Pages

Subscribe:

Friday 21 February 2014

శరవణభవ జననీ

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు వ్రాసిన `వందే శ్రీ మాతరం' ఆల్బంలో పాట:

శరవణభవజననీ! అమ్మా!
పురహరప్రియతరుణీ!
ప్రణామములు నతకల్పకవల్లీ!
గణాధిపుని తల్లీ!....1
 
విమలభావనావిధ్యుద్వల్లీ!
శివమయవాగర్చిత తనువల్లీ!
శంభుమన:కాసారమరాళీ!
శివామృతధునీ! శివనారీ!....2
 
మూలాధారమ్మును లాలించి ఉత్థిత నాదాహిని పాలించి
ఆరుచక్రములపై ప్రాకించి చెలువపు సుధలొలికే శివశక్తీ!...3

0 comments:

Post a Comment