Pages

Subscribe:

Sunday 6 September 2015

ప్రియురాల సిగ్గేలనే


 చిత్రం : శ్రీకృష్ణ పాండవీయం
 సంగీతం : T.V.రాజు
రచన : సముద్రాల
గానం : ఘంటసాల , పి.సుశీల

ప్రియురాల సిగ్గేలనే ||2||
నీ మనసేలు మగవాని జేరి ప్రియురాల సిగ్గేలనే
నాలోన ఊహించిన..
కలలీనాడు ఫలియించెస్వామి..
నాలోన ఉంహించిన..

చరణం : 1
ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేరిపినావు ||2||
మనసుదీర పలుకరించి
మా ముద్దుముచ్చట చెల్లించవే ||ప్రియురాల||

చరణం : 2
ప్రేమలు తెలిసిన దేవుడవని విని నా మదిలోన కొలిచితిని ||2||
స్వామివి నీవని తలచి నీకే బ్రతుకు కానుక చేసితిని ||నాలోన||

చరణం : 3
సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవే ఓ భామా ||2||
ఇపుడేమన్నా ఒప్పునులే ఇక ఎవరేమన్నా తప్పదులే ||ప్రియురాల||


చాంగురే బంగారు రాజా



చిత్రం :  శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  జిక్కి 
పల్లవి :
చాంగురే... చాంగు.. చాంగురే..
చాంగురే...  బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా
మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే....
అయ్యారే.... నీకే మనసియ్యాలని వుందిరా
చాంగురే... చాంగురే..  బంగారు రాజా
చాంగు చాంగురే...  బంగారు రాజా  
చరణం 1 :
ముచ్చటైన మొలక మీసముంది..  భళా అచ్చమైన సింగపు నడుముంది
జిగీ బిగీ మేనుంది సొగసులొలుకు మోముంది.. మేటి దొరవు అమ్మక చెల్లా!
నీ సాటి ఎవ్వరునుండుట కల్లా... 
చరణం 2 :
కైపున్న మత్సకంటి చూపు... అది చూపు కాదు పచ్చల పిడిబాకు
పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకో... గుచ్చుకుంటే తెలుస్తుందిరా..
మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా...
 చరణం 3 :
గుబులుకొనే కోడెవయసు లెస్సా... దాని గుబాళింపు ఇంకా హైలెస్సా
పడుచుదనపు గిలిగింత.. గడుసు గడుసు పులకింత
ఉండనీయవేమి సేతురా కైదండలేక నిలువలేనురా

ఓహో మేఘమాలా

                    


చిత్రం :  భలే రాముడు (1956)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  సదాశివబ్రహ్మం
నేపధ్య గానం :  ఘంటసాల, పి. లీల


పల్లవి: 
ఓహో మేఘమలా నీలాల మేఘమాలా
ఓహో మేఘమలా నీలాల మేఘమాలా
చల్లగ రావేలా... మెల్లగ రావేలా
చల్లగ రావేలా... మెల్లగ రావేలా

వినీలా మేఘమాలా... వినీలా మేఘమాలా
నిదురపోయే రామచిలుకా...
నిదురపోయే రామచిలుకా..
బెదరిపోతుంది కల చెదిరిపోతుంది
చల్లగ రావేలా మెల్లగ రావేలా

చరణం 1:
ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ...ఈ...ఈ...
ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ..ఈ..ఈ...
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ

ఏం?..నిదురపోయే రామచిలుకా
..
నిదురపోయే రామచిలుకా
బెదరిపోతుంది కల చెదిరిపోతుంది
చల్లగ రావేలా మెల్లగ రావేలా...

చరణం 2:
ఓహో .....ఓహో .....ఓ....ఓ....ఓ
ఆమె:
ఓహో .....ఓహో .....ఓ....ఓ....ఓ

ఆశలన్నీ తారకలుగా హారమొనరించి...ఈ..ఈ...
ఆశలన్నీ తారకలుగా హారమొనరించి
అలంకారమొనరించి...

మాయ చేసి మనసు దోచి
మాయ చేసి మనసు దోచి..
పారిపోతావా దొంగా... పారిపోతావా...


ఓహో మేఘమాలా

                      

చిత్రం :  భలే రాముడు (1956)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  సదాశివబ్రహ్మం
నేపధ్య గానం :  ఘంటసాల, పి. లీల

Saturday 5 September 2015

నెలవంక తొంగి చూసింది



చిత్రం : రాజకోట రహస్యం (1971)
సంగీతం :  విజయా కృష్ణమూర్తి
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 

పల్లవి :
 నెలవంక తొంగి చూసింది.. చలిగాలి మేను సోకింది
మనసైన చెలువ కనులందు నిలువ.. తనువెల్ల పొంగి పూచింది
నెలవంక తొంగి చూసింది.. చలిగాలి మేను సోకింది
చిరునవ్వులొలుక చెలికాడు పలుక.. నిలువెల్ల వెల్లి విరిసింది
నెలవంక తొంగి చూసింది... 
 చరణం 1:
 ఏ జన్మలోని వరమో .. ఈ జన్మలోన దొరికె
ఏ జన్మలోని వరమో .. ఈ జన్మలోన దొరికె
ఏ పూలనోము ఫలమో .. నీ రూపమందు నిలిచె
సుడిగాలులైన ..జడివానలైన.. విడిపోని బంధమే వెలసె
నెలవంక తొంగి చూసింది .. చలిగాలి మేను సోకింది 
చరణం 2:
ఆనాటి వలపు పాట .. ఈనాటి బ్రతుకు బాట
ఆనాటి వలపు పాట .. ఈనాటి బ్రతుకు బాట
ఆనాటి కలవరింత .. ఈనాటి కౌగిలింత
ఏనాటికైన .. ఏ చోటనైన విడిపోనిదోయి మన జంట

నెలవంక తొంగి చూసింది .. చలిగాలి మేను సోకింది
చిరునవ్వులొలుక చెలికాడు పలుక .. నిలువెల్ల వెల్లి విరిసింది
నెలవంక తొంగి చూసింది .. చలిగాలి మేను సోకింది