Pages

Subscribe:

Thursday 20 February 2014

తేనెల తేటల మాటలతో

    
తేనెల తేటల మాటలతో
మన దేశ మాతనే కొలిచెదమా 
తేనెల తేటల మాటలతో 
మన దేశ మాతనే కొలిచెదమా 
భావం భాగ్యం కూర్చుకొని 
ఇక జీవనయానం చేయుదమా 
తేనెల తేటల మాటలతో 
మన దేశ మాతనే కొలిచెదమా 
భావం భాగ్యం కూర్చుకొని 
ఇక జీవనయానం చేయుదమా 
తేనెల తేటల మాటలతో 
మన దేశ మాతనే కొలిచెదమా 

౧. సాగర మేఖల చుట్టుకొని 
సుర గంగ చీరగా మలచుకొని 
సాగర మేఖల చుట్టుకొని 
సుర గంగ చీరగా మలచుకొని 
గీతాగానం పాడుకునీ 
గీతాగానం పాడుకునీ 
మన దేవికి ఇవ్వాలి హారతులు 
తేనెల తేటల మాటలతో 
మన దేశ మాతనే కొలిచెదమా 
గాంగ జటాధర భావనతో 
హిమ శైల రూపమే నిలబడగా 
ఆ ఆ గాంగ జటాధర భావనతో 
హిమ శైల రూపమే నిలబడగా 
గలగల పారే నదులన్నీ 
గలగల పారే నదులన్నీ 
ఒక బృంద గానమే చేస్తుంటే 
తేనెల తేటల మాటలతో 
మన దేశ మాతనే కొలిచెదమా 

౨. ఎందరో వీరుల త్యాగ ఫలం.
మన నేటి స్వేచ్చకే మూలబలం 
ఎందరో వీరుల త్యాగ ఫలం.
మన నేటి స్వేచ్చకే మూలబలం 
వారందరిని తలుచుకొని,
వారందరినీ తలుచుకొని మన
మానస వీధిని నిలుపుకొని,
తేనెల తేటల మాటలతో 
మన దేశ మాతనే కొలిచెదమా 
భావం భాగ్యం కూర్చుకొని 
ఇక జీవనయానం చేయుదమా 
తేనెల తేటల మాటలతో 
మన దేశ మాతనే కొలిచెదమా 

రచన : ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ 

0 comments:

Post a Comment