Pages

Subscribe:

Monday 31 March 2014

కొబ్బరినీళ్ళ జలకాలాడి

 
కొబ్బరి నీళ్ళ జలకాలాడి ఊహూ ఊహూ ఊహూ
కోనసీమ కోకగట్టి ఆహా ఆహా ఆహా
పొద్దుటెంట తిలకాలెట్టి ముద్దపసుపు సందెలకొస్తావా
ముద్దు తీర్చే సందిటికొస్తావా..ఆ..ముద్దు తీర్చే సందిటికొస్తావా

కొబ్బరి నీళ్ళ జలకాలాడి ఊహూ ఊహూ ఊహూ
కోనసీమ కోకగట్టి ఆహా ఆహా ఆహా
పొద్దుటెంట తిలకాలెట్టి ముద్దపసుపు సందెలకొస్తాలే
ముద్దుతీర్చే సందిలి ఇస్తాలే ..ఏ..ముద్దు తీర్చే సందిలి ఇస్తాలే

౧. ఆకాశ వీణల్లో నేను ఊ అనురాగమే పాడుకుంటా
 గోంగూర పచ్చట్లో నేను ఉల్లిపాయే నంజుకుంటా స్స్ నీరుల్లిపాయే నంజుకుంటా
 ఆకాశ వీణల్లో నేను ఊ అనురాగమే పాడుకుంటా
శృంగార వీధుల్లో నేను రసనాట్యమే ఆడుకుంటా ప్రేమ రసనాట్యమే ఆడుకుంటా
మాటివ్వు నాకు మనసిచ్చుకుంటా
వదిలేస్తే వంకాయ వండించుకుంటా
aa I am sorry
వంకాయవంటి కూరయు పంకజముఖి సీతవంటి భార్యామణి అన్నారు కదండీ
అందుకే అలా పాడానన్నమాట!!

౨.  అమ్మవారి ఎదుట నేనూ..ఊ.. నీ కుంకుమే దిద్దుకుంటా..నీకోసమే కాచుకుంటా
అమ్మతో చెప్పి నేనూ..ఊ..అప్పచ్చులే తెచ్చుకుంటా
అమ్మవారి ఎదుటనేనూ..ఊ..నీకుంకుమే దిద్దుకుంటా.. నీకోసమే కాచుకుంటా
అసురసంధ్య వేళ నేనూ..ఊ.. ఆలయంలో వేచివుంటా..నీ హారతే అందుకుంటా
మాగాయలోన పెరుగేసుకుంటా
వదిలేస్తే నాదారి నే చూసుకుంటా
హ్మ్ చూడండి
మాగాయ మహాపచ్చడి...పెరుగేస్తే మహత్తరి...అదివేస్తే అడ్డవిస్తరి
మానిన్యా మహాసుందరి...అన్నారు కదండీ...అందుకే అలా పాడానన్నమాట
హ హ హ






Sunday 30 March 2014

పాడెద నీ నామమే గోపాల


ప: ఆ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ...
పాడెద నీ నామమే గోపాలా....
పాడెద నీ నామమే గోపాలా....
హృదయములోనే పదిలముగానే
నిలిపెద నీ రూపమేరా
పాడెద నీ నామమే గోపాలా


౧. మమతలలోనే మాలికలల్లి
నిలిచితి నీకోసమేరా
ఆశలతోనే హారతి చేసి
పదములు పూజింతు రారా!!

౨.  నీ ముర ళీ గానమే పిలిచెరా
కన్నుల నీమోము కదలెనులేరా
నీ మురళీ గానమే పిలిచెరా
పొన్నలు పూచే బృందావనిలో
వెన్నెల కురిసే యమునాతటిపై (2)
నీ సన్నిధిలో జీవితమంతా
కానుక చేసేను రారా ॥

హలో సారు భలేవారు

   


ప: హలో సారు భలేవారు చెలి వలపు తెలుసుకోరు
పైకెంతో చల్లని వారు తమరెంతో అల్లరి వారు నా మనసు దోచినారు
చాలు చాలు సరసాలు ఇంక దూరంగా ఉంటేనే మేలు

౧. రానిమ్ము రానిమ్ము ఏమైనా కాని
నా ఇంపు నా సొంపు నీ సొమ్ము కాదా
నా తోడు నీవై నీ నీడ నేనై
కలవాలి కరగాలి కావాలి ఒకటిగా!!

౨. రావాలి రావాలి సరియైన అదను
ఆ నాడు ఇవ్వాలి నీ నిండు మనసు
ఆలోగా నువ్వు ఆవేశపడకు
ఆకాశ సౌధాలు నిర్మించ రాదులే!!

౩. అనురాగ బంధాలు సడలించవద్దు
పెనవేయు హృదయాలు విడదీయవద్దు
నీ లేత వలపు ఆమోదమైన
బంగారు స్వప్నాలు పండేది ముందెప్పుడో!!

Saturday 29 March 2014

నీ సుఖమే నే కోరుకున్నా

    
ప: ఎక్కడ ఉన్నా ఏమైనా
మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నేను కోరుకున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా

౧. అనుకున్నామని జరగవు అన్నీ
అనుకోలేదనీ ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికనీ
అనుకోవడమే మనిషి పనీ..!!

౨. పసిపాపవలె ఒడి చేరినాను
కనుపాపవలె కాపాడినాను
గుండెను గుడిగా చేశానూ
గుండెను గుడిగా చేశానూ
నువ్వుండ లేననీ వెళ్లావు!!

౩. వలచుట తెలిసిన నా మనసునకు
మరచుట మాత్రం తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే
మన్నించుటయే ఋజువు కదా!
నీ కలలే కమ్మగా పండనీ!!
నాతలపే నీలో వాడనీ
కలకాలం చల్లగా ఉండాలనీ
దీవిస్తున్నా నా దేవిని
దీవిస్తున్నా నా దేవిని

ఎక్కడ ఉన్నా ఏమైనా
మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నేను కోరుకున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా
నీ సుఖమే నేను కోరుకున్నా..

శివశంకరీ శివానందలహరి శివశంకరీ

      

                    

                   
ఆ ఆ ఆఆ .. ఆ  ఆ
శివశంకరీ
శివశంకరీ శివానందలహరి శివశంకరీ
శివానందలహరి శివశంకరీ
శివానందలహరి శివశంకరీ

చంద్రకళాధరి ఈశ్వరీ
చంద్రకళాధరి ఈశ్వరీ
కరుణామృతమును కురియజేయుమా
మనసు కరుగదా మహిమ జూపవా
దీనపాలనము చేయవే శివశంకరీ
శివానందలహరీ శివశంకరీ శివశంకరీ
శివానందలహరీ శివానందలహరీ శివశంకరీ శివశంకరీ
శివానందలహరీ శివశంకరీ
శివశంకరీ శివానందలహరీ శివశంకరీ
చంద్రకళాధరి ఈశ్వరీ

రిరి సని దనిసా
మపదనిసా దనిసా దనిసా దనిసా
చంద్రకళాధరి ఈశ్వరీ
రిరి సనిపమగా రిసదా రిరినిస రిమపద మపనిరి నిసదప
చంద్రకళాధరి ఈశ్వరీ
దనిస మపదనిస సరిమ గరి మపని దనిస
మపనిరి సరి నిస దనిప
మపనిసరిసని సరిగా రిస రిస రిరి రిరి సని
సనిపనిపమ పమ గమరిసనిస
సనిపనిపమ పమ గమరిసనిస
సరిమపనిదానిస సరిమపనిదానిస సరిమపనిదానిస
చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ ఆ.. ఆ.. ఆ..
శివశంకరీ ఆ.. ఆ.. ఆ.. శివశంకరీ
తోం తోం తోం దిరిదిరి తోం
దిరిదిరి తోం దిరిదిరి తోం
దిరిదిరి తోం దిరిదిరి యానా దరితోం
దిరిదిరి తోందిరిదిరి తోం
దిరిదిరి తోం తారియానా
దిరిదిరి తోం తోం తోం
దిరిదిరి తోం తోం తోం
దిరిదిరి తోం తోం తోం
దిరి దిరి తానా దిరితోం
దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి
నాదిరి దిరిదిరి తోం దిరి దిరి దిరి
నాదిరి దిరిదిరి తోం

నినినిని నినినిని దనిని దనినిని దప
పనస నిససనిద నిరిరి సరిరి సని
సగగ రిగగ రిస సరిరి రిరి సని
నిసస నిస నిద దనిని దనిని దప
నిని దద ససనిని రిరిసస గగరిరి
గగససరిరి నిని సని రిరి సస సస
రిరిరిరిరి నినిని రిరిరిరి నినిని గాగగగ
నినిని రిరిగరిమా
రిమరి సరిసనిసని పనిస మపమరిగ
సరి సస మప మమ సరి సస సససస
సరి సస పని పప సరిసస సససస
మప మమ పని దద మపమ పనిద
మపమ పనిద పదపప సరి సస
ప ద ప సరిస పదప సరిస మమమ
 పపప దదద నినిని ససస రిరిరి
గరి సస రిపా ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
శివశంకరీ


జలకాలాటలలో గలగల పాటలలో

    
జలకాలాటలలో గల గల పాటలలో
ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా ||2||

౧. ఉన్నది పగలైనా అహ వెన్నలెకురిసేనె ||2||
అహ వన్నె చిన్నెల కన్నె మనసులు కన్న వలపు విరిసే ||2||జలకా!!

౨. తీయని రాగమెదో మది హాయిగ పాడెనె ||2||
తరుణ కాలమెలే అది వరుని కొరకు పిలుపే ||2||
అది వరుని కొరకు పిలిపే ||జలకాలాటలలో ||

వగలరాణివి నీవె

     
ఓహోహో ఓ ఓ ఓహోహో ఓ ఓ
ఓహోహోహో ఓ ఓ
ప: వగలరాణివి నీవె సొగసు కాడను నేనె
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే!!

౧. పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం
పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం
రెండు కలసిన నిండు పున్నమి రేయి మన కోసం!!

౨. ఓహోహొ ఓఓఓ ఓహోహొ ఓఓఓ
దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ
దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ
బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడనేగాన!!

౨. కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే
కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే
వరుని కౌగిట ఒరిగినంతట కరిగి పోదువులె
వగలరాణివి నీవె సొగసు కాడను నేనె
ఈడు కుదిరెను జోడు కుదిరెను తోడుగా రావే!!

ఊహలు గుసగుసలాడే

    
ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే
ప్రియా!

ఊహలు గుసగుసలాడే నాహృదయము ఊగిసలాడే


౧. వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు
తొలి ప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు!!

౨. నను కోరి చేరిన బేలా..దూరాన నిలిచేవేలా
ననుకోరి చేరిన బేలా...దూరాన నిలిచేవేలా
 నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరికూడా!!

౩. దివి మల్లెపందిరివేసే..భువి పెళ్ళిపీటను వేసే
దివి మల్లెపందిరివేసే...భువి పెళ్ళిపీటను వేసే
నెర వెన్నెల కురిపించుచు నెలరాజు పెండ్లిని చేసే!!

నీవని నేనని తలచితిరా

      
నీవని నేనని తలచితిరా నీవే నేనని తెలిసితిరా
నీవని నేనని తలచితిరా నీవే నేనని తెలిసితిరా
నిజమిదే.... ఋజువేదీ
ఉహు హు ఆహా హా!!

 ౧. కలయగ జూచితి నీకొరకై నే... కలయగ జూచితి నీ కొరకై నే...
కనుపాపలలో కనుగొన్నారా..కనుపాపలలో కనుగొన్నారా
అవునో కాదో నే చూడనా!!

౨. కలవరపాటున కల అనుకొందూ...కలవర పాటున కల అనుకొందూ..
కాదనుకొందు కళా నీముందూ..కాదనుకొందు కళా నీముందూ
కాదు సఖా కల నిజమేలే!!


నేలతో నీడ అన్నది నను తాకరాదనీ

                  
ప: నేలతో నీడ అన్నది నను తాకరాదనీ
పగటితో రేయి అన్నది నను తాకరాదనీ
నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది
నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది ||| నేలతో |||

౧. వేలి కొసలు తాకనిదే వీణ పాట పాడేనా
చల్లగాలి తాకనిదే నల్లమబ్బు కురిసేనా
తల్లితండ్రి ఒకరి నొకరు తాకనిదే
నీవు లేవూ, నేను లేనూ, లోకమే లేదులే ||| నేలతో |||

౨. రవికిరణం తాకనిదే నవ కమలం విరిసేనా
మధుపం తను తాకనిదే మందారం మురిసేనా
మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే
మమత లేదూ, మనిషి లేడూ, మనుగడయే లేదులే ||| నేలతో |||

౩. అంటరానితనము - ఒంటరితనము
అనాదిగా మీ జాతికి అదే మూలధనము
ఇక సమభావం, సమధర్మం సహజీవన మనివార్యం
తెలుసుకొనుట మీ ధర్మం, తెలియకుంటె మీ కర్మం ||| నేలతో |||

ఒంటిగ సమయం చిక్కింది

     
ప: ఒంటిగ సమయం చిక్కింది
కంటికి నిద్దుర రాకుంది(2)
మనకు మనకు ఇనప గోడవలె
తడిక అడ్డమై కూర్చుంది
ఒంటిగ సమయం చిక్కిందా
కంటికి నిద్దుర రాకుందా
మనకు మనకు మనసులు కలిసిన
తడిక అడ్డమై కూర్చుందా

౧. ఇంటింటా ఒక ముసలి ఘటం(2)
ప్రేమికులకు అది పెను భూతం
కదిలితే భయం మెదిలితే భయం
ఎన్నాళ్లో ఈ ఇరకాటం(2)!!

౨. పెద్ద తలోక్కటి ఉంటేనే
హద్దు పద్దులో ఉంటావు
ప్రేమ ముదిరితే పిచ్చి రేగితే
పార్కులో మళ్ళి సరిగమలే...!!

౩. ఎటుల భరింతును ఈ విరహం
ఒట్టి చూపులతో ఏమి ఫలం
అమ్మ వచ్చినా అరిచి చచ్చినా
విడువలేను ఈ అవకాశం(2)!!

౪. గుట్టుగా సాగే సరసాన్ని
రట్టు చేయకోయ్ నా సామి...
తడిక దాటినా దుడుకు చేసినా
తప్పదు మనకి తదిగిణతోం
అమ్మ చేతిలో తదిగిణతోం!!

పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం

     
ప: పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం
అనురాగ గీతిలోన అచ్చతెలుగు అందం
పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం

౧. రతనాల కోట ఉంది రాచకన్నె లేదు
రంగైన తోట ఉంది రామచిలుక లేదు
ఆ రాచకన్నెవు నీవై అలరిస్తే అందం
నా రామచిలుకవు నీవై నవ్వితేనె అందం!!

౨. కన్నెమనసు ఏనాడూ సన్నజాజి తీగ
తోడులేని మరునాడూ వాడిపోవు కాదా
ఆతీగకు పందిరి నీవై అందుకుంటె అందం
ఆకన్నెకు తోడుగ నిలిచి అల్లుకుంటె అందం!!

౩. నీ సోగకన్నుల పైన బాస చేసినాను
నిండు మనసు కోవెలలోనా నిన్ను దాచినాను
ఇరువుతిని ఏకం చేసే ఈ రాగబంధం
ఎన్నెన్ని జన్మలకైనా చెరిగిపోని అందం
చెలుని వలపు నింపుకున్న చెలియ బ్రతుకు అందం
అనురాగ గీతిలోనా అచ్చతెలుగు అందంలాలలాల!!