Pages

Subscribe:

Sunday 10 March 2019

మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా


చిత్రం : ఇంటింటి రామాయణం (1979)
సంగీతం : రాజన్-నాగేంద్ర
రచన : వేటూరి సుందర రామమూర్తి

గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవి
నా తొలి మోజులే నీ విరజాజులై
ముసిముసి నవ్వులలో గుసగుసలాడినవి
నా తొలి మోజులే నీ విరజాజులై
మిసమిస వన్నెలలో మిలమిలమన్నవిలే
నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింత లెంత వింతలె
మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

తొలకరి కోరికలే తొందర చేసినవి ఈ విరి శయ్యకే ఆవిరి తీరగా
తొలకరి కోరికలే తొందర చేసినవి ఈ విరి శయ్యకే ఆవిరి తీరగా
సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే యే తెర చాటునో ఆ చెఱ వీడగా
అందిన పొందులోనె అందలేని విందులీయవె
కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

వీణ వేణువైన సరిగమ విన్నావా


చిత్రం: ఇంటింటి రామాయణం 
సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి 
సంగీతం: రాజన్ నాగేంద్ర 
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి 

వీణ వేణువైన సరిగమ విన్నావా
తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల, చెలరేగాల
చెలి ఉయ్యాలలూగాల ఈ వేళలో

ఊపిరి తగిలిన వేళ నే ఒంపులు తిరిగిన వేళ
నా వీణలో నీ వేణువే పలికే రాగమాల
చూపులు రగిలిన వేళ ఆ చుక్కలు వెలిగిన వేళ
నా తనువునా అణువణువునా జరిగే రాసలీల
||వీణ వేణువైన||
ఎదలో అందం ఎదుట ఎదుటే వలచిన వనిత
నీ రాకతో నా తోటలో వెలసే వనదేవత
కదిలే అందం కవిత అది కౌగిలి కొస్తే యువత
నా పాటలో నీ పల్లవే నవత నవ్య మమత

||వీణ వేణువైన||

మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం


చిత్రం : పంతులమ్మ (1977)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : S.P.బాలు, పి.సుశీల
మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సాగర మధనం అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం
 మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం

యే రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతానా హృదయ పరాగం ఆ.. ఆ
ఆ.. ఆ
యే రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతానా హృదయ పరాగం
ఎదలోయలలో నిదురించిన నా కోరిక పాడే కోయిల గీతం
శతవసంతాల దశ దిషాంతాల సుమ సుగంధాల బ్రహ్మార నాదాల
కుసుమించు నీ అందమే విరిసింది అరవిందమై కురిసింది మకరందమే
 మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం

జాబిలి కన్నా నా చెలి మిన్నా పులకింతలకే పూచిన పొన్నా
కానుకలేమి నేనివ్వగలను కన్నుల కాటుక నేనవ్వగలను
పాల కడలిలా వెన్నెల పొంగింది పూల పడవలా నా తనువూగింది
ఏ మల్లెల తీరాల నిను చెరగలనో
మనసున మమతై కడతేరగలనూ
 మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం

కురిసే దాకా అనుకోలేదు శ్రావణ మేఘమనీ
తడిసే దాకా అనుకోలేదు తీరని దాహమనీ
కలిసే దాకా అనుకోలేదు తీయని స్నేహమనీ
మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సాగర మధనం అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం
 మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం
సంసారం సంగీతం

మామా... చందమామా వినరావా...నా కథ


చిత్రం : సంబరాల రాంబాబు
సంగీతం : వి.కుమార్
రచన : రాజశ్రీ
గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
పల్లవి:

    మామా... చందమామా
    వినరావా...నా కథ
    మామా చందమామా
    వినరావా నా కథ
    వింటే మనసు ఉంటే
    కలిసేవూ నా జత
    మామా...చందమామా

చరణం 1:
    నీ రూపము ఒక దీపము
    గతిలేని పేదకు..."2"

    నీ కళలే సాటిలేని పాఠాలు ప్రేమకు
    నువు లేక నువు రాక
    విడలేవు కలువలు...
    జాబిల్లి నీ హాయి పాపలకు జోలలు....

చరణం 2:
    మింటిపైన నీవు ఓంటిగాడివై
    అందరికీ వెన్నెల పంచ
    రేయంత తిరగాలి

    ఇంటిలోన నేను ఒంటిగాడినై
    అందరికీ సేవలు చేయ
    రేయి పవలు తిరగాలి

    లేరు మనకు బంధువులు
    లేరు తల్లిదండ్రులు
    మనను చూసి అయ్యోపాపం
    అనేవారు ఎవ్వరు
    అనేవారు ఎవ్వరు...

    మామా చందమామా
    వినరావా నా కథ
    వింటే మనసు ఉంటే
    కలిసేవూ నా జత
    మామా... చందమామా



కురిసింది వాన నా గుండెలోన


చిత్రం : బుల్లెమ్మ బుల్లోడు

రచన : రాజశ్రీ.
సంగీత దర్శకత్వం: సత్యం
నేపధ్య గానం : పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 

కురిసింది వాన నా గుండెలోన
నీ చూపులే జల్లుగా(2)
ముసిరే మేఘాలు కొసరు రాగాలు
కురిసింది వాన నా గుండెలోన
నీ చూపులే జల్లుగా
అల్లరి చేసే ఆశలు నాలో
పల్లవి పాడేను
తొలకరి వయసు గడసరి మనసు
నీ జత కోరేను
అల్లరి చేసే ఆశలు నాలో
పల్లవి పాడేను
చలిగాలి వీచే గిలిగింత తోచే(కురిసింది)
ఉరకలు వేసే ఊహలు నాలో
గుసగుసలాడేను
కథలను తెలిపే కాటుక కనులు
కైపులు రేపేను
ఉరకలు వేసే ఊహలు నాలో
గుసగుసలాడేను
బిగువు ఇంకేలా దరికి రావేలా(కురిసింది)



అమ్మ అన్నది ఒక కమ్మని మాట


చిత్రం : బుల్లెమ్మ బుల్లోడు (1972)
రచన : రాజశ్రీ
సంగీతం : సత్యం
గానం : ఎస్.పి.బాలు, బి.వసంత
అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూట
అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతల మూట
చరణం : 1
దేవుడే లేడనే మనిషున్నాడు
అమ్మే లేదనువాడు అసలే లేడు
దేవుడే లేడనే మనిషున్నాడు
అమ్మే లేదనువాడు అసలే లేడు
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
ఆ తల్లి సేవ చేసుకొనే బ్రతుకే బ్రతుకు
అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతల మూట
చరణం : 2
అమ్మంటే అంతులేని సొమ్మురా
అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా
అమ్మ మనసు అమృతమే చిందురా
అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా
అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతల మూట
చరణం : 3
అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే
అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే
అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది
అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది
అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతల మూట