Pages

Subscribe:

Thursday 6 July 2017

రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే




పల్లవి: రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
నాలో కదిలే ప్రాణాలే ఒక పాటై నిన్నే చేరాలే
నాలో కదిలే ప్రాణాలే ఒక పాటై నిన్నే చేరాలే
రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
చరణం 1: ఆకాశం అందాలంటూ దూకే కెరటంలా ప్రేమే నాలో
ఆ హోరు నీ పేరు నే పలికే మంత్రంలా నా గుండెలో
దారంతా చలువ పందిళ్ళే వేసి నీ కోసం నీడై ఉన్న
నాలో నేనే లేనే లేను నేను నిన్నే నాలో కొలువుంచాను!!రోజావే!!
చరణం 2:  మెరుపంటి నీ రాకకే మనసే మేఘంలా మారిందిలే
చిరుగాలి తలపే తాకి కదిలి నిలువెల్లా కరిగిందిలే
తొలి చినుకే తాకే నేలల్లె నేనే పులకించా నీ ఊహతో

రానే రావు ఓనమాలు కాని నీలో చదివా ప్రియ వేదాలు!!

నవ మన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఆ ఘనుడు


నవ మన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఆ ఘనుడు
అక్కా ఎవరే అతగాడు
ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీ రాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ఆ ప్రియుడు
చెల్లీ ఎవడే అతగాడు
తుళ్ళే నీ వయసుకు జతగాడు
౧. గోరు వెచ్చని ఊపిరే వేయి వేణువులూదగా
తొలి ముద్దు చిందించెనే
వీణ మీటిన తీరుగా ఒళ్ళు ఝల్లనె హాయిగా
బిగి కౌగిలందించెనే
రతి రాగాలే శృతి చేశాడే
జత తాళాలే జతులాడాడే
తనువంత వింత సంగీతమేదో పలికే
అక్కా ఎవడే అతగాడు
ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీ రాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ఆ ప్రియుడు
చెల్లీ ఎవడే అతగాడు
తుళ్ళే నీ వయసుకు జతగాడు
2. వాడి చూపుల దాడితో వేడి ఆవిరి రేపెనే
నిలువెల్ల తారాడెనే
చాటు మాటున చోటులో ఘాటు కోరికలూపేనే
ఒడి చేరి తల వాల్చేనే
జడ లాగాడే కవ్వించాడే
నడుమొంపుల్లో చిటికేసాడే
అధరాలతోనే శుభలేఖ రాసే మరుడే ...

చెల్లీ ఎవరే అతగాడు
తుళ్ళే నీ వయసుకు జతగాడు
నవ మన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఆ ఘనుడు
అక్కా ఎవడే అతగాడు
ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీ రాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ఆ ప్రియుడు

ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే




చిత్రం : శుభాకాంక్షలు
గానం : చిత్ర
మ్యూజిక్ : కోటి
లిరిక్స్ : శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు
ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే
మాటలు చాలని హాయే ఒక పాతగ మారిన మాయే
కాలమే పూలదారి సాగనీ
గానమే గాలిలాగ తాకనీ
నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికినది
నూవునడచు దారుల్లో పూలు పరచి నిలుచున్నా
అడుగు పడితే గుండెల్లో కొత్త సడిని వింటున్నా
నీలికళ్ళ ముంగిట్లో నన్ను నేను కనుగొన్నా
నిండు గుండె గుమ్మంలో తోరణంగా నేనున్నా
నీవైపే సాగే అడుగే నీతో నడవాలని అడిగే
నీ మాటే పలికే స్వరమే నీతోనే కలిసే వరమే
వేణువంటి నా హృదయంలో ఊపిరిపాటై పాడగా
ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే
మాటలు చాలని హాయే ఒక పాతగ మారిన మాయే
రాగబాల రమ్మంటూ స్వాగతాలు పలికింది
ఆగలేని వేగంలో ఆశ అడుగు వేసింది
జతగా నీవు చేరాకే బ్రతుకు తీపి తెలిసింది
రెప్పచాటు లోకంలో కలల కోన కదిలింది
మనసంతా హాయిని మోసి నీ కోసం ప్రేమను దాచి
రాగాలే రాశులు పోసి ఈ గీతం కానుక చేసి

శుభాకంక్షలే పలకాలి నవ్వుల పువ్వుల మాలతో .. ఆనందమానంద మాయే

Come Come Come Welcome


హ్యాపి హ్యాపి బర్త్ డేలు మళ్లి మళ్లి చేసుకోగ శుభాకాంక్షలందజేయమా



చిత్రం: సుస్వాగతం
రచన: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు 
హ్యాపి హ్యాపి బర్త్ డేలు మళ్లి మళ్లి చేసుకోగ శుభాకాంక్షలందజేయమా .. మిత్రమా
ఆపలేని స్వేచ్ఛ ఉంది .. అందినంత ఛాన్సు ఉంది అందుకోర పుత్ర రత్నమా .. నేస్తమా
జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే
చిలిపి వయసు వరస తమకు తెలియదా
హ్యాపి హ్యాపీ... ఓ... ఓ...
చరణం 1: తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటోంది
పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది
బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది
విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది
ప్రేమకథలు ఎప్పుడైన ఒకటే ట్రెండ్
ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్
అప్టుడేటు ట్రెండు మాది టోటల్ చేంజ్
పాత నీతులింక మాకు నో ఎక్స్ఛేంజ్
ఫ్రెండులాంటి పెద్దవాడి అనుభవాలసారమే
శాసనాలు కావునీకు సలహాలు మాత్రమే...
కలను వదలి ఇలను తెలిసి నడుచుకో !
చరణం 2: నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా
తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా
నేల విడిచి సామైతే టైం వేస్టురా ఈ ధీమా
ముందు వెనుక గమనిస్తే విజయం నీది సుమా
రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా
తాకకుండ ఊరుకుంటె తప్పు కదా
నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా
చూడకుండ చెయ్యి వేస్తే ముప్పు కదా
ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా
లక్ష్యమందకుండ లైఫుకర్థమింక ఉండునా
తెగువ తెలుపు గెలుపు మనకి దొరకగ !


ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం




చిత్రం మంజునాథ 
రచన: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు 
సంగీతం: హంసలేఖ
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం 
ప్రణవ మూలనాదం ప్రథమలోకపాదం 
ప్రణతులే చేయలేని ఈ తరమేల ఈ కరమేల
ఈ పాదం పుణ్యపాదం ధరనేలే ధర్మపాదం

మార్కండేయ రక్షపాదం మహాపాదం ఆ...
భక్తకన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం
ఆత్మలింగ స్వయంపూర్ణ ఆత్మలింగ స్వయంపూర్ణుడే సాక్షాత్కరించినా
చేయూత వీడినా అయ్యో అందని అనాధనైతి మంజునాధా!!ఈపాదం!!
భక్త శిరియాళు నేలిన ప్రేమపాదం ఆ....
బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం
అన్నదాత విశ్వనాథ
అన్నదాత విశ్వనాథుడే  లీలావినోదిగా 
నన్నేలగా దిగిరాగా అయ్యో ఛీ
పొమ్మంటినే పాపినైతినే
ఈ పాదం పుణ్యపాదం ఈపాదం ధర్మపాదం
సకల ప్రాణపాదం సర్వమోక్ష పాదం
తెలుసుకోలేని నా ఈ తెలివేల ఈ తనువేల!!ఈపాదం!! 

గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా






చిత్రం: ప్రియురాలు పిలిచింది 
సంగీతం: ఎ.ఆర్ర. రెహమాన్చ 
న: ఎ.ఎం. రత్నం, శివ గణేష్ 
గానం: శంకర్ మహదేవన్ 
లేదని చెప్పా నిమిషము చాలు
లెదన్న మాటా తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే
ఆదే నేనూ ఋజువే చేయా నూరేళ్ళు చాలవే
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే
ఆదే నేనూ ఋజువే చేయా నూరేళ్ళు చాలవే
లేదని చెప్పా నిమిషము చాలు
వేదన మాటా తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే!!గంధపు!!
హృదయమొక అద్దమనీ నీ రూపు బింబమనీ
తెలిపాను హృదయం నీకు సొంతమనీ...ఈ
బింబాన్ని బంధింపా తాడేది లేదు సఖీ
అద్దాల ఊయల బింబమూగె చెలీ...
నువు తేల్చి చెప్పవే పిల్లా
లేక కాల్చి చంపవే లైలా
నా జీవితం నీ కనుపాపలతో
వెంటాడీ ఇక వేటాడొద్దే
లేదని చెప్పా నిమిషము చాలు
వేదన మాటా తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే!!గంధపు!! 
తెల్లారి పోతున్నా విడిపోని రాత్రేదీ
వాసనలు వీచే నీ కురులె సఖీ...ఈ
లోకాన చీకటైనా వెలుగున్న చోటేదీ
సూరీడు మెచ్చే నీ కనులె చెలీ...
విశ్వ సుందరీమణులె వచ్చీ
నీ పాద పూజ చేస్తారే
నా ప్రియసఖియా ఇక భయమేలా
మనసెరిగీ నా తోడుగ రావే
లేదని చెప్పా నిమిషము చాలు
వేదన మాటా తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
ఏమి చేయమందువే ఏమి చేయమందువే న్యాయమా న్యాయమా

ఏమి చేయమందువే ఏమి చేయమందువే మౌనమా మౌనమా