Pages

Subscribe:

Friday 21 February 2014

సీతమ్మ చేతులార నీకు రతనాల హారమిచ్చె



బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు వ్రాసిన "శ్రీ రామదూత జయ హనుమాన్ " ఆల్బం లోనిది.

పల్లవి: సీతమ్మ చేతులార నీకు రతనాల హారమిచ్చె,
రామయ్య ప్రేమమీర తనపరిష్వంగమిచ్చె
 
అనుపల్లవి: శోకాపహారీ ఆనందకారీ మారుతాత్మజా ప్రభూ మహితోపకారీ

(1)
లవణాబ్దిని అలవోకగ దాటి అవనీసుత జాడనుకనిపెట్టి
లక్షణముగ సంజీవినితెచ్చి లక్ష్మణయ్య ప్రాణమ్ములునిలిపి
రాముని ఆనందమునకు కారణమైనావు భళీ
దాశరథీ నామభరితసుస్థల సంచారీ

(2)
నాల్గుశ్రుతుల మాటలలోమేటీ పలుకుపటిమకలిగినట్టిమేటీ
తెలివి బలిమి చూపేనీధాటీ నీ తేజమె శతసూర్యులసాటీ
నరనారాయణ రథమున విజయధ్వజ తేజమా
భీమసంస్తుతా ఆపద్బాంధవ హనుమా

(3)
ఇంద్రజిత్తు దర్పమ్మును దునిమి కుంభకర్ణు శూలమ్మును విరిచి
అరచేతితో అసురమదమునణచి అజేయునిగ విక్రమానవెలిగి
ధర్మవిజయహేతువుగా ప్రకాశించు స్వామీ
నా హృదిలో దీపించే ఓ అంతర్యామీ

............
శోకాపహారీ ఆనందకారీ మారుతాత్మజా ప్రభూ మహితోపకారీ
http://picosong.com/kcX5 

0 comments:

Post a Comment