Pages

Subscribe:

Tuesday 25 February 2014

హరా హరా హరోం హరా

హర! హరా! హర! హరా! హరోం హరా! హరోం హరా!
త్రిపుర దనుజ హరా! త్రిగుణ బంధ హరా!
అంధకాసుర హరా! అంతక మద సంహరా! హరా!
తాప హరా! పాపహరా! ఆశ్రిత ప్రణతార్తి హరా!
నిరతాఖిల దోష హరా! భవసంభవ భయ హరా! హరా!
సకల దారిద్ర్య హరా! సంతత నత దు:ఖ హరా!
గిరిజా మానస హరా! అపార తామస హరా! హరా!
కందర్ప దర్ప హరా! బృందారక భీతి హరా!
పశుపతీ! పాశ హరా! కృత్యకరా! మృత్యు హరా!
హర! హరా! హర! హరా! హరోం హరా! హరోం హరా!
(శివునకు హరుడని పేరు. హర అంటే హరించు (పోగొట్టు) వాడు అని అర్థం. హరా! అని సంబోధిస్తూ, హరుని ఆశ్రయిస్తే ఎవేవి హరిస్తాడో ఈ కీర్తనలో ఉంది.
త్రిపురాసురలను హరించిన వాడు, సత్త్వ, రజ, తమో గుణాలతో ఏర్పడే బంధాలను హరించేవాడు, అంధకాసురడనే రాక్షసుని చంపిన వాడు, యముని యొక్క మదాన్ని సంహరించిన వాడు.
ఆధ్యాత్మిక, ఆధి భౌతిక, ఆధి దైవిక తాపాలను పోగొట్టేవాడు, ఆశ్రయించిన వారి ఆర్తిని తొలగించేవాడు, మనం చేసిన ఎన్నో రకాలైన దోషాలను పరిహరించేవాడు, జనన మరణ భయాలను తొలగించి మోక్షమును ఇచ్చేవాడు.
సకల దరిద్రాలని పోగొట్టేవాడు, తనని ఎల్లపుడు కొలుచుకునేవారి దు:ఖాన్ని పోగొట్టేవాడు, పార్వతీ దేవి యొక్క మనసును హరించిన వాడు, అంతుతెలియని అఙ్ఞామనే చీకటిని తొలగించేవాడు.

మన్మథుని దర్పాన్ని హరించినవాడు, దేవతల భయాన్ని పొగొట్టేవాడు, పశుపతి అయి జీవుల బంధాలను తొలగించేవాడు. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనే అయిదు పనులను చేసేవాడు. మృత్యువును హరించే వాడు.)

http://picosong.com/wqTuG/

0 comments:

Post a Comment