Pages

Subscribe:

Friday 21 February 2014

అనేక మూర్తుల ఆదిదేవుడు

 

పరమేశ్వరునియొక్క దక్షిణామూర్తి , కిరాతమూర్తి , నటరాజు , అర్థనారీశ్వరుడు మొదలైన అనేక రూపాలను ఈ ఒకే పాటలో ఇమిడి ఉన్నాయి. విని ఆనందించండి. ఇది `ధన్యోస్మి ' ఆల్బంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు వ్రాసిన పాటను బ్రహ్మశ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు.

ప: అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు  2 సార్లు

 ౧. ఙ్ఞాన సుధలు కురిపించే గురువు దాక్షిణ్యమయుడు దక్షిణామూర్తి
 ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
 ఙ్ఞాన సుధలు కురిపించే గురువు దాక్షిణ్యమయుడు దక్షిణామూర్తి
 అరాతివర్గమునంతముజేయును పరాక్రమమ్మున కిరాతమూర్తి !! అనేక!!

 ౨. కనుబొమల నడుమ కనిపించినది కాశీలింగము జ్యోతిర్మూర్తీ
 ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
 కనుబొమల నడుమ కనిపించినది కాశీలింగము జ్యోతిర్మూర్తీ
 ప్రకృతీ పురుషాత్మకశ్రీతత్త్వము అర్థనారీశ్వరాద్భుత మూర్తీ!!అనేక!!

 ౩.  నాదలయలతో నానావిశ్వము నడిపి పాలించు నటేశ మూర్తీ
 ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
 నాదలయలతో నానావిశ్వము నడిపి పాలించు నటేశ మూర్తీ
 జగజ్జాలములు సర్వము తానౌ అంతర్యామీ మహాష్టమూర్తీ!!అనేక!!

 ౪. సకల జగద్భయ సంహారకుడు రుద్రదీప్తి శరభేశ్వర మూర్తీ
 ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
 సకల జగద్భయ సంహారకుడు రుద్రదీప్తి శరభేశ్వర మూర్తీ
 ఙ్ఞాన వైరాగ్య నిష్ఠా తాపసి అక్షయ వరదుడు భిక్షుక మూర్తీ!!అనేక!!

 ౫. దశభుజమ్ములను నానాయుధముల దాల్చిన పంచ ముఖోజ్జ్వల మూర్తీ
 ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
 దశభుజమ్ములను నానాయుధముల దాల్చిన పంచ ముఖోజ్జ్వల మూర్తీ
 తంత్రారాధ్యుడు మంత్రగమ్యుడు బహువిధరూపుడు భైరవ మూర్తీ!!అనేక!!

 ౬. అమృతముతో తడిసిన సిరి రూపము శాంతికరము మృత్యుంజయమూర్తీ
 ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
 అమృతముతో తడిసిన సిరి రూపము శాంతికరము మృత్యుంజయమూర్తీ
 ఆదిమ గృహస్థు ఆర్యాహృదయుడు కుమార గణేశ సమేత మూర్తీ!!అనేక!!

Playing: 02 Track 2.mp3 - picosong

picosong.com

0 comments:

Post a Comment