Pages

Subscribe:

Wednesday 21 June 2017

రమా వినోది వల్లభా నమామి స్వర సుమాభరణా




చిత్రం : స్వరాభిషేకం (2004)
సంగీతం : విద్యాసాగర్
రచన : సామవేదం షణ్ముఖశర్మ
గానం : మనో, చిత్ర, శ్రీరామ్ పార్థసారథి

సమానమెవ్వరు నీకిల
ఉమారమణ... ఆ....
పాహి పాహి... ఓయీ శ్రీచరణా
రమా వినోది వల్లభా నమామి స్వర సుమాభరణా...
నాద సదనా...
శ్రుతిధనా... ఆ... ఆ...
రమా వినోది వల్లభ        
ఉమారమణ శ్రీచరణ (2)
నమామి నాదసదనా... ఆ...
నమామి నాదసదనా శ్రుతిధనా
స్వరసుమాభరణ పాహి పాహి... ॥
౧. ప్రాణగానమాలాపన చేసి
స్వరసోపానములధిరోహించి (2)
ప్రణవ శిఖరిపై... ప్రణవ శిఖరిపై నిను దరిశించి
చిదంబరాన హృదంబుజమ్మున
నీపదాంబుజంబుల ధ్యానించి
శుభంకర నవరసాంబు ధారల
ప్రభాతాభిషేకములు జేతురా
పాహి పాహి... పాహి పాహి... ॥
గమక గమనముల స్వరఝరులే
జడల అడవిలో సురధునిగా
మురిసి ముక్కనుల కదలికలే
ముజ్జగాల సంగతులగతులుగా
రాగములే నాగాభరణములై
యోగములే వాగర్థాకృతులై
కాలములే లీలాకరణములై
సామములే మధుగాంధర్వములై
గంగాధరా! శంకరా! సంగీతసాకారా!
ఉమారమణ శ్రీచరణ పాహి... పాహి...

Tuesday 13 June 2017

ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో




చిత్రం: అమరశిల్పి జక్కన
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
రచయిత: సి నా రె 
గానం: ఘంటసాల
పల్లవి:  ఓహో ఓ ఓ....
ఓహోహో....
ఓ ఓ....
ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఒ... ఓ .. ఓ ..
చరణం 1:  పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి ..ఈ నల్లని రాలలో
చరణం 2:  కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
ఉలి అలికిడి విన్నంతనే ఉలి అలికిడి విన్నంతనే....
ఉలి అలికిడి విన్నంతనె జల జలమని పొంగి పొరలు ..ఈ నల్లని రాలలో..
చరణం 3:  పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న శిలలే నయమని పించును ..ఈ నల్లని రాలలో..

భలే మంచి రోజు పసందైన రోజు


 చిత్రం : జరిగిన కథ
సంగీతం, గానం : ఘంటసాల

రచన : సి. నారాయణ రెడ్డి
భలే మంచి రోజు పసందైన రోజు 
వసంతాలు పూచే నేటి రోజు(2)
భలే మంచి రోజు....
గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు 
గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు (2)
నింగిలోని అందాలన్నీ ముంగిటిలో నిలిచిన రోజు 
భలే మంచి రోజు
చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు 
తొలివలపు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు(2)
కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు 
భలే మంచి రోజు


Monday 12 June 2017

అంతగా నను చూడకు


చిత్రం: మంచిమనిషి (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సినారె

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
పల్లవి: అంతగా నను చూడకు … ష్… మాటాడకు
అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు
హోయ్ అంతగా నను చూడకు
1. చలిచలి గాలులు వీచెను... సన్నని మంటలు లేచెను..
అహహా.. ఆ.. ఆ..ఆ
చలిచలి గాలులు వీచెను... సన్నని మంటలు లేచెను
తలపులే కవ్వించెను ..వలవుల వీణలు తేలించెను!!
2. జిలిబిలి ఊహలు రేగెను .. నా చేతులు నీకై సాగెను
అహహా.. ఆ.. ఆ..ఆ
జిలిబిలి ఊహలు రేగెను .. నా చేతులు నీకై సాగెను
పెదవులే కవ్వించెను … పదునౌ చూపులు బాధించెను!!
3. వాలుగ నిన్నే చూడనీ .. కలకాలము నీలో దాగనీ ..
అహహా.. ఆ.. ఆ..ఆ
వాలుగ నిన్నే చూడనీ .. కలకాలము నీలో దాగనీ
నవ్వులే పండించనీ .. పువ్వుల సంకెల బిగించనీ ..
హోయ్... అంతగా నను చూడకు .. ష్ .. మాటాడకు..
అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు
హోయ్ అంతగా నను చూడకు

అంకితం.. నీకే అంకితం


చిత్రం : స్వప్న (1980)
సంగీతం : సత్యం
సాహిత్యం : సి.నారాయణరెడ్డి
గానం : బాలు
అంకితం.. నీకే అంకితం
అంకితం.. నీకే అంకితం
నూరేళ్ళ ఈ జీవితం
అంకితం.. నీకే అంకితం
ఓ ప్రియా...  ఆ... ఆ... ఓ ప్రియా... ఓ ప్రియా..
కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత
త్యాగరాయ కృతులందు వెలయు గీతార్ధసార నవత
నవ వసంత శోభనా మయూఖ..
లలిత లలిత రాగ చంద్రరేఖ..
స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది
మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుందీ...
స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది
మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది
ఆ అనురాగం ఒక ఆలయమైతే.. ఏ.. ఏ...
ఆ ఆలయ దేవత నీవైతే..ఏ ఏ...
ఆ ఆలయ దేవత నీవైతే..
గానం గాత్రం గీతం భావం.. సర్వం అంకితం!!
లోక వినుత జయదేవ శ్లోక శృంగార రాగ ద్వీప
భరత శాస్త్ర రమణీయ నాద నవ హావ భావ రూప
స్వర విలాస హాస చతుర నయన..
సుమ వికాస భాస సుందర వదన..
నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది
ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుందీ...
నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది
ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది
ఆ ప్రణయం ఒక గోపురమైతే.. ఏ ఏ ..
ఆ గోపుర కలశం నీవైతే.. ఏ ఏ ..
ఆ గోపుర కలశం నీవైతే..

పుష్పం.. పత్రం.. ధూపం.. దీపం.. సర్వం అంకితం

అందాల శ్రీమతికి మనసైన ప్రియసతికి


చిత్రం: చిన్ననాటి స్నేహితులు
రచన: సి నా రె
గానం: బాలు, పి సుశీల

సంగీతం: టి వి రాజు
పల్లవి: అందాల శ్రీమతికి మనసైన ప్రియసతికి
వలపుల కానుకగా ఒక పాపను నేనివ్వనా ...
మబ్బులలో విహరించే మావారీ అనురాగం
వాడని మందారం నా పాపట సింధూరం
మా బాబు నయనాలు లేత జాబిల్లి కిరణాలు
మా బాబు నయనాలు లేత జాబిల్లి కిరణాలు
వీడే ఇంతవాడే అంతవాడై వెలుగుతాడు
వీడే ఇంతవాడే అంతవాడై వెలుగుతాడు
కలలు నిండారగా సిరులు కొండాడగా!!
శౌర్యంలో నేతాజీ సహనంలో గాంధీజీ
శాంతి గుణంలో నెహ్రూజీ
సాహసంలో శాస్త్రీజీ
ఒరవడిగా వడివడిగా నీ నడవడి తీర్చిదిద్దుకుని
సరిహద్దులలో పొంచిన ద్రోహుల తరిమి తరిమి కొట్టాలీ
వీర సైనికుడివై భరతావని పేరును నిలబెట్టాలి!!
 వందేమాతరం వందేమాతరం వందేమాతరం  



అదే నీవంటివి అదే నేవింటిని


చిత్రం : సప్తస్వరాలు (1969)
సంగీతం : టి.వి.రాజు
రచన : డా॥సి.నారాయణరెడ్డి
గానం : ఘంటసాలపి.సుశీల

పల్లవి : అదే నీవంటివి అదే నేవింటిని
గుండె అలలాగ చెలరేగ ఔనంటిని
అదే నీవంటివి అదే నేవింటిని
ఏమి అనలేని బిడియాన ఔనంటిని
అదే నీవంటివి అదే నేవింటిని
చరణం : 1 ఎవ్వరు లేని పువ్వులతోట
ఇద్దరు కోరే ముద్దులమూట
ఎదలో కదలాడె పెదవుల తెరవీడి
చెవిలో ఝుమ్మని రవళించిన ఆ మాట!!అదే!!
చరణం : 2 పున్నమిరేయి పూచిన చోట
కన్నులు చేసే గారడి వేట
చూపులు జతచేసి ఊపిరి శ్రుతిచేసి
తనువే జిల్లన కవ్వించిన ఆ మాట!!అదే!! 
చరణం : 3 నిన్నూ నన్నూ కలిపిన బాట
నీలో నాలో పలికిన పాట
జాబిలి సిగ్గిలగా కౌగిలి దగ్గరగా
మనసే ఝల్లన చిలికించిన ఆ మాట
అదే నీవంటివి అదే నేవింటిని
ఏమి అనలేని బిడియాన ఔనంటిని
అదే నీవంటివి అదే నేవింటిని

అదే అదే అదే నాకు అంతు తెలియకున్నది


చిత్రం: రాముడు భీముడు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గానం: ఘంటసాల, పి సుశీల
రచన: సి నా రె
పల్లవి: అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ
అదే అదే అదే నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లాగుతున్నది
అదే అదే అదే నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లాగుతున్నది
అదే అదే అదే అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ
అహా హ హ అహా హ హ అహా
అదే అదే అదే వింత నేను తెలుసుకున్నది
అదే నీ వయసులోన ఉన్నది
అదే అదే అదే వింత నేను తెలుసుకున్నది
అదే నీ వయసులోన ఉన్నది
 1. నీ నడకలోన రాజహంస అడుగులున్నవి
నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి
అహా హ హ అహా హ హా అహా హ హ
నీ నడకలోన రాజహంస అడుగులున్నవి
నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి
ఏమేమి ఉన్నవి ఇంకేమి ఉన్నవి
ఏమేమి ఉన్నవి ఇంకేమి ఉన్నవి
ఈ వేళ నా పెదవులేల వణుకుతున్నవి
అదే అదే అదే వింత నేను తెలుసుకున్నది
అదే నీ వయసు లోన ఉన్నది
 2. నీ చేయి తాకగానె ఏదొ హాయి రగిలెను
ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను
అహా హ హ అహా హ హా అహా హ హ
నీ చేయి తాకగానె ఏదొ హాయి రగిలెను
ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను
ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను
ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను
ఈ వేళ లేత బుగ్గలెంత కందిపోయెను
అదే అదే అదే నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లాగు చున్నది
అదే అదే అదే వింత నేను తెలుసుకున్నది
అదే నీ వయసు లోన ఉన్నది