Pages

Subscribe:

Friday 21 February 2014

అడగాలని ఉంది

                  
చిత్రం: చిన్ననాటి స్నేహితులు
రచన: సి.నారాయణ రెడ్డి
సంగీతం: టి.వి రాజు
గానం: ఎస్.పి బాలు, పి.సుశీల




 అడగాలని ఉంది... ఒకటడగాలని ఉంది
అడగాలని ఉంది ...ఒకటడగాలని ఉంది
అడిగిన దానికి బదులిస్తే... ఇస్తే...
అందుకు బహుమానం ఒకటుంది
అడగాలని ఉంది... ఒకటడగాలని ఉంది..ఈ...ఈ...

1:
ఎదురుగా నిలుచుంటే...ఎంతో ముద్దుగ మెరిసేదేది?
ఎదురుగా నిలుచుంటే...ఎంతో ముద్దుగ మెరిసేదేది?
అందీ అందకుంటే..అందీ అందకుంటే
ఇంకెంతో అందం చిందేదేది?
చేప...ఉహు..చూపు ఆహ..
సిగ్గు...ఉహు..మొగ్గ...ఆహ..
మొగ్గ కాదు.. కన్నెపిల్ల బుగ్గా..!!


2:
కొత్తగా రుచి చూస్తుంటే...మత్తుగా ఉండేదేది?
కొత్తగా రుచి చూస్తుంటే...మత్తుగా ఉండేదేది
మళ్ళీ తలచుకుంటే...
మళ్ళీ తలచుకుంటే...మరింత రుచిగా ఉండేదేది?

వెన్నా...ఉహు...జున్ను...ఉహు
తీపి ..ఉహు..ఆ పులుపు ఆహ...
పులుపు కాదూ ...తొలి వలపూ!!

3:
ఎంతగా చలి వేస్తుంటే...అంతగా మనసయ్యేదేది?
ఎంతగా ...చేరదీస్తే..
ఎంతగా ...చేరదీస్తే..అంతగా మురిపించేదేది?

కుంపటి...మ్మ్ హు..దుప్పటి..ఆహ..
గొంగలి...మ్మ్ హు..కంబళి..ఆహ..
కంబళి కాదు...కౌగిలి
అడగాలని ఉంది అది అడగాలని ఉంది
అడగాలని ఉంది అది అడగాలని ఉంది
అడగంగానే ఇచ్చేస్తే ...
అడగంగానే ఇచ్చేస్తే...
అందులో రుచి ఏముంది... అహా..హ..ఆ హ..

0 comments:

Post a Comment