినా నీ రూపమదే కనిపించినదే
ప: తలనిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వులతోడ మురిపించ బోకే
పూలవానలు కురియు మొయిలువో మొగలి రేకులలోని సొగసువో
నారాణి !!తలనిండ!!

౧. నీమాట బాటలో నిండే మందారాలు నీపాట తోటలో నిగిడే శృంగారాలు
నీమేనిలో పచ్చ సేమంతి అందాలు 2 సార్లు
నీ నీలవేణిలో నిలిచే ఆకాశాలు!!తలనిండ!!



Tuesday 2 December 2014

జయ మంగళం - నిత్య శుభమంగళం

జయ మంగళం - నిత్య శుభమంగళం
జయాజయమంగళం - రామ శుభమంగళం

ఆ సంకనొకబిడ్డ - ఈ సంకనొకబిడ్డ
కడుపులో ఒకబిడ్ద కదలాడగా
ఆరు శాట్ల బియమొండి - మూడుశాట్ల పప్పొండి
సాలకా మా వదినె - సట్లునాకే ||జయ||

అప్పుకొక పల్లెంబు - పప్పుకొక పల్లెంబు
కూరనారకొక్క గుండుపళ్ళెంబు
అప్పులోడు వచ్చి సెప్పుతో కొడతాంటె
అప్పుడే మా బావ పప్పుకేడ్చెనే ||జయ||

నూగులు నుసి బట్టె - గానుగలు గసిబట్టె
పెండ్లికొడుకు నెత్తికి పేండ్లుబట్టె
పెండ్లికొడుకు సిన్నాయన పేండ్లుబట్టాబోయి
గంజిగుంతలోబడి - గుంజులాడ ||జయ||

పల్లెపల్లేదిరిగి - పట్నాలన్నీ దిరిగి
ముల్లోకములు దిరిగి - నిన్నుదెస్చే
మూతి మూడొంకర్లు - నడ్డి నాల్గొంకర్లు
ముచ్చటైన పెండ్లికూతుర - నీకారతీ ||జయ||

ఆ వీధినొక కుక్క - ఈ వీధినొక కుక్క
నట్టనడి వీధిలో నల్లకుక్క
మూడు కుక్కలు కలిసి ముచ్చటాలాడంగ
మూలనున్న పెండ్లికొడుకు మూతినాకే ||జయ||

మంగళం మంగళం మా బావ నెత్తికీ
సూరులో ఉండేటి సుంచెలుకకీ
మంగళం మంగళం మా వదినె కొప్పుకూ
గుంతలో ఉండేటి గోండ్రుకప్పకూ ||జయ||

వదినెకు ఒగసరి బిందెకు బిగుసరి


వదినెకు ఒకసరి - బిందెకు బిగుసరి
బంగారుజడకుచ్చుల మా వదినె
అహ బంగారుజడకుచ్చుల మా వదినె ||వదినెకు||

గాలికి ఎగిరే దుమ్మును జూసి
పౌడరు అంటది మా వదినె
నా ముఖానికంటది మా వదినె ||వదినెకు||

సెరువులొ ఉన్న కప్పలజూసి
బోండాలు అంటది మా వదినె - నేను
బోంచేత్తానంటది మా వదినె ||వదినెకు||

తోపులొ ఉండే తాచును జూసి
వొడ్డాణమంటది మా వదినె - నా
నడుముకు పెట్టమంది మా వదినె ||వదినెకు||

గోడమీద పాకే నల్లులజూసి
బుడ్డొడ్ల బియ్యమనె మా వదినె - నాకు
బువ్వజేసి పెట్టమనె మా వదినె ||వదినెకు||

బండిని నడిపే గాసగాన్నిజూసి
నా మగడన్నది మా వదినె - అహ
బండిలోకి ఎక్కెను మా వదినె ||వదినెకు||

సంప్రదాయ పెళ్ళి పాటలు

       
పెండ్లి కొడుకట బహు పెంకి వాడట మన పెళ్ళికూతుర్ని వీనికెందుకు పెళ్ళి చేస్తిమి
కోమలాంగిరో బహు కోపధారట మన కోమలాంగికి కోపధారిని కోరి తెస్తిమి!!పెండ్లి!!
చదువు రాదట సఖియ సంధ్య లేదట చదువులేని వానికి మనము సఖియని ఇస్తిమి!!పెండ్లి!!

మందయానరో ఈ మందగానికి పొందు మీరగ మందగమనను ఎరక్క చేస్తిమి!!పెండ్లి!!    
ఆహాహా ఈ పెండ్లి కొడుకుని ఎన్నాళ్ళుగ వెదికేరమ్మా 2
ఎన్నాళ్ళూ వెదికేరమ్మా ఏమీ చక్కని వాడమ్మా 2సార్లు
చూపులకు సుందరుడమ్మా చూడా నల్లని వాడమ్మా
ఎంత సొంపైన వాడమ్మా ఎంత సొంపైన వాడమ్మా
ఎంత సొంపైన వాడమ్మా ఎంత సొంపైన వాడమ్మా!! ఆహాహా!!
దండిగా ధర్మామూ లేదు కండా పుష్టీ కలవాడే
కండ పుష్టీ కలవాడే కండాపుష్టీ కలవాడే!!
స్నాన సంధ్యా జపమూ తపమూ ఏమీ ఎరుగని వాడమ్మా 2సార్లు
ఏమీ ఎరుగని వాడమ్మా ఎంతా చక్కని వాడమ్మా 2సార్లు !!ఆహాహా!! 
--------
చింకి పాతల్లు కట్టేటి బావకు
పట్టు పీతాంబరమ్ము లమిరెనే
మా అక్కయ్య పుణ్యాన కలిగేనే
మిక్కిలి సౌభాగ్యమందేనే
మా అక్కయ్యతో పొందు కలిగేనే
కుండా మూకుళ్లలో బోజనాలొనర్చు బావకు
వెండి కంచము గిన్నె లమిరెనే
మా అక్కయ్య పుణ్యాన కలిగేనే
మిక్కిలి సౌభాగ్యమందేనే
మా అక్కయ్యతో పొందు కలిగేనే
కుక్కి మంచంమీద పరుండు బావకు
పట్టి మంచమే పరుపు లమిరెనే
మా అక్కయ్య పుణ్యాన కలిగేనే
మిక్కిలి సౌభాగ్యమందేనే
మా అక్కయ్యతో పొందు కలిగేనే
కాలినడకల పోవు బావ గారికి నేడు
మోటారు కారులు అమరేనే
మా అక్కయ్య పుణ్యాన కలిగేనే
మిక్కిలి సౌభాగ్యమందేనే
మా అక్కయ్యతో పొందు కలిగేనే
చీటికీ మాటికీ చిరుబుర్రులాడేటి బావకు
సుందరమ్మైన సొగసు వచ్చెనే
మా అక్కయ్య పుణ్యాన కలిగేనే
మిక్కిలి సౌభాగ్యమందేనే
మా అక్కయ్యతో పొందు కలిగేనే
అల్లరి చేసేటి కొంటె బావకు నేడు
ముక్కుకు ముకుతాడు వేసేమూ
మా అక్కయ్య పుణ్యాన కలిగేనే
మిక్కిలి సౌభాగ్యమందేనే
మా అక్కయ్యతో పొందు కలిగేనే

Deewana Hua Badal

       
Movie: Kashmir ki kali Music: O.P Nayar Lyrisicist: Shamsul Huda Behari Singers: Mohammad Rafi, Asha Bhosle
दीवाना हुआ बादल  सावन की घटा छाई
ये देख के दिल झूमा, ली प्यार ने अंगडाई
ऐसी तो मेरी तकदीर ना थी तुम सा जो कोई महबूब मिले
दिल आज खुशी से पागल है
जान--वफ़ा तुम खूब मिले
दिल क्यों ना बने पागल क्या तुमने अदा पाई
जब तुम से नजर टकराई सनम जजबात का एक तूफ़ान उठा
तिनके की तरह मैं बह निकली
सैलाब मेरे रोके ना रुका जीवन में मची हलचल और बजने लगी शहनाई
है आज नए अरमानों से
आबाद मेरे दिल की नगरी
बरसों से खिजा का मौसम था
वीरान बड़ी दुनियाँ थी मेरी हाथों में तेरा आँचल आया के बहार आयी

Tuesday 25 November 2014

అందాల ఓ చిలకా అందుకో నా లేఖ

  
చిత్రం : లేత మనసులు (1966)
సంగీతం : M.S.విశ్వనాథన్
రచన :
గానం: పి బి శ్రీనివాస్, పి సుశీల

ప: అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా
అందాల చెలికాడా అందుకో నా లేఖ
నా కనులతో రాశాను ఈ మదిలోన దాచాను

౧. మిసమిసలాడేవెందుకని
తళతళలాడేవేమిటని ||2||
కురులు మోముపై వాలెనేలనో
విరులు కురులలో నవ్వెనెందుకో
అడుగుతడబడే చిలకకేలనో
పెదవి వణికెను చెలియకెందుకో ||అందాల ఓ చిలకా||

౨. మిసమిసలాడే వయసోయి
తళతళలాడే కనులోయి ||2||
కురులు మోముపై మరులు గొనెనులే
విరులు కురులలో సిరులు నింపెలే
అడుగుతడబడె సిగ్గు బరువుతో
పెదవి వణికెలే వలపు పిలుపుతో ||అందాల చెలికాడా||

౩. నీవే పాఠం నేర్పితివి నీవే మార్గం చూపితివి
ప్రణయ పాఠము వయసు నేర్పులే
మధుర మార్గము మనసు చూపులే
నీవు పాడగా నేను ఆడగా
యుగము క్షణముగా గడిచిపోవుగా ||అందాల ఓ చిలకా||

అందెను నేడే అందని జాబిల్లి

 
చిత్రం : ఆత్మగౌరవం (1966)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

ప: అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్నీ ఆతని వెన్నెలలే
అందెను నేడే అందని జాబిల్లి

1.ఇన్నేళ్ళకు విరిసె వసంతములు
ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు
నిదురించిన ఆశలు చిగురించెలే (2)
చెలికాడే నాలో తలపులు రేపెనులే
అందెను నేడే అందని జాబిల్లి

2. నా చెక్కిలి మెల్లగ మీటగనే
నరనరముల వీణలు మ్రోగినవి
గిలిగింతల నా మేను పులకించెలే (2)
నెలరాజే నాతో సరసములాడెనులే
అందెను నేడే అందని జాబిల్లి

3. ఇక రాలవు కన్నుల ముత్యములు
ఇక వాడవు తోటల కుసుమములు
వినువీధిని నామది విహరించెలే (2)
వలరాజే నాలో వలపులు చిలికెనులే ॥



ఒక పూల బాణం తగిలింది మదిలో

   
 చిత్రం : ఆత్మ గౌరవం (1965)
సంగీతం : సాలూరి రాజేశ్వర్ రావు
రచన : దాశరథి
గానం : ఘంటసాల , సుశీల

ప: ఒక పూల బాణం తగిలింది మదిలో
తొలి ప్రేమ దీపం వెలిగింది లే
నాలో వెలిగిందిలే ||ఒక||

1. అలనాటి కలలే ఫలియించే నేడే ||అల
మనసైన వాడే మనసిచ్చి నాడే
ఈ ప్రేమ లో లోకమే పొంగి పోయి
వసంతాల అందాల ఆనందాల ఆడాలొయి!!

౨. ఏ పూర్వ బంధమో అనుబంధమాయె
అపురూప మైన అనురాగ మాయె
నీ కౌగిటా హాయిగా సోలిపోయి
సరదాల ఉయ్యాల ఉల్లాసం గా వూగాలోయి


Friday 14 November 2014

నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని

            


చిత్రం: గులేబకావళి కథ
సంగీతం: జోసఫ్ కృష్ణమూర్తి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

ప: నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి

౧. తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూలదండవోలె కర్పూర కళికవోలె కర్పూర కళికవోలె
ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు
ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు.. సంకెలలు వేసినావు!!

౨. నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై
నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో
ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం
ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం...!!

సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ

              


చిత్రం: కంచుకోట (1961)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల, జానకి

ప: సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ
సురవైభవానా భాసుర కీర్తిలోనా
సురవైభవాన భాసుర కీర్తిలోనా
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ

సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ
సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ
సిరిలోన గానీ మగసిరిలోన గానీ
సిరిలోన గానీ మగసిరిలోన గానీ
సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ

౧. ప్రజలను నీకంటి పాపలుగా కాచి
ఆ...
ప్రజలను నీకంటి పాపలుగా కాచి
పరరాజులదరంగ కరవాలమును దూసి
ప్రజలను నీకంటి పాపలుగా కాచి
పరరాజులదరంగ కరవాలమును దూసి
శాంతిని వెలయించి మంచిని వెలిగించి
శాంతిని వెలయించి మంచిని వెలిగించి
జగతిని లాలించి పాలించినావూ....!!

౨. మరుడే తొందరచేయ విరిబోణులనుగూడి
మధువే పొంగులువార మనసార తూగాడి
ఆ... ఆ... ఆ...
మరుడే తొందరచేయ విరిబోణులనుగూడి
మధువే పొంగులువార మనసార తూగాడి
నవ్వులు చిలికించి మువ్వలు పలికించి
నవ్వులు చిలికించి మువ్వలు పలికించి
యవ్వనవీణనూ కవ్వించినావూ...!!

౩. రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్
నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్
రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్
నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్
అసమప్రభావ జోహార్
రసికావతంస జోహార్
అసమప్రభావ జోహార్
రసికావతంస జోహార్
జోహార్ జోహార్ జోహార్ జోహార్
జోహార్ జోహార్ జోహార్ జోహార్
ఆ...ఆ...
ఆ...ఆ...