Pages

Subscribe:

Thursday 27 February 2014

ఒకానొక ధవళంపు ద్యుతి మెదలెనిదివొ

ప: ఒకానొక ధవళంపు ద్యుతి మెదలెనిదివొ
అకలంకమద్భుత మహానందమయమిదే!!

౧. చూడగా చూడగా చూపులకు నింపుగా
జడల సొగసుల తోడ జాబిల్లికొన తోడ
మూడు కన్నుల తోడ మురియు నగవులతోడ
కడు నీలగళముతో కళలు చిలికు జ్యోతి!!ఒకానొక!!

౨. అభయహస్తముతోడ అల శూలకరముతో
విభవంపు శోభతో విమల చరణములతో
అభవప్రభ యిదే అలరె షణ్ముఖనుతము
నభము భువి వెలిగించు నాదమయకాంతి


Tuesday 25 February 2014

హరా హరా హరోం హరా

హర! హరా! హర! హరా! హరోం హరా! హరోం హరా!
త్రిపుర దనుజ హరా! త్రిగుణ బంధ హరా!
అంధకాసుర హరా! అంతక మద సంహరా! హరా!
తాప హరా! పాపహరా! ఆశ్రిత ప్రణతార్తి హరా!
నిరతాఖిల దోష హరా! భవసంభవ భయ హరా! హరా!
సకల దారిద్ర్య హరా! సంతత నత దు:ఖ హరా!
గిరిజా మానస హరా! అపార తామస హరా! హరా!
కందర్ప దర్ప హరా! బృందారక భీతి హరా!
పశుపతీ! పాశ హరా! కృత్యకరా! మృత్యు హరా!
హర! హరా! హర! హరా! హరోం హరా! హరోం హరా!
(శివునకు హరుడని పేరు. హర అంటే హరించు (పోగొట్టు) వాడు అని అర్థం. హరా! అని సంబోధిస్తూ, హరుని ఆశ్రయిస్తే ఎవేవి హరిస్తాడో ఈ కీర్తనలో ఉంది.
త్రిపురాసురలను హరించిన వాడు, సత్త్వ, రజ, తమో గుణాలతో ఏర్పడే బంధాలను హరించేవాడు, అంధకాసురడనే రాక్షసుని చంపిన వాడు, యముని యొక్క మదాన్ని సంహరించిన వాడు.
ఆధ్యాత్మిక, ఆధి భౌతిక, ఆధి దైవిక తాపాలను పోగొట్టేవాడు, ఆశ్రయించిన వారి ఆర్తిని తొలగించేవాడు, మనం చేసిన ఎన్నో రకాలైన దోషాలను పరిహరించేవాడు, జనన మరణ భయాలను తొలగించి మోక్షమును ఇచ్చేవాడు.
సకల దరిద్రాలని పోగొట్టేవాడు, తనని ఎల్లపుడు కొలుచుకునేవారి దు:ఖాన్ని పోగొట్టేవాడు, పార్వతీ దేవి యొక్క మనసును హరించిన వాడు, అంతుతెలియని అఙ్ఞామనే చీకటిని తొలగించేవాడు.

మన్మథుని దర్పాన్ని హరించినవాడు, దేవతల భయాన్ని పొగొట్టేవాడు, పశుపతి అయి జీవుల బంధాలను తొలగించేవాడు. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనే అయిదు పనులను చేసేవాడు. మృత్యువును హరించే వాడు.)

http://picosong.com/wqTuG/

Monday 24 February 2014

మనసుల మల్లెల మాలలూగెనె

                       
చిత్రం: మల్లీశ్వరి
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
గానం: భానుమతి




"మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే...
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో...
ఎన్ని నాళ్లకీ బతుకు పండెనో!

కొమ్మల గువ్వలు గుసగుసమనిన
రెమ్మల గాలులు ఉసురుసురనిన!
అలలు కొలనులో గలగలమనిన
అలలు కొలనులో గలగలమనిన!

దవ్వుల వేణువు సవ్వడి వినిన
దవ్వుల వేణువు సవ్వడి వినిన...
నీవు వచ్చేవని నీ పిలుపే విని
నీవు వచ్చేవని నీ పిలుపే విని...
కన్నుల నీరిడి కలయచూచితిని!

ఘడియయేని ఇక విడిచిపోకుమా
ఘడియయేని ఇక విడిచిపోకుమా...
ఎగసిన హృదయము పగులనీకుమా!

ఎన్ని నాళ్లకీ బతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో!"

Sunday 23 February 2014

మీరజాలగలడా నాయానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

పద్మశ్రీ స్థానం నరసింహారావు గారు స్వయాన రచించి, గానం చేసిన "మీఱజాలగలడా నాయానతి" ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి.
                                                                  

     


చిత్రం: శ్రీకృష్ణ తులాభారం
రచన:
సంగీతం: ఘంటసాల
గానం: పి సుశీల
మీరజాలగలడా .....
మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .....
మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .....
మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .....

నటనసూత్రధారి మురారి ఎటుల దాటగలడో నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి!!
 
సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈడ తావు గలదే నాతోనిక వాదులాడగలడా సత్యాపతి!!

మధుర మధుర మురళీగానరసాస్వాదనమున ఆ ఆ ఆఆఆఆ ఆ ఆ
మధుర మధుర మురళీగానరసాస్వాదనమున
అధర సుధారస మదినే గ్రోలగ .....
అధర సుధారస మదినే గ్రోలగ!!మీర!!




మదిలో వీణలు మ్రోగే

                              


చిత్రం: ఆత్మీయులు
రచన: ఆరుద్ర
సంగీతం: ఎస్ పి కోదండపాణి
గానం: పి సుశీల

ప: మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
కలనైన కనని ఆనందం ఇల లోన విరిసె ఈనాడే!!మదిలో!!

౧. సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగిందీ
సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగిందీ
పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది!!

౨. కెరటాల వెలుగు చెంగలువా నెలరాజు పొందు కోరేను
కెరటాల వెలుగు చెంగలువా నెలరాజు పొందు కోరేను
అందాల తారలై మెరిసి చెలి కాని చెంత చేరేను!!

౩. రాధ లోని అనురాగమంతా మాధవునిదేలే
వేణులోలుని రాగాల కోసం వేచి ఉన్నదిలే!!

ఈనాటి ఈహాయి కలకాదోయి నిజమోయి

             
చిత్రం: జయసింహ
రచన: సముద్రాల
సంగీతం: టి వి రాజు
గానం:  ఘంటసాల, పి లీల


ప: ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి||2||
నీ ఊహతోనే పులకించిపోయే నీ మేను నీదోయి
నీ కోసమే ఈ అడిఆశలన్ని
నా చెంత నా ఆశ నీవే కదా||ఈనాటి||

౧. ఏ నోము ఫలమో ఏ నాటి వరమో ఈ ప్రేమ జవరాల
మనియేములే ఇక విడితావిలీల మన ప్రేమ ఎదురేమి లేదే సఖీ||||

౨. ఊగేము లోతుల తూగేములే ఇక తొలిప్రేమ భోగాల||ఊగేను||
మురిపాలతేలే మనజీవితాలు||2||
ధరహాసలీల వినోదాలులే||ఈనాటి||