Pages

Subscribe:

Sunday 29 June 2014

అందమె ఆనందం

                         
ప: అందమె ఆనందం...
అందమె ఆనందం... ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం... ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం...

౧. పడమటి సంధ్యారాగం... కుడి ఎడమల కుసుమపరాగం
పడమటి సంధ్యారాగం... కుడి ఎడమల కుసుమపరాగం
ఒడిలో చెలి మోహనరాగం... ఒడిలో చెలి మోహనరాగం...
జీవితమే మధురానురాగం... జీవితమే మధురానురాగం...
అందమె ఆనందం... ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం...

౨. పడిలేచే కడలితరంగం ఓ.... పడిలేచే కడలితరంగం
వడిలో జడసిన సారంగం
పడిలేచే కడలితరంగం... వడిలో జడసిన సారంగం
సుడిగాలలో ఓ.... సుడిగాలలో ఎగిరే పతంగం
జీవితమే ఒక నాటకరంగం... జీవితమే ఒక నాటకరంగం...
అందమె ఆనందం... ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం... ఓ ఓ ఓ...

Tuesday 24 June 2014

లాలి లాలి మా బాల శివునకు

                       
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు వ్రాసిన "శివజ్యోతి" ఆల్బంలోని పాట.

పాడినవారు: బ్రహ్మశ్రీ బాలక్రిష్ణ ప్రసాదు గారు

 పల్లవి: లాలి లాలి మా బాల శివునకు
 లీలా శిశువీ హేలామూర్తికీ..
 లీలా శిశువీ హేలామూర్తికీ..లాలీ...లాలీ..
చరణం: బుసలు మాని కదలికలు మాని ఓ చిలువలార! మచ్చికను ఒదగరే
 జడల పరుగులిడు వడుల గంగమ్మ సడిని మానుమా సామి నిదరోయె...... పల్లవి...
 చరణం: చెలువంపు నుదుట సెగ కను మూసెను; ఇన శశి నయనములివియు మూసుకొని..
 సిగపై వెలిగెను చిఋత వెన్నెలలు నగవులతో నిదరోయె మా సామీ ......పల్లవి...
 చరణం: ఐదు కృత్యముల ఆటలలోపడి అలసిన మా దొర సేద దీరెను..
 నిదురయొ తాపస నిష్ఠయొ ఏమొ...తనలో తననే కనుగొను లీలయో..... పల్లవి...

Thursday 12 June 2014

ఎందుకోయీ తోటమాలీ అంతులేని యాతనా

                 
ప: ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా

౧. వన్నెవన్నె చిన్నెలీను ఈ విలాసం(2)
చందమామ చిన్నబోవు ఈ ప్రకాశం
నిన్నేలువాని లీలలేరా(2)
కన్నార కనరా ఏలుకోరా(2) 

ఓ ఓ ఓ ఓ ఓ!!
 

౨. అందరాని విందుపైన ఆశలేలా(2)
పొందుదుకోరు చిన్నదాని పొందనేలా
అందాలరాయా అందరారా(2)
అనందమిదియే అందుకోరా(2) 

ఓ ఓ ఓ ఓ ఓ!!

Monday 9 June 2014

ఓహో తమరేనా

    


ఓహో తమరేనా చూడవచ్చారు
చూసీ ఏం చేస్తారు
ఓహో తమరేనా చూడవచ్చారు
చూసీ ఏం చేస్తారు
 అయ్యో రామా

౧. సంతలోని జంతువును కాను సుమా
వంట యింటి కుందేలును అవను సుమా
ఎవరేమిటన్నా మగవాళ్ళకన్నా
మా వాళ్ళె మిన్నా నీ డాబు సున్నా..
వెళ్ళండి వెళ్ళండి మీ దారి మళ్ళండి డూ డూ డూ బసవన్నా
ఓ మామా అయ్యో రామా!!

౨. అలుగుట తగదురా పెళ్ళి కుమారా
 హాస్యములాడితిరా వలపుల చోరా
చెమటలు పోసినవా చెంగున వీతురా 2
చెలరేగి నీ భరతం పట్టిస్తారా
ఓ మామా అయ్యోరామా !!

౩.  మూడునాళ్ళ ముచ్చటకే మురిసినచో
ఆడపిల్ల బ్రతుకంతా హరోంహరా
పెళ్ళాడు రోజు ఉంటుంది మోజు
ఆపైన క్లోజు పడుతుంది బూజు
ఆనాడు ఈనాడు ఏనాడు మనువాడు ఇంతే రివాజు
ఓ మామా అయ్యోరామా!!

ఓహో తమరేనా చూడవచ్చారు

     
 ఓహో తమరేనా చూడ వచ్చారు
చూసే ఏం చేస్తారు 
 ఓహో తమరేనా చూడ వచ్చారు
చూసే ఏం చేస్తారు 
 ఓ భామా అయ్యో రామా!!

౧. ఆకతాయి రాలుగాయి అమ్మాయి
అంతకన్న గడుగ్గాయి అబ్బాయి
మండేన ఒళ్ళు కొరికేవ పళ్ళు
ఎరుపెక్కె కళ్ళు అరికాళ్ళ ముళ్ళు
 కోపాల తాపాల శాపాన రూపాన
తొక్కేవు పరవళ్ళు..ఓ భామా అయ్యోరామా!!

౨. మూతిని ముడవకే ముద్దులగుమ్మా
ఆ ఆ ఆ ముచ్చటలాడితినే వలపుల రెమ్మా
ముసిముసి నవ్వులతో మోడీ చేతునే
కసిదీరా గుణపాఠం నేర్పిస్తానే
 ఓ భామా అయ్యోరామా!!

౩.  కుక్కకాటు చెప్పుదెబ్బ సామెతకు
చక్కనైన మచ్చుతునక నీ బ్రతుకు
అమ్మాయిగారు ముయ్యాలి నోరు
మాతోను మీరు సరిసాటి కారు
కన్నీరు మున్నీరు కాదండి పన్నీరు
తగ్గాలి మీ జోరు..ఓ భామా అయ్యో రామా!!


చూచి వలచి చెంతకు పిలచి

 
 చిత్రం: వీరాభిమన్యు
సంగీతం: కెవి మహదేవన్
రచయిత: ఆరుద్ర
గానం: ఘంటసాల, సుశీల
ప: చూచి వలచి చెంతకు పిలచి
నీ సొగలు లాలన చేసి
నీ సొంపుల ఏలికనైతతి 2 సార్లు
చూచి వలచి చెంతకకు చేరి
నా సొగసులు కానుక జేసి
నీ మగసిరి బానిసనైతి 2 సార్లు

చ:  అందాలన్నీ దోచీ ఆనందపుటంచులు చూసి 2సార్లు
సందిట బందీ చేసీ సందిట బందీ చేసీ
నాబందీ వశమైపోతీ!!

చ: నూతన వధువై నిలచీ వరుణి వలపుల మధువై మారి 2 సార్లు
సఖునీ ఒడిలో సురిగీ 2 సార్లు
కోటి సుఖముల శిఖరమునైతీ!!

చ: వలపుల తేనెల మధురిమ గ్రోలితి ....నిదురా జగమూ మరచీ 2 సార్లు
నీవే జగమై నీలో సగమై నేటికి  నిండుగ పండితి!!


అదిగో నవలోకం

   

చిత్రం:  వీరాభిమన్యు
గానం:
సంగీతం: కె వి మహదేవన్
రచన: ఆరుద్ర
ప: అదిగో నవలోకం … వెలసే మనకోసం ….
అదిగో నవలోకం … వెలసే మనకోసం ….
అదిగో నవలోకం … వెలసే మనకోసం
నీలి నీలి మేఘాల లీనమై ..
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
నీలి నీలి మేఘాల లీనమై ..
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోర వలపు సీమలో ఆగుదాం
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోర వలపు సీమలో ఆగుదాం
ఎచట సుఖముందో ఎచట సుధ కలదో
అచటె మనముందామా!!

చ: పారిజాత సుమదళాల పానుపు
మనకు పరిచినాడు చెఱకు వింటి వేలుపు
పారిజాత సుమదళాల పానుపు
మనకు పరిచినాడు చెఱకు వింటి వేలుపు
ఫలించె కోటి మురిపాలు ముద్దులు
మన ప్రణయానికి లేవుసుమా హద్దులు
ఫలించె కోటి మురిపాలు ముద్దులు
మన ప్రణయానికి లేవుసుమా హద్దులు
ఎచట హృదయాలు ఎపుడూ విడిపోవో …..
అచటె మనముందామా …

రంభాఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె

 
చిత్రం; వీరాభిమన్యు
సంగీతం: కె వి మహదేవన్
గానం: ఘంటసాల, జానకి
రచన: ఆరుద్ర
ప: రంభా ఊర్వశి తలదన్నె రమణీలలామ ఎవరీమె
నన్నె వెదుకుచు భూమికి దిగిన కన్నెక రతియె కాబోలు
ఇంద్రుని చంద్రుని అందాలు ఈతని సొమ్మె కాబోలు
మౌనముగానే మనసును దోచె మన్మధుడితడే కాబోలు!!

చ: తనివితీరా వలచి హ్రుదయం కానుకీయని కరమేలా
తనివితీరా వలచి హ్రుదయం కానుకీయని కరమేలా
పరవసించి పడుచువానికి మధువుకాని సొగసేలా
పరవసించి పడుచువానికి మధువుకాని సొగసేలా

చ: కలికి సరసన పులకరించి కరిగిపోవని తనువేలా
కలికి సరసన పులకరించి కరిగిపోవని తనువేలా
ఎడములేక ఎదలు రెండు ఏకమవనీ బ్రతుకేలా
ఎడములేక ఎదలు రెండు ఏకమవనీ బ్రతుకేలా