Pages

Subscribe:

Sunday 8 November 2015

శ్రీరామ నామాలు శతకోటి


చిత్రం: మీనా
గానం: సుశీల
సంగీతం: రమేష్ నాయుడు

ప: శ్రీరామ నామాలు శతకోటి...
ఒక్కొక్క పేరు బహు తీపి...బహు తీపి
శ్రీరామ నామాలు శతకోటి...
ఒక్కొక్క పేరు బహు తీపి...బహు తీపి
తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరధరామయ్య స్తవనీయుడు
తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరధరామయ్య స్తవనీయుడు
కడుమేటి విల్లు విరిచి కలికిని చేపట్టు
కళ్యాణ రామయ్య కమనీయుడు...కమనీయుడు ll శ్రీరామ నామాలు ll

౧. సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందరరామయ్య సుకుమారుడు
కోతి మూకలతో...ఆ..ఆ..ఆ..కోతిమూకలతో లంకపై దండెత్తు
కోదండరామయ్య రణధీరుడు...రణధీరుడు ll శ్రీరామ నామాలు ll

౨. పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు
పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు
అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు
అచ్యుతరామయ్య అఖిలాత్ముడు...అఖిలాత్ముడు ll శ్రీరామ నామాలు ll

Sunday 1 November 2015

సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ

 
ప: సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని,
సుఖాన మనలేని వికాసమెందుకని,
సుమాల బలికోరే సమాజమెందుకని,
అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం !
తెలుసుకోండి ఆతల్లి తపనలో నేటి కన్నీటి కధనం !!
త్రిశంకు స్వర్గంలో తను త్రివర్ణస్వప్నమని !
విషాద వర్షంలో తను వివర్ణచిత్రమని !!

౧. ఆకసాన తననెగరెసి - ఏకాకిగా తననొదిలేసి
పాతాళంలో నిలచిన పౌరుల కరతాళ ధ్వని చూసి
విలవిలలాడుతు వెలవెలబొయెను మువ్వన్నెల జెండా
జలజల కురిసెను తెగిపడిపోయిన ఆశల పువ్వుల దండ !!
త్రిశంకు స్వర్గం లో  విషాద వర్షంలో

౨. ఆవేశంలో ప్రతి నిమిషం  ఉరికే నిప్పుల జలపాతం
కత్తి కొనల ఈ వర్తమానమున బ్రతకదు శాంతి కపోతం
బంగరు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు
భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే
శిరసు వంచెనదిగో ఎగిరే భరత పతాకం
చెరుగుతోంది ఆ తల్లి చరితలో విశ్వ విజయాల విభవం!!
త్రిశంకు స్వర్గం లో  విషాద వర్షంలో!!

౩. కులమతాల దవానలానికి కరుగుతున్నది మంచుశిఖరం 
కలహముల హాలాహలానికి మరుగుతున్నది హిందుసంద్రం!
దేశమంటే మట్టికాదను మాట మరచెను నేటి విలయం!
అమ్మ భారతి బలిని కోరిన రాచకురుపీ రాజకీయం !
విషము చిందెను జాతి తనువున ఈ వికృత గాయం !!

 సినిమాలో సాహిత్యం :
సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని
సుఖానమనలేని వికాసమెందుకని
నిజాన్ని బలి కోరే సమాజమెందుకని
అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం

ఆవేశంలో ప్రతి నిమిషం ఉరికే నిప్పుల జలపాతం
కత్తి కొనల ఈ వర్తమానమున బ్రతకదు శాంతి కపోతం
బంగరు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు
భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే
శిరసు వంచెనదిగో ఎగిరే భరత పతాకం!
చెరుగుతోంది ఆ తల్లి చరితలో విశ్వ విజయాల విభవం!!

సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని
సుఖానమనలేని వికాసమెందుకని

కులమతాల దవానలానికి కరుగుతున్నది మంచు శిఖరం !
కలహముల హాలాహలానికి మరుగుతున్నది హిందు సంద్రం!
దేశమంటే మట్టి కాదను మాట మరచెను నేటి విలయం!
అమ్మ భారతి బలిని కోరిన రాచకురుపీ రాజకీయం !
విషము చిందెను జాతి తనువున ఈ వికృత గాయం !!

అపురూపమైనదమ్మ ఆడజన్మ

 
చిత్రం: పవిత్ర బంధం
రచన:  సిరివెన్నెల
గానం : ఏసుదాస్
సంగీతం : MM కీరవాణి

కార్యేషు దాసి కరణేషు మంత్రి
భోజ్యేషు మాత శయనేషు రంభ

అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా
జీవితం అంకితం చేయగా...
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా

౧. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై
బ్రతుకుతుంది పడతి పతే లొకమై
మగని మంచి కొసం పడే ఆర్తిలో
సతిని మించగలరా మరే ఆప్తులు
ఏ పూజ చెసినా ఏ నోము నోచినా
ఏ స్వార్థము లేని త్యాగం
భార్యగ రూపమే పొందగా...!!

౨. కలిమిలేములన్నీ ఒకే తీరుగా
కలిసి పంచుకోగా సదా తొడుగా
కలిసి రాని కాలం వెలి వేసినా
విడిచిపోని బంధం తనై ఉండగా
సహధర్మచారిణి సరిలేని వరమని
సత్యాన్ని కనలేని నాడు
మోడుగా మిగలడా పురుషుడు...

అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా
జీవితం అంకితం చేయగా...

కార్యేషు దాసి కరణేషు మంత్రి
భోజ్యేషు మాత శయనేషు రంభ

అమ్మ బ్రహ్మదేవుడో కొంప ముంచినావురో


ప: ఉయ్.. డమ్ముకెయ్ డుండుండిగా సందడి సెయి తమాషగా అంగరంగ వైభోగంగా
సమ్మరం వీధుల్లో సేరి శివమెత్తంగా
ఉయ్.. దరువెయి తధినక అడుగెయిరా అదీ లెక్క సామిరంగ సిందాడంగా
శీనయ్యే ఏడుకొండలు దిగి కిందికిరాగా
అమ్మ బ్రహ్మదేవుడో కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో యాడ దాచినావురో
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు
రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

౧. కను రెప్పలు పడనప్పుడు కల కళ్ళపడదుగా
కనుకిప్పుడు ఎదరున్నది కల్లై పోదుగా
కను రెప్పలు పడనప్పుడు కల కళ్ళపడదుగా
కనుకిప్పుడు ఎదరున్నది కల్లై పోదుగా
ఒకటై సిన్నా పెద్దా అంతా సుట్టూ చేరండి
తకతై ఆటాడించే సోదం చూడండి
చంద్రుల్లో కుందేలు సందెల్లో అందాలు
మనముంగిట్లో కథాకళి ఆడేనా
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా!!


౨. మహగొప్పగ మురిపించగ సరికొత్త సంగతి
తలతిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి
మహగొప్పగ మురిపించగ సరికొత్త సంగతి
తలతిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి
అప్పన్న తన్నమన్న కథం తొక్కే పథానా
తప్పనా తన మన తేడాలేమైనా
తందానా తాళానా కిందైనా మీదైనా
తలవంచేనా తెల్లారులు థిల్లానా
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా!!
 అమ్మ బ్రహ్మదేవుడో కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో యాడ దాచినావురో
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు
రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
ఉయ్.. డమ్ముకెయ్ డుండుండిగా సందడి సెయి తమాషగా అంగరంగ వైభోగంగా
సమ్మరం వీధుల్లో సేరి శివమెత్తంగా
ఉయ్.. దరువెయి తధినక అడుగెయిరా అదీ లెక్క సామిరంగ చిందాడంగా
శీనయ్య ఏడుకొండలు దిగి కిందికిరాగా

తెల్లారింది లెగండో... కొక్కొరోక్కో...

                    


చిత్రం : కళ్ళు (1988)
సంగీతం : SPB
సాహిత్యం : సిరివెన్నెల
గానం : సిరివెన్నెల

తెల్లారింది లెగండో... కొక్కొరోక్కో...
తెల్లారింది లెగండో కొక్కొరోక్కో
మంచాలింక దిగండో కొక్కొరోక్కో
తెల్లారింది లెగండో కొక్కొరోక్కో
మంచాలింక దిగండో కొక్కొరోక్కో

1. పాములాంటి చీకటి పడగ దించి పోయింది
భయం నేదు భయం నేదు నిదర ముసుగు తీయండి
చావు లాటి చీకటి సూరు దాటి పోయింది
భయం నేదు భయం నేదు సాపలు సుట్టేయండి
ముడుసు కున్న రెక్కలిరిసి పిట్ట సెట్టు ఇడిసింది
ముడుసు కున్న రెక్కలిరిసి పిట్ట సెట్టు ఇడిసింది
మూసుకున్న రెప్పలిరిసి సూపు లెగర నీయండి

2. చురుకు తగ్గిపోయిందీ చందురుడి కంటికి
చులకనై పోయిందీ లోకం సీకటికి
కునుకు వచ్చి తూగింది సల్లబడ్డ దీపం
ఎనక రెచ్చి పోయిందీ అల్లుకున్న పాపం
మసక బారి పోయిందా సూసేకన్ను
ముసురు కోదా మైకం మన్నూ మిన్ను
కాలం కట్టిన గంతలు దీసి
కాంతుల ఎల్లువ గంతులు ఏసి

3. ఎక్కిరించు రేయిని సూసి ఎర్రబడ్డ ఆకాశం
ఎక్కుబెట్టి యిసిరిందా సూరీడి సూపుల బాణం
కాలి బూడిదై పోదా కమ్ముకున్న నీడ
ఊపిరితొ నిలబడుతుందా సిక్కని పాపాల సీడ
చమట బొట్టు సమురుగా సూరీణ్ణి ఎలిగిద్దాం
ఎలుగు చెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం
ఏకువ శత్తుల కత్తులు దూసి
రేతిరి మత్తును ముక్కలు సేసి