Pages

Subscribe:

Sunday 23 February 2014

సిరిమల్లె నీవే విరిజల్లు కావే

                    
చిత్రం : పంతులమ్మ (1977)
సంగీతం : రాజన్-నాగేంద్ర 
రచన : వేటూరి సుందర రామ మూర్తి 
గానం : యస్. పి. బాలసుబ్రహ్మణ్యం 

ప: సిరిమల్లె నీవే... విరిజల్లు కావే... 
వరదల్లె రావే... వలపంటె నీవే...
ఎన్నెల్లు తేవే... ఎద మీటి పోవే...
సిరిమల్లె నీవే... విరిజల్లు కావే 
౧. ఎలదేటి పాట చెలరేగె నాలొ 
చెలరేగి పోవే మధుమాసమల్లే 
ఎలమావి తోట పలికింది నాలో 
పలికించు కోవే మదికోయిలల్లె 
నీ పలుకు నాది నా బ్రతుకు నీది 
తొలి కూత నవ్వే వనదేవతల్లే 
పున్నాగ పూలే సన్నాయి పాడే 
ఎన్నెల్లు తేవే ఎద మీటి పోవే 
సిరిమల్లె నీవే... విరిజల్లు కావే... 
వరదల్లె రావే... వలపంటె నీవే... 

౨. మరుమల్లె తోట మారాకు వేసే 
మారాకు వేసే నీరక తోనే 
నీ పలుకు పాటై బ్రతుకైన వేళ
బ్రతికించుకోవే నీ పదము గానె 
నా పదము నీవే నా బ్రతుకు నీదే 
అనురాగమల్లే సుమగీతమల్లే 
నన్నల్లుకోవే నా ఇల్లు నీవే 
ఎన్నెల్లు తేవే ఎద మీటి పోవే 
సిరిమల్లె నీవే... విరిజల్లు కావే... 
వరదల్లె రావే... వలపంటె నీవే...

0 comments:

Post a Comment