Pages

Subscribe:

Saturday 16 February 2019

పదములె చాలు రామా


పదములె చాలు రామా !
నీ పద ధూళులే పదివేలు ||| నీ పదములె |||
చరణం 1 :
నీ పద మంటిన పాదుకలు - మ
మ్మదుకొనిఈ జగమేలు
నీ దయ గౌతమి గంగా - రామయ
నీ దాసులు మునుగంగా
నా బ్రతుకొక నావ
దానిని నడిపే తండ్రివి నీవు కావా ||| నీ పదములె |||
చరణం 2 :
కోవెల లోనికి రాలేను
నువు కోరిన కానుక తేలేను
నిను గానక నిమిషము మనలేను
నువు కనబడితే నిను కనలేను ||| నీ పదములె |||

Friday 15 February 2019

నమోహిందు మాతా సుజాత నమో జగన్మాత!

కొప్పవరపు సుబ్బారావు గారి రచన, ఈ అద్భుత సమయములో మళ్ళీ పాడుకుందామా?చిన్నపుడు మా తెలుగు పాఠములో ఉండేది.. సుబ్బారావు గారు సంగీత దర్శకుడు కూడా.. చండిక 1940 వంటి చిత్రాలకు , హెచ్ ఎం వీ వారి రికార్డులకు సంగీతం అందించారు ఆ రోజుల్లో..

నమోహిందు మాతా సుజాత నమో జగన్మాత!
మాతా నమో హిందుమాత సుజాత నమో జగన్మాత!

అమోఘదివ్యా మహిమ సమేతా!
అఖండవర భరతఖండ మాతా!

నమో హిందుమాతా!నమో జగన్మాతా!
నమో హిందుమాతా!నమో జగన్మాతా!

విపుల హిమాదృలే వేణీభరముగ
గంగాయమునలే కంఠ హారముగ
ఘనగోదావరి కఠిసూత్రముగా
కనులకు పండువ ఘటించుమాతా

నమోహిందుమాతా సుజాత నమోజగన్మాత!
నమోహిందుమాతా సుజాత నమోజగన్మాత!

గోలుకొండనీ రత్నకోశమట
కోహినూరు నీజడలో పువ్వట
తాజమహలు నీ దివ్యభవనమట
ఆహాహా నీభాగ్యమే మాతా

నమోహిందుమాతా సుజాత నమోజగన్మాత!
నమోహిందుమాతా సుజాత నమోజగన్మాత!