Pages

Subscribe:

Friday 21 February 2014

ధన్యోస్మి సాంబశివుని దర్శించితి


పరమేశ్వరుని ధ్యానించి దర్శించిన పాట. ఇది `ధన్యోస్మి ' ఆల్బంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు వ్రాసిన పాటను బ్రహ్మశ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. వింటూ దర్శిస్తూ ఆనందించండి.

ప: ధన్యోస్మి...ధన్యోస్మి... సాంబశివుని దర్శించితి సదాశివుని దరిజేరితి
కనిపించెను ధ్యానమ్మున కైలాసలోకము
కైలాస శైలమ్మున కల్పవృక్షము
కల్పవృక్షమూలమ్మున కనకపు సింహాసనము
సింహాసనమందు మహాదేవరూపము!!

గౌరీసతి అంకమందు కార్తికేయుడు
విభుని ఒడిని ఆసీనుడు విఘ్ననాథుడు
పలువిధముల కీర్తించెను పరవశమున సురమునిగణము
అపురూపము హరుని కొలువు అద్భుతమానందము!!ధన్యోస్మి!!

పటికపు సిరి చాయలమేను పచ్చని పులితోలు వలువ
నెలవంకను జలరాణిని నిలిపిన పెను జటల తల
మూడు కన్నులు మొలకనవ్వు ముచ్చటైన మోము
నాగాలంకారములు నానా లావణ్యములు!!

http://picosong.com/YDgY


0 comments:

Post a Comment