Pages

Subscribe:

Sunday 28 August 2016

వేలవేల వెలుగుల హస్తాలు చాచి

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ ఆచార్యుల వారు వ్రాసిన శివపదములోనుండి సూర్యుని కీర్తన.

పల్లవి: వేల వేల వెలుగుల హస్తాలు చాచి చెంత చేర్చి
నీ మహస్సు నా మనస్సులో వచస్సులోన నింపి
ఆదుకొనుమ దిశాంపతీ! ఓ హిరణ్యబహూ! నీవే గతి

చరణం: సామకిరణ తంత్రీశ్రుతి సాగి నాడులను ధ్వనించి
నాద హృదయస్పందనమే నాదు హృదిని లయించి
నవ నవ భావాక్షరములు నా గళమున రహించి
కవితా కచ్ఛపిగా నా బ్రతుకంతా రవళించగ ..... పల్లవి....

చరణం: సద్య: స్ఫురణమ్ముగా సాగే శబ్దార్భటితో
రసోన్మత్తభావోజ్జ్వల రమ్యసాత్త్వికాకృతితో
నా కావ్యప్రపంచమే నీ నాట్య ప్రాభవమై
జగత్తునకు మహానందజాగ్రద్భాష్యమునీయగ ..... పల్లవి....

http://picosong.com/Yg8d

సవిత్రాత్మకా! రుద్రా! సావిత్రీ తేజమా!

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు వ్రాసిన శివపదములోనుండి సూర్యుని పై కీర్తన:
పల్లవి: సవిత్రాత్మకా! రుద్రా! సావిత్రీ తేజమా!
భవాంధపటలాపహా! భానుమండలాంతరా!
చరణం: అగ్నివాయు సూర్యాత్మక అఖిల విశ్వరూపా!
సప్తఛందాశ్వరథిక! సకల శ్రుత్యాకారా!
నీప్రభారశ్ములే నిండినవీ విశ్వమంత
జీవులప్రేరేపించెడి చిత్తేశా! బుద్ధిశాస్త! ..... పల్లవి....
చరణం: అచ్ఛేద్యా! ఆదిత్యా! అంతరిక్షకారకా!
శక్తిసంయుతా! రుద్రా! షణ్ముఖావనా! శంభూ!
హృదంతరమె రవిమండలమంతర్గత భాస్కరుడవు
నీకరుణకు నీ వింటికి వేల వేల నమస్సులు .... పల్లవి....

(సూర్యరూపుడైన రుద్రుడు తన కిరణాల బాణాలను ప్రయోగిస్తున్నాడని రుద్రనమకం చెప్తోంది)

తులసీ దళములతో పూజింతును సురభిల సుమముల అర్చన చేతును

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు శ్రీ వేంకటేశ్వరుని పై వ్రాసిన అర్చనాపూర్వక (అంగపూజ) కీర్తన... "శ్రీ వేంకటనాథా!" ఆల్బం నుండి...
పల్లవి: తులసీ దళములతో పూజింతును సురభిల సుమముల అర్చన చేతును;
అడుగుల మొదలుగ ఆ సిగవరకు అయ్యా! నిన్నే ఆరాధింతును
చరణములు :
(1) గంగ జనించిన ఘనమౌ పదముల అర్పించితిని అలరుల గుత్తులు
జానువులకు ఊరువులకు మ్రొక్కుచు అందించెద నీ సుందర దళముల
కమళనాభ! నీ కటిసీమమునకు సమర్పించితిని సరళ సుమమ్ములు
కటిహస్తమునకు వరద కరమునకు పూజలొనర్తుము పూచిన తలపుల
పల్లవి: తులసీ దళములతో పూజింతును సురభిల సుమముల అర్చన చేతును;
అడుగుల మొదలుగ ఆ సిగవరకు అయ్యా! నిన్నే ఆరాధింతును
(2) సిరులతల్లి నెలవైన వక్షమున అలంకారములు స్వర్ణమాలికలు
శంఖ చక్రములు సవరించిన నీ చేతులకివిగో చెలువపు పువ్వులు
సకలసౌందర్య సారమౌచు సరిసాటిలేని వదనమునకు పూజలు
వజ్రాదులచే ఖచితమైన నీ స్వర్ణ మకుటమ్మునకు అర్చనలు
పల్లవి: తులసీ దళములతో పూజింతును సురభిల సుమముల అర్చన చేతును;
అడుగుల మొదలుగ ఆ సిగవరకు అయ్యా! నిన్నే ఆరాధింతును


 http://picosong.com/4rwJ

విన్నవించుమమ్మా! నీ విభునితో

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు శ్రీ వేంకటేశ్వరుని పై వ్రాసిన కీర్తనలలో అమ్మవారిని వేడుకుంటున్న కీర్తన... "శ్రీ వేంకటనాథా!" ఆల్బం నుండి...
పల్లవి: విన్నవించుమమ్మా! నీ విభునితో పన్నగశయనునితో ఆపన్న శరణ్యునితో;
అలమేలు మంగా! మా కలతలన్ని తీరంగా చెలువపు నీ పతి చెంగట చేరి బ్రోవుమనుచూ

చరణములు:
(1) మా కన్నా ముందర ఆ కొండకొమ్ము చేరి
నీ కాంతుని వక్షమ్మున నీ చోటనె నిలిచి
ఏకాంతపు వేళలో వేడుక సయ్యాటలో
చీకాకుల మా బ్రతుకుల చిక్కు తీసి కాపాడగ
పల్లవి: విన్నవించుమమ్మా! నీ విభునితో పన్నగశయనునితో ఆపన్న శరణ్యునితో;
అలమేలు మంగా! మా కలతలన్ని తీరంగా చెలువపు నీ పతి చెంగట చేరి బ్రోవుమనుచూ
(2) అయ్య శ్రీనివాసుడు ఇతడనుచు మాకు చూపించి
నెయ్యపు మా సామి కరుణ నీ రూపని తెలిపి
వేయివిధాలుగ హరినే వినుతులతో కొలిచి నీవు
చేయివేసి మా బ్రతుకులు చేదుకొనగ ఆదుకొనగ
పల్లవి: విన్నవించుమమ్మా! నీ విభునితో పన్నగశయనునితో ఆపన్న శరణ్యునితో;
అలమేలు మంగా! మా కలతలన్ని తీరంగా చెలువపు నీ పతి చెంగట చేరి బ్రోవుమనుచూ

 http://picosong.com/59c2

గంధమాదన వాస! బంధమోచన ఈశ!


బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు వ్రాసిన "శ్రీ రామదూతా! జయ హనుమాన్!" ఆల్బం నుండి
ఆంజనేయ తత్త్వాన్ని ఆవిష్కరించే ధ్యానయోగ్యమైన కీర్తన

గంధమాదన వాస! బంధమోచన ఈశ!
బంధురకృపా! ఆత్మ బంధూ! మహేశా!

సువర్చస్సే నీదు శక్తి స్వరూపము
బ్రహ్మచారీ! మంత్రమయము నీరూపము
జానకీరఘురామ హృదయానందా!
కదళీ వనావాసా! సుగుణా విభూషా!
గంధమాదన వాస! బంధమోచన ఈశ!
బంధురకృపా! ఆత్మ బంధూ! మహేశా!
రానున్న కల్పమున కానున్న బ్రహ్మా!
సుగ్రీవసచివా! స్వరకోవిదా!
రామబంటువు నీకు బంటు నేనయ్యా!
పాదమందెద నన్ను పాలించుమయ్యా
గంధమాదన వాస! బంధమోచన ఈశ!
బంధురకృపా! ఆత్మ బంధూ! మహేశా!
రవినిగురువుగ చేసె నీ వినయ వీర్యము
భాస్కరుని తాకినది నీ భవ్య బాల్యము
దుష్టులను దునుమాడు నీ వామహస్తము
శిష్టులను కరుణించు దక్షిణపు హస్తము
గంధమాదన వాస! బంధమోచన ఈశ!
బంధురకృపా! ఆత్మ బంధూ! మహేశా!

నగజాకుమార! ఓ గజరాజముఖ! నీకు నిగనిగల కర్పూర నీరాజనం

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు వ్రాసిన ఈ కీర్తనతో గణపతికి నీరాజనాలు సమర్పించుకుందాం

నగజాకుమార! ఓ గజరాజముఖ! నీకు నిగనిగల కర్పూర నీరాజనం
నీరాజనం దివ్య నీరాజనం... నీరాజనం నిత్య నీరాజనం 2
నీ పాదముల వ్రాలు దేవకోటికిరీట దివ్యమణి కాంతులే నీరాజనం
ఓ మహకాయ! నీ ముందు మిణుగురులైన తారకాగ్రహతతులే నీరాజనం
నీరాజనం దివ్య నీరాజనం... నీరాజనం నిత్య నీరాజనం
బాలసూర్యునిరీతి భాసించు నీరూపు తిలకించు చూపులే నీరాజనం
నీ కృపను వెలుగు ఈ గీతికాజ్యోతులే నిలువెల్ల నిను జూపు నీరాజనం
వల్లభా ప్రాణేశ! కళ్యాణ గుణమయా! వాణీప్రదా! నీకు నీరాజనం
పాణితలముల పరశుపాశాదులనుదాల్చు ప్రణతార్తిసంహార! నీరాజనం
నీరాజనం దివ్య నీరాజనం... నీరాజనం నిత్య నీరాజనం

http://picosong.com/JTFq

ఎంతటి సులభ ప్రసన్నుడు ఇతడెంతటి చల్లని దేవుడు

శ్రీ గణేశాయ నమః
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు గణేశుని పై వ్రాసిన బహు కీర్తనలలో ఒకటి....

పల్లవి:
ఎంతటి సులభ ప్రసన్నుడు ఇతడెంతటి చల్లని దేవుడు
గోరంతగ భక్తిని చూపగ కొండంతగ ఏలే నాథుడు గణనాథుడు...మననాథుడు
చరణం:
గరికలతో పూజించిన చాలును గరిమగబ్రోచె కరిముఖుడు
పచ్చివడపప్పు ఇచ్చిమ్రొక్కితే మెచ్చి కరుణించు మేలిమి దేవుడు
గున గున నడకల కైలాసమ్మున కనుల పండువుగ తిరుగాడి
అమ్మ పార్వతికి అయ్య శంభునకు ఆనందమ్మిడు లీలామయుడు
చరణం:
ఇరువది ఒక పత్రాలనిచ్చిన మరి మరి మురిసె మా విభుడు
వంగి వంగి గుంజీలు తీసిన తప్పులు క్షమించు ఒప్పుల రాయడు
తలచిన వెంటనె నిలుచును ముందర తొలగించును పెను విఘ్నముల
అనుగు సోదరడు ఆ స్కందునితో అటలాడుకొను ఆనందదడు
చరణం:
కొబ్బరి చెరుకులు కోరి ఒసంగిన అబ్బురమగునటులుబ్బునట
కుడుములుండ్రాళ్ళు నివేదనమ్మిడ ఇడుములబాపే ఏలిక ఇతడట
గణేశ గణేశ యనగా గణించి స్ఫురించి తరింపజేయును
చవితి పూజలకు తనిసి వరమ్మిడు భువనాధ్యక్షుడు శివమయుడు

 http://picosong.com/cpcs

నటియించినాడే నర్తన గణేశుడు

శ్రీ గణేశాయ నమః
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు గణేశుని పై వ్రాసిన బహు కీర్తనలలో నర్తనగణపతిపై అద్భుత కీర్తన .
నటియించినాడే నర్తన గణేశుడు నటియించినాడే
చిటిపదంబులు కదల చటులగతులిటుకుదర
అటునిటు చెలంగుచూ అద్భుత విలాసముల
నటియించినాడే....................
మిసిమి పసిరూపుతో మసలునొకసారి
అంతట మహాకాయమగునొక్కసారి
అణువుకన్నా అణువు మహత్తుకి మహత్తూ
గగనములు భువనములు కదలించు గణమూర్తి
......నటియించినాడే నర్తన గణేశుడు నటియించినాడే....
ఘలు ఘల్లు ఘల్లుమని కాలి గజ్జెలు మ్రోగ
పలుముద్రలను చూపి చెలగి చేతులు త్రిప్పి
ఊగిసల ఘీంకారమొనరించు తొండమున
శూర్పకర్ణములాడ శూలిపుత్రుడు శుభుడు
......నటియించినాడే నర్తన గణేశుడు నటియించినాడే....
ఒకపాదమెత్తి మరి ఒక పదము భువినుంచి
పాముజందెమ్మాడ ఏకదంతము మెరయ
తలపైన నెలవంక తబ్బిబ్బుగానాడ
సకల కళలకు తానె సాకరమై నిలచి
......నటియించినాడే నర్తన గణేశుడు నటియించినాడే....


 http://picosong.com/cWVe/

శ్రీ మహా గణపతీ సిద్ధి గణపతీ భావింతును నిన్నే బహురూప గణపతీ

శ్రీ గణేశాయ నమః
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు గణేశుని పై వ్రాసిన ఈ పాట ద్వారా వివిధ గణపతులను నోరారా కీర్తించుకోవచ్చు.

శ్రీ మహా గణపతీ సిద్ధి గణపతీ భావింతును నిన్నే బహురూప గణపతీ
గణనలేని మహిమలుగల గణపతీ గణుతింతును ప్రణుతింతును గణపతి
వక్రతుండ గణపతీ బాలగణపతీ
చింతామణి గణపతీ క్షిప్రగణపతీ
హరిద్రా గణపతీ అర్కగణపతీ
వల్లభ గణపతీ సాక్షి గణపతి
శ్రీ మహా గణపతీ సిద్ధి గణపతీ భావింతును నిన్నే బహురూప గణపతీ
గణనలేని మహిమలుగల గణపతీ గణుతింతును ప్రణుతింతును గణపతి
రత్నగర్భ గణపతీ నృత్య గణపతీ
పంచవదన గణపతీ భక్త గణపతీ
ఉద్దండ గణపతీ యోగ గణపతీ
ఉఛ్ఛిష్ట గణపతీ ఊర్ధ్వ గణపతీ
శ్రీ మహా గణపతీ సిద్ధి గణపతీ భావింతును నిన్నే బహురూప గణపతీ
గణనలేని మహిమలుగల గణపతీ గణుతింతును ప్రణుతింతును గణపతి
హేరంబ గణపతీ ఢుంఢి గణపతీ
సంకటహర గణపతీ శక్తి గణపతీ
ఋణమోచన గణపతీ వీరగణపతీ
విఘ్నరాజ గణపతీ విజయగణపతీ
శ్రీ మహా గణపతీ సిద్ధి గణపతీ భావింతును నిన్నే బహురూప గణపతీ
గణనలేని మహిమలుగల గణపతీ గణుతింతును ప్రణుతింతును గణపతి
సిద్ధిబుద్ధి గణపతీ ఆదిగణపతీ
స్వస్తిక గణపతీ ప్రణవ గణపతీ
ఫాలచంద్ర గణపతీ మంత్ర గణపతీ
సింహాసన గణపతీ తంత్ర గణపతీ
శ్రీ మహా గణపతీ సిద్ధి గణపతీ భావింతును నిన్నే బహురూప గణపతీ
గణనలేని మహిమలుగల గణపతీ గణుతింతును ప్రణుతింతును గణపతి
లంబోదర గణపతి లక్ష్మీ గణపతీ
వినాయక గణపతీ వికట గణపతీ
ధూమ్రవర్ణ గణపతీ కపిల గణపతీ
శ్రీ విద్యా గణపతీ సుముఖ గణపతీ
శ్రీ మహా గణపతీ సిద్ధి గణపతీ భావింతును నిన్నే బహురూప గణపతీ
గణనలేని మహిమలుగల గణపతీ గణుతింతును ప్రణుతింతును గణపతి
 http://picosong.com/JDyc

తొలి తొలి పూజల దేవర

శ్రీ గణేశాయ నమః
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు గణేశుని పై వ్రాసిన బహు కీర్తనలలో ఒకటి....
తొలి తొలి పూజల దేవర! కొలుతుము నిన్ను గణేశ్వరా!
చేట చెవుల దొరా! నా విన్నపమును చెవిని పెట్టవయ్యా
మాటికి మాటికి మొరపెట్టే నా మనవిని చేకొనుమయ్యా
చరణం:
అంబాతనయా! లంబోదర! ఆలంబనమీయుమయా
మోదకహస్తా! మోహనగర! సమ్మోదమునొందుమయా
వెనుకకు లాగుచు వెలితిని జూపే వెతలను బాపుమయా
పెనగొని తగిలే విఘ్నపుంజముల పెకలించుమా సదయా!
చరనం:
హాస్య రసేశ! గజాస్య! గణేశ! సులాస్య కళానిలయా!
మూషికవాహన! దోషహర! సంతోషభావహృదయా!
అటమటపెట్టెడి కుటిలపు తలపుల చటుకున కూల్చుమయా
నిటలనయనసుత! అటునిటు చెదరక స్ఫుటముగ గొలుతుమయా

http://picosong.com/cMGF

Friday 26 August 2016

Sri Raja Rajeshwari శ్రీ రాజరాజేశ్వరీ! శ్రీ రాజరాజేశ్వరీ!!


బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు వ్రాసిన `శ్రీమాతా లలితా' ఆల్బంలో అమ్మవారి చిరునామా చెప్పే పాట.
పల్లవి:
శ్రీ రాజరాజేశ్వరీ! శ్రీ రాజరాజేశ్వరీ!!
శ్రీచక్ర సింహాసనాధీశ్వరీ! శ్రీ రాజరాజేశ్వరీ!

అనుపల్లవి:
రాజశేఖరహృదయరాణీ మహేశ్వరీ!
సుముఖషణ్ముఖజనని! శుద్ధజ్ఞానేశ్వరీ!
చరణం:
అమృతసాగరమందు అదిమణిద్వీపము
ఆచోట కడిమితోటలనడిమి భవనము
భవనమున సభయందు పంచబ్రహ్మాసనము
ఆ స్వర్ణపీఠిపై అమ్మ అపురూపము
పల్లవి:
శ్రీ రాజరాజేశ్వరీ! శ్రీ రాజరాజేశ్వరీ!!
శ్రీచక్ర సింహాసనాధీశ్వరీ! శ్రీ రాజరాజేశ్వరీ!
చరణం:
వాగ్దేవతలుపలికె వేలనామములు
దేవమకుటములిచ్చె మణులహారతులు
శివజటనదియించె సిద్ధపాద్యమ్ము
సర్వశక్తులనెలవు శ్రీమాత కొలువు
పల్లవి:
శ్రీ రాజరాజేశ్వరీ! శ్రీ రాజరాజేశ్వరీ!!
శ్రీచక్ర సింహాసనాధీశ్వరీ! శ్రీ రాజరాజేశ్వరీ!
అనుపల్లవి:
రాజశేఖరహృదయరాణీ మహేశ్వరీ!
సుముఖషణ్ముఖజనని! శుద్ధజ్ఞానేశ్వరీ!

http://picosong.com/6yeU

Wednesday 24 August 2016

శ్రీ రామ రఘు రామ శృంగార రామయని



           



ప. శ్రీ రామ రఘు రామ శృంగార రామయని
చింతింప రాదే ఓ మనసా

1. తళుకు చెక్కుల ముద్దు పెట్ట కౌసల్య మును
తపమేమి జేసెనో (కౌసల్య
తపమేమి జేసెనో) తెలియ (శ్రీ)

2. దశరథుడు శ్రీ రామ రారాయని పిల్వ మును
తపమేమి జేసెనో (దశరథుడు
తపమేమి జేసెనో) తెలియ (శ్రీ)

3. తనివార పరిచర్య సేయ సౌమిత్రి మును
తపమేమి జేసెనో (సౌమిత్రి
తపమేమి జేసెనో) తెలియ (శ్రీ)

4. తన వెంట చన జూచియుప్పొంగ కౌశికుడు
తపమేమి జేసెనో (కౌశికుడు
తపమేమి జేసెనో) తెలియ (శ్రీ)

5. తాపంబణగి రూపవతియౌటకహల్య
తపమేమి జేసెనో (అహల్య
తపమేమి జేసెనో) తెలియ (శ్రీ)

6. ధర్మాత్మ చరణంబు సోక శివ చాపంబు
తపమేమి జేసెనో (చాపంబు
తపమేమి జేసెనో) తెలియ (శ్రీ)

7. తన తనయనొసగి కనులార కన జనకుండు
తపమేమి జేసెనో (జనకుండు
తపమేమి జేసెనో) తెలియ (శ్రీ)

8. దహరంబు కరగ కరమును పట్ట జానకి
తపమేమి జేసెనో (జానకి
తపమేమి జేసెనో) తెలియ (శ్రీ)

9. త్యాగరాజాప్తయని పొగడ నారద మౌని
తపమేమి జేసెనో (ఆ మౌని
తపమేమి జేసెనో) తెలియ (శ్రీ)


Monday 15 August 2016

వందే త్వాం భూదేవీ ఆర్యమాతరం

రాయప్రోలు సుబ్బారావు గారి దేశ భక్తి గీతం..
వందే త్వాం భూదేవీ ఆర్యమాతరం
జయతు జయతు పాదయుగళం తే నిరంతరం
శుభ్ర శరచ్చన్ద్రయుక్త చారు యామినీమ్
వికసిత నవకుసుమ మృదుల దామ శోభినీం
మందస్మిత యుక్తవదన మధుర బాషిణీం
సుజలాం సుఫలాం సరళాం శివ వరదాం
చిర సుఖదాం ముకుళరదా - ఆర్య మాతరం
దశకత్రయ కోటి జనకంఠ నాదినీం
అమిత భుజం ధృతసదసీం తనయ తారిణీం
హిమనగజాం స్వాభిమాన బుద్ధి దాయినీం
కమలాం అమలాం అతులాం రిపుహారిణీం
బలకరిణీమ్ ధృత నలినీం రాష్ట్ర మాతరం
ధర్మస్త్వం మర్మత్వం త్వం యశో బలం
శక్తిస్త్వం భక్తిస్త్వం కర్మచాఖిలం
ప్రతిసదనం ప్రతిమా తే త్వం మహాబలం
ధరణీం భరణీం జననీం కవిప్రతిభాం
నతి సులభాం జగదంబాం హిందు మాతరం

జయ రఘునందన

వందేమాతరం

నమో నమో భారతాంబే

Saturday 6 August 2016

Mohabbat Kar Lo Jee Bhar Lo


Movie: Aar Paar
Music Director: O.P. Nayyar.
Singer: Geeta Dutt, Mohammed Rafi.

मोहब्बत कर लो जी भर लो अजी किसने रोका है
पर बड़े गज़ब की बात है इसमे भी धोखा है
शिकायत कर लो जी भर लो अजी किसने रोका है
हो सके तो दुनिया छोड़ दो दुनिया भी धोखा है

जहा ये मस्ती मस्त नज़र पे चाई देता नही कुछ सुझाई
टकरा के नैन मिलता है चैन मुरख क्यो रोता है हो

मोहब्बत क्या है सुनो जी हमसे
सब कुछ है इसी के दम से
किया एक बार हमने भी प्यार
कुछ भी नही अपना है

मिलना चाहू तो मिले जुदाई
उल्फत मे यहा जुदाई है
सब रंग भूल खिलता है फूल
भवर जब मिलता है

मोहब्बत से खुल जहा खफा है
पर इसमे बड़ा मज़ा है
जब दिल दुखेगा उस दम खुलेगा
इसमे क्या होता है
मोहब्बत कर लो ...

Abhi Na Jaao Chhodkar Ke Dil Abhi Bhara Nahin

                           
Movie/Album: हम दोनों (1961)
Music By: जयदेव
Lyrics By: साहिर लुधियानवी
Performed By: मो.रफ़ी, आशा भोसले

अभी ना जाओ छोड़कर, के दिल अभी भरा नहीं

अभी-अभी तो आई हो, अभी-अभी तो
अभी-अभी तो आई हो, बहार बन के छाई हो
हवा ज़रा महक तो ले, नज़र ज़रा बहक तो ले
ये शाम ढल तो ले ज़रा, ये दिल सम्भल तो ले ज़रा
मैं थोड़ी देर जी तो लूँ, नशे के घूँट पी तो लूँ
अभी तो कुछ कहा नहीं, अभी तो कुछ सुना नहीं
अभी ना जाओ छोड़कर...

सितारे झिलमिला उठे, चराग़ जगमगा उठे
बस अब न मुझको टोकना, न बढ़ के राह रोकना
अगर मैं रुक गई अभी, तो जा न पाऊँगी कभी
यही कहोगे तुम सदा, के दिल अभी नहीं भरा
जो खत्म हो किसी जगह, ये ऐसा सिलसिला नहीं
अभी नहीं, अभी नहीं, नहीं नहीं नहीं नहीं
अभी ना जाओ छोड़कर...

अधूरी आस छोड़ के, अधूरी प्यास छोड़ के
जो रोज़ यूँ ही जाओगी, तो किस तरह निभाओगी
कि ज़िंदगी की राह में, जवाँ दिलों की चाह में
कई मक़ाम आएंगे, जो हमको आज़माएंगे
बुरा न मानो बात का, ये प्यार है गिला नहीं
हाँ, यही कहोगे तुम सदा, के दिल अभी भरा नहीं
हाँ, दिल अभी भरा नहीं, नहीं नहीं नहीं नहीं

Achcha Jee Main Haari


Movie : Kala Pani
Music Director : S D Burman
Singer : Asha Bhosle , Mohammed Rafi
Director : Raj Khosla.


अच्छा जी मैं हारी, चलो, मान जाओ ना
देखी सबकी यारी, मेरा दिल, जलाओ ना

छोटे से क़ुसूर पे, ऐसे हो खफ़ा
रूठे तो हुज़ूर थे, मेरी क्या खता
देखो दिल ना तोड़ो
छोड़ो हाथ छोड़ो
छोड़ दिया तो हाथ मलोगे, समझे?
अजी समझे!
अच्छा जी मैं हारी, चलो...

जीवन के ये रास्ते, लम्बे हैं सनम
काटेंगे ये ज़िंदगी, ठोकर खा के हम
ज़ालिम साथ देले
अच्छे हम अकेले
चार कदम भी चल न सकोगे, समझे?
हाँ समझे!
अच्छा जी मैं हारी, चलो...

जाओ रह सकोगे ना, तुम भी चैन से 
तुम तो खैर लूटना जीने के मज़े
क्या करना है जी के
हो रहना किसी के
हम ना रहे तो याद करोगे, समझे?
समझे!
अच्छा जी मैं हारी, चलो...

కంచికి పోతావా క్రిష్ణమ్మా


చిత్రం: శుభోదయం
రచన: వేటూరి
సంగీతం: కె.వి.మహదేవన్
గానం: ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం

కంచికి పోతావా క్రిష్ణమ్మా
ఆ కంచి వార్తలేమి క్రిష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా
అది బొమ్మ కాదు ముద్దుగుమ్మా ॥౨॥

త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాదీ బొమ్మ
రాగమేదొ తీసినట్టు ఉందమ్మా ॥౨॥
ముసిముసి నవ్వుల పువ్వులు పూసిందీ కొమ్మ
మువ్వగోపాలా మువ్వగోపాలా మువ్వగోపాలా అన్నట్టుందమ్మా
అడుగుల్ల సవ్వళ్ళు కావమ్మా అవి ఎడదల్లొ సందళ్ళు లేవమ్మా ॥౨॥॥కంచికి॥

రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా
రాతిరేళ కంట నిదర రాదమ్మా ॥౨॥
ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మ
ముద్దు మురిపాలా మువ్వగోపాలా నీవు రావేలా అన్నట్టుందమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా ॥౨॥ ॥కంచికి॥

ముద్దు మురిపాలా మువ్వగోపాలా నీవు రావేలా క్రిష్ణమ్మా

Wednesday 3 August 2016

8. విజయలక్ష్మి:

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు అష్టలక్ష్ములపై శ్లోకములు, పాటలు వ్రాసారు. ఇవి ఆయా లక్ష్ములకు సంబంధించిన శాస్త్రవైభవములతో శ్రీ సూక్తము మొదలైనవాటితో మంత్రగర్భితంగా కూర్చబడినవి. ఈ శ్రావణ మాసంలో నిత్య పారాయణం చేసుకోదగినవి.
 శ్లోకము: శ్రీ మద్వీర రసావతార మహిమాం శౌర్యప్రతాపాకృతిమ్
ఉత్సాహాది మహత్త్వపూర్ణఫలదాం దేవీం జయశ్శ్రీకరీం
ధర్మోద్ధారణకారిణీం రిపుహరాం జ్యోతిర్మయాంగీం రమామ్
ఆర్తత్రాణకరీం మహావిజయదాం లక్ష్మీం సదా భావయే

పల్లవి: విజయలక్ష్మీం సకవిఘ్నసంహారిణీం భజేహం సంతతం మానసాంబుజగతామ్

చరణం: మహిష డోలాసురాద్యఖిల దనుజాంతకామ్
సహజ శాంత్యాత్మికాం సర్వాది మూలామ్
విహిత ధర్మానుగాం హితహేతుభూతామ్
ఇహ పర సుఖప్రదాం ఇందిరాం భద్రదామ్ ... పల్లవి....

చరణం: దేవతాకోటి సంసేవితాం భావితామ్
కేవలానందమయ భావనాం భాసురామ్
దేవరిపుసంహార తేజోమయాంగీమ్
శ్రీవాసుదేవ హృదయేశ్వరీం భాస్వరామ్

 http://picosong.com/cmJK

7. సంతాన లక్ష్మి:

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు అష్టలక్ష్ములపై శ్లోకములు, పాటలు వ్రాసారు. ఇవి ఆయా లక్ష్ములకు సంబంధించిన శాస్త్రవైభవములతో శ్రీ సూక్తము మొదలైనవాటితో మంత్రగర్భితంగా కూర్చబడినవి. ఈ శ్రావణ మాసంలో నిత్య పారాయణం చేసుకోదగినవి.
  శ్లోకము: శ్రీ వాత్సల్య గుణామృతాబ్ధిలహరీం శ్రీ విష్ణువక్షస్థితామ్
వంశవృద్ధికరీం సమస్త జననీం వంశీధర ప్రేయసీమ్
సౌజన్యాదిక సత్త్వభావ భరితాం ప్రాణప్రదాత్రీం సుధామ్
వందే విశ్వకుటుంబినీం గుణమయీం సంతాన లక్ష్మీం సదా

పల్లవి: సంతాన లక్ష్మీం సంతతం చింతయే చింతితార్థప్రదాం జీవన విధాయినీమ్

చరణం: క్షీరాబ్ధి సంభవాం శ్రీ భార్గవీం శ్రియమ్
కారుణ్య విగ్రహాం కారుణ్య వర్షిణీమ్
తారక కటాక్షాం తరణికోటిప్రభామ్
ఆరాధకాఽభీష్ట ఫలకారిణీం భజే ... పల్లవి....

చరణం: శ్రీ మాతరం భక్తచింతామణీం త్వామ్
క్షేమంకరీం విష్ణుచిత్తాముదారామ్
సన్మంత్ర మాతృకాం సంజీవరూపిణీమ్
జన్మసాఫల్యదాం అమరవనితార్చితామ్

 http://picosong.com/cmJR

6. గజలక్ష్మి:

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు అష్టలక్ష్ములపై శ్లోకములు, పాటలు వ్రాసారు. ఇవి ఆయా లక్ష్ములకు సంబంధించిన శాస్త్రవైభవములతో శ్రీ సూక్తము మొదలైనవాటితో మంత్రగర్భితంగా కూర్చబడినవి. ఈ శ్రావణ మాసంలో నిత్య పారాయణం చేసుకోదగినవి.
 శ్లోకము: శ్రీ మద్దిగ్గజ సంస్థిత కనత్కుంభాంబు సుస్నాపితామ
ఆర్ద్రాం పుష్కరిణీం హిరణ్మయసుధాకారాం యశోదాయినీమ్
అష్టైశ్వర్య మహాసిద్ధిగణ సంసేవ్యాం కృపావల్లరీమ్
వందే త్వాం గజమధ్యగాం సురుచిరాం లక్ష్మీం ముకుందప్రియామ్

పల్లవి: శ్రీ గజలక్ష్మీం చింతయామ్యహమ్; వాగీశార్చిత భవ్య పాదుకామ్

చరణం: పద్మకరాం పద్మాసన సంస్థామ్
పద్మనాభహృత్పద్మమందిరామ్
పద్మముఖీం పద్మాం సురేశ్వరీమ్
పద్మినీం మహాపద్మవనగతామ్ ... పల్లవి....

చరణం: గృహగత సంపత్కీర్తి వర్ధినీమ్
గృహలక్ష్మీం సద్గృహ సంవాసామ్
ఇహపర సుఖదాం నిరుపమ ఫలదామ్
గ్రహదోషహరాం అనుగ్రహకరామ్

http://picosong.com/cjRH

5. ధైర్యలక్ష్మి:

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు అష్టలక్ష్ములపై శ్లోకములు, పాటలు వ్రాసారు. ఇవి ఆయా లక్ష్ములకు సంబంధించిన శాస్త్రవైభవములతో శ్రీ సూక్తము మొదలైనవాటితో మంత్రగర్భితంగా కూర్చబడినవి. ఈ శ్రావణ మాసంలో నిత్య పారాయణం చేసుకోదగినవి.
శ్లోకము: శ్రీం బీజాక్షర రూపిణీం నత మనో దారుఢ్య సంధాయినీమ్
హృత్పీఠాధి నివాసినీం జడ తమఃసంహారిణీం ఈశ్వరీమ్
సామర్థ్యాదిక దాయినీం సకలసంతోషప్రదాం భాస్వరామ్
ధైర్య స్థైర్య గుణప్రదాం శివకరీం లక్ష్మీం సదా భావయే

పల్లవి: ధైర్యలక్ష్మీం సర్వకార్యఫలదాయినీం ఆర్యజన సన్నుతాం అంబికాం భావయే

చరణం: శ్రీపీఠసింహాసినీం మహా రాజ్ఞీమ్
ఆపన్నివారిణీం ఆతంకహారిణీమ్
సంపత్స్వరూపిణీం సామ్రాజ్యదాయినీమ్
వ్యాపినీం లోకైక దీపాంకురాం భజే ... పల్లవి....

చరణం: సకల సంకల్ప ఫల సాన్నిధ్య కారిణీమ్
అకళంకశశిముఖీం అనుగ్రహ విగ్రహామ్
వికృత భావాంతకాం విస్తృత జగన్మయీమ్
సుకృతజన గోచరాం శుద్ధాం సదా భజే

http://picosong.com/c46T

4. ధనలక్ష్మి:

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు అష్టలక్ష్ములపై శ్లోకములు, పాటలు వ్రాసారు. ఇవి ఆయా లక్ష్ములకు సంబంధించిన శాస్త్రవైభవములతో శ్రీ సూక్తము మొదలైనవాటితో మంత్రగర్భితంగా కూర్చబడినవి. ఈ శ్రావణ మాసంలో నిత్య పారాయణం చేసుకోదగినవి.

శ్లోకము: శ్రీ మద్ధర్మ పథానులబ్ధ విభవామ్ శ్రేయస్కరీం నిర్మలామ్
లోకాకర్షిత కీర్తిదాం సకల సద్యోగప్రదాం భాగ్యదామ్
సౌభాగ్యామల విగ్రహాం అభయదాం దారిద్ర్య విధ్వంసినీమ్
వందే త్వాం ధనరూపిణీం స్మితముఖీం లక్ష్మీం జగన్నాయికామ్

పల్లవి: ధన లక్ష్మీం ఘనలక్ష్మీం భజే కనకధారామ్;
మనసా శిరసా నమామి మాంగల్య వివర్ధినీమ్

చరణం: హిరణ్య రజతస్రజాం వరేణ్య రూపాం నవామ్
శరణ్య చరణాం కరుణాం పరమయోగకారిణీమ్ ... పల్లవి....

చరణం: సర్వజీవ జీవికాం సర్వ మోదదాయినీమ్
నిర్వేదహరాం శాంతాం నిర్వచనాతీతాం తాం

http://picosong.com/cfqn

3. ధాన్యలక్ష్మి:

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు అష్టలక్ష్ములపై శ్లోకములు, పాటలు వ్రాసారు. ఇవి ఆయా లక్ష్ములకు సంబంధించిన శాస్త్రవైభవములతో శ్రీ సూక్తము మొదలైనవాటితో మంత్రగర్భితంగా కూర్చబడినవి. ఈ శ్రావణ మాసంలో నిత్య పారాయణం చేసుకోదగినవి.

 శ్లోకము: శ్రీ కారుణ్యసుధామయీం జగదధిష్ఠాత్రీం సదా పోషకీమ్
సస్యారణ్య నదీ నదాది వసురూపాం అన్నదాం ధారుణీమ్
క్షుద్బాధాపరిహారిణీం సకల భూతాధార భూతాం పరామ్
ధన్యాం ధాన్య సమృద్ధిదాం సుతరసీం లక్ష్మీం హృదా భావయే

పల్లవి: ధాన్యలక్ష్మీం అన్నదాయినీం ప్రార్థయే పుణ్యసంపాదినీం పూర్ణాం ప్రసన్నామ్

చరణం: శాకంభరీం జీవ శక్తి సంధాయినీమ్
ఆకారదాయినీం ఆరోగ్యభాగ్యదామ్
శ్రీకర సుదీర్ఘాయురైశ్వర్య కారిణీమ్
ప్రాకృత వర ప్రదామ్ రక్షిత జగత్త్రయీమ్ ... పల్లవి....

చరణం: పుష్టిప్రదాం లోక పోషిణీం చిత్కళామ్
ఇష్టఫల సిద్ధిదాం ఇంద్రియాధీశ్వరీమ్
తుష్టిదామ్ స్వాహా స్వధాకార ధారిణీమ్
సృష్టికర్త్రీం సదా దృష్ట సంవర్ధినీమ్

http://picosong.com/ccKJ/