Pages

Subscribe:

Friday 21 February 2014

అంతరంగ పీఠికపై

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు వ్రాసిన `వందే శ్రీ మాతరం' ఆల్బంలో పాట:

పల్లవి: అంతరంగపీఠికపై అమ్మచరణకమలమ్ములు
చింతలన్నీ తొలగించే సిరుల నెలవులు కోటివెలుగు కొలువులు

చరణం: ఉభయసంధ్యలుగ వెలిగెను ఉమ అడుగుల పారాణి
పదినెలవంకల సొగసుల మృదువులైన గోటికొనలు
జ్యోతిశ్చక్రములాయెను శివుడుంచిన సిరిమట్టెలు
తొలిపలుకులుగిలుకుమనే జిలుగువెలుగుటందెలు

చరణం: కొలుచుదేవకన్యలెరుగు ఈ పదలాలిత్యము,
తలపడు దానవులకెఱుక తల్లికాళ్ళ కాఠిన్యమ్ము
సుజనరక్ష కుజనశిక్ష సులభముగా చేయునివియె,
సర్వమంగళములనిధులు జననిలలిత చరణములు
 

0 comments:

Post a Comment