Pages

Subscribe:

Wednesday 26 October 2016

నన్ను ఎవరో తాకిరి

నను మరువని దొరవని తెలుసు


చిత్రం : రాజకోట రహస్యం (1971)
సంగీతం :  విజయా కృష్ణమూర్తి
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల
సాకి : తొలి సిగ్గుల తొలకరిలో తలవాల్చిన చంద్రముఖి
తెరలెందుకు నీకు నాకు దరి జేరవె ప్రియసఖి
పల్లవి : నను మరువని దొరవని తెలుసు
నను మరువని దొరవని తెలుసు
నా మదిలోన ఏముందొ అది నీకు తెలుసు
నను వలచిన చెలివని తెలుసు
నను వలచిన చెలివని తెలుసు
నా ఎదలోన ఏముందొ అది నీకు తెలుసు
నను వలచిన చెలివని తెలుసు
చరణం 1: చెంపల కెంపులు దోచాలని .. సంపంగి నవ్వులు దూయాలని
ఆ .. ఆ .. ఆ
చెంపల కెంపులు దోచాలని .. సంపంగి నవ్వులు దూయాలని
నడుమున చేయి వేసి నడవాలని...
నా .. నడుమున చేయి వేసి నడవాలని
అంటుంది అంటుంది నీ కొంటె వయసు ...
నను వలచిన చెలివని తెలుసు
నా ఎదలోన ఏముందొ అది నీకు తెలుసు
నను వలచిన చెలివని తెలుసు... 
చరణం 2: నీ రాజు తోడుగ నిలవాలని ... ఈ ఏడు లోకాల గెలవాలని
ఆ .. ఆ .. ఆ
నీ రాజు తోడుగ నిలవాలని ... ఈ ఏడు లోకాల గెలవాలని
బ్రతుకే పున్నమి కావాలని....
నీ ...బ్రతుకే పున్నమి కావాలని
కోరింది కోరింది నీ లేత వయసు ...
నను మరువని దొరవని తెలుసు
నా మదిలోన ఏముందొ అది నీకు తెలుసు

నను వలచిన చెలివని తెలుసు

ఈరేయి నీవు నేను ఎలాగైనా కలవాలి

పిలిచిన పలుకవు ఓ జవరాలా



చిత్రం: పిడుగు రాముడు (1966)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి: పిలిచిన పలుకవు ఓ జవరాలా
పిలిచిన పలుకవు ఓ జవరాలా
చిలిపిగ నను చేర రావా... రావా..
పిలిచిన పలుకవు ఓ జవరాలా
కలువల రాయడు చూసే వేళ
కలువల రాయడు చూసే వేళ
చెలియను కవ్వింతు వేలా.. యేలా
కలువల రాయడు చూసే వేళా..
చరణం 1: చల్లగ విరిసే నీ చిరునవ్వులు
చల్లగ విరిసే నీ చిరునవ్వులు .. మల్లెలు కురిసెను నాలోన
తొలిచూపులలో చిలికిన వలపులు
తొలిచూపులలో చిలికిన వలపులు.. తొందర చేసెను నీలోన!!
చరణం 2: జగములనేలే సొగసే నీదని...
జగములనేలే సొగసే నీదని.. గగనములో దాగే నెలరేడు
మనసును దోచే మరుడవు నీవని
మనసును దోచే మరుడవు నీవని.. కనుగొంటినిలే ఈనాడు!!




నీలోన నన్నే నిలిపేవు నేడే


చిత్రం: గుడిగంటలు (1965)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: శ్రీశ్రీ
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి: నీలోన నన్నే నిలిపేవు నేడే...
ఏ శిల్పి కల్పనవో...ఓ..ఏ కవి భావనవో
నీలోన నన్నే నిలిపేవు నేడే...
ఏ శిల్పి కల్పనవో...ఓ..ఏ కవి భావనవో..ఓ..
ఆహ...ఆ..ఒహొ..ఒహొహా....అహా..హా...
చరణం 1: ఎల్లోర గుహలో పిల్ల ఉంది నీలో..నండూరివారి ఎంకి ఉంది నీలో...
ఆహ...ఆ..ఒహొ..ఒహొహా...
ఎల్లోర గుహలో పిల్ల ఉంది నీలో..నండూరివారి ఎంకి ఉంది నీలో...
అల విశ్వనాథ చెలి కిన్నెరుంది...మా బాపిరాజు శశికళ ఉంది...
చరణం 2: ఖయ్యాము కోలిచే సాకివి నీవే..కవి కాళిదాసు శకుంతల నీవే
ఆహ...ఆ..ఒహొ..ఒహొహా...
ఖయ్యాము కోలిచే సాకివి నీవే..కవి కాళిదాసు శకుంతల నీవే
తొలి ప్రేమదీపం వెలిగించినావే..తొలి పూలబాణం వేసింది నీవే...!!నీలోన!!

Tuesday 25 October 2016

ఓ బంగరు రంగుల చిలకా



చిత్రం :  తోట రాముడు (1975)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల
ప: ఓ బంగరు రంగుల చిలకా .. పలకవే

ఓ అల్లరి చూపుల రాజా .. ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ

ఓ అల్లరి చూపుల రాజా .. పలకవా
ఓ బంగరు రంగుల చిలకా .. ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ

౧. పంజరాన్ని దాటుకునీ .. బంధనాలు తెంచుకునీ .. నీ కొసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా .. మిద్దెలోని బుల్లెమ్మా .. నిరుపేదని వలచావెందుకే
నీ చేరువలో .. నీ చేతులలో .. పులకించేటందుకే
ఓ బంగరు రంగుల చిలకా .. పలకవే
ఓ అల్లరి చూపుల రాజా .. ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ

౨. సన్నజాజి తీగుందీ .. తీగమీద పువ్వుందీ .. పువ్వులోని నవ్వే నాదిలే
కొంటెతుమ్మెదొచ్చిందీ .. జుంటి తేనె కోరిందీ .. అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో .. ఈ కోనల్లో .. మనకెదురే లేదులే
ఓ అల్లరి చూపుల రాజా .. పలకవా
ఓ బంగరు రంగుల చిలకా .. ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ