Pages

Subscribe:

Sunday 7 April 2019

అమ్మాయి ముద్దు ఇవ్వందే.. ఈ రేయి తెల్లవారనివ్వనంతే


చిత్రం: క్షణం క్షణం  (1991)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: బాలు, చిత్ర
పల్లవి : అమ్మాయి ముద్దు ఇవ్వందే.. ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయీ నీ ముద్దు చెల్లించితే.. అమ్మమ్మమ్మమ్మో గొడవలే
ముద్దిమ్మంది బుగ్గ
వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గేలేని సిగ్గా
ముద్దిమ్మంటే బుగ్గ
అగ్గల్లే వస్తే ఆపేదెట్ట హద్దూ పద్దు వద్దా
చరణం 1 : మోజు లేదనకు.. ఉందనుకో ఇందరిలో ఎలా మనకు
మోగిపొమ్మనకూ... చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో
చూడదా సహించని వెన్నెల దహించిన కన్నులా
కళ్ళు మూసేసుకో హయిగా!!అమ్మాయి!! 
చరణం 2 : పారిపోను కదా.. అది సరే అసలు కథ అవ్వాలి కదా
యేది ఆ సరదా.. అన్నిటికీ సిద్ధపడే వచ్చాను కదా
అందుకే అటూ ఇటు చూడకు.. సుఖాలను వీడకు
తొందరేముందిలే విందుకు
ముద్దిమ్మంది బుగ్గ
వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గేలేని సిగ్గా
ముద్దిమ్మంటే బుగ్గ
అగ్గల్లే వస్తే ఆపేదెట్ట హద్దూ పద్దు వద్దా!!అమ్మాయి!!

ఆకు చాటు పిందె తడిసే .. కోక మాటు పిల్ల తడిసే


చిత్రం :  వేటగాడు (1979)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల
పల్లవి : ఆకు చాటు పిందె తడిసే .. కోక మాటు పిల్ల తడిసే
ఆకు చాటు పిందె తడిసే .. కోక మాటు పిల్ల తడిసే
ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది
గూడు చాటు గువ్వ తడిసే .. గుండె మాటు గుట్టు తడిసే
గూడు చాటు గువ్వ తడిసే .. గుండె మాటు గుట్టు తడిసే
ఆకాశ గంగొచ్చింది.. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది .. కొంగుల్ని ముడిపెట్టింది 
చరణం 1 : ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటే .. అహ అహ.. అహా అహ
చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే .. అహ అహ .. అహ అహ
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే ..
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే ..
ఓ చినుకు నీ మెడలో నగ లాగ నవుతుంటే
నీ మాట విని మబ్బు మెరిసి ..అహ
జడివానలే కురిసి కురిసి ..
వళ్ళు తడిసి ..వెల్లి విరిసి...
వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి
అహ అహ ఆహ అహ.. అహ ఆహ ..
ఆకు చాటు పిందె తడిసే .. కోక మాటు పిల్ల తడిసే
ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది
చరణం 2 : మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే .. అహ అహ .. అహ అహ
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే .. అహ అహ .. అహా అహ అహ
ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే..
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే
అహ .. నీ పాట విని మెరుపులొచ్చి... అహ
నీ విరుపులే ముడుపు లిచ్చి
చలిని పెంచి .. చెలిమి పంచి
తనలో వెచ్చంగా తడి ఆర్చుకోవాలి
అహ అహ ఆహ అహ.. అహ ఆహ ..
ఆకు చాటు పిందె తడిసే .. కోక మాటు పిల్ల తడిసే
ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది

కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని


చిత్రం :  వసంత కోకిల (1982)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  మైలవరపు గోపి
నేపధ్య గానం :  బాలు
పల్లవి: కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో
చరణం 1 : మోసం తెలియని లోకం మనదీ
తీయగ సాగే రాగం మనదీ
ఎందుకు కలిపాడో..బొమ్మలను నడిపే వాడెవడో
నీకూ నాకూ సరిజోడని..కలలోనైనా విడరాదనీ
కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో
చరణం 2 : కారడవులలో కనిపించావూ
నా మనసేమో కదిలించావూ
గుడిలో పూజారై నా హృదయం నీకై పరిచాను
ఈ అనుబంధం ఏ జన్మదీ..ఉంటే చాలు నీ సన్నిధి
కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో

ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో


చిత్రం :  ప్రేమాభిషేకం (1981)
సంగీతం :         చక్రవర్తి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి: ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ఒక దేవత గుడిలో..  ఒక దేవుని ఒడిలో
నిదురించే అనురాగం...  కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
చరణం 1: మరులు పూచిన పూలపందిరిలో..
మమతలల్లిన ప్రేమ సుందరికీ...
పట్టాభిషేకం... పట్టాభిషేకం
మనసు విరిచినా మనసు మరువనీ
మధుర జీవిత మానవమూర్తికి
మంత్రాభిషేకం... మంత్రాభిషేకం

రాగాల సిగలో.. అనురాగాల గుడిలో ...
భావాలబడిలో.. అనుభవాల ఒడిలో ...
వెలసిన రాగదేవతా... రాగాభిషేకం
వెలసిన ప్రేమవిజేతా... ప్రేమాభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
చరణం 2: కలలచాటున పెళ్ళిపల్లకిలో
కదలివచ్చిన పెళ్ళికూతురికీ..
పుష్పాభిషేకం.. పుష్పాభిషేకం
పాట మారినా ... పల్లవి మార్చనీ
ప్రణయలోకపు ప్రేమమూర్తికి..
స్వర్ణాభిషేకం.. స్వర్ణాభిషేకం
స్వప్నాల నింగిలో.. స్వర్గాల బాటలో...
బంగారు తోటలో.. రతనాల కొమ్మకు...
విరిసిన స్వప్న సుందరీ...  క్షీరాభిషేకం...
కొలిచినప్రేమ పూజారీ.. అమృతాభిషేకం...
 ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ఒక దేవత  గుడిలో... ఒక  దేవుడి ఒడిలో
నిదురించే అనురాగం... కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం

యమహో నీ యమ యమ అందం


చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి
పల్లవి : యమహో నీ యమ యమ అందం
చెలరేగింది ఎగా దిగా తాపం
నమహో నీ ఝమ ఝమ వాటం
సుడి రేగింది ఎడా పెడా తాళం
పోజుల్లో నేను యముడంత వాడ్ని
మోజుల్లో నీకు మొగుడంటి వాడ్ని
అల్లారు ముద్దుల్లో గాయం
విరబూసింది పువ్వంటి ప్రాయం
యమహో నీ యమ యమ అందం
చెలరేగింది ఎగా దిగా తాపం
నమహో నీ ఝమ ఝమ వాటం
సుడి రేగింది ఎడా పెడా తాళం
చరణం 1 : నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జా కట్టి
గుట్టుగా సెంటే కొట్టి వడ్డాణాలే ఒంటికి పెట్టి
తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టీ
పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పారాణెట్టి
చీకటింట దీపమెట్టి చీకుచింత పక్కానెట్టి
నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి
పెట్టూపోతా వద్దే చిట్టెంకి చెయి పట్టిన్నాడే కూసే వల్లంకి
పెట్టేది మూడే ముళ్ళమ్మి నువ్వు పుట్టింది నాకోసమమ్మి
ఇక నీ సొగసు నా వయసు పేనుకొనే ప్రేమలలో
యమహో నీ యమ యమ అందం
చెలరేగింది ఎగా దిగా తాపం
చరణం 2 : పట్టె మంచమేసిపెట్టి పాలు పెట్టి పండు పెట్టి
పక్క మీద పూలు కొట్టి పక్కా పక్కాలొళ్ళో పెట్టి
ఆకులో వక్క పెట్టి సున్నాలెట్టి చిలకా చుట్టి
ముద్దుగా నోట్లో పెట్టి పరువాలన్ని పండాపెట్టి
చీర గుట్టు సారే పెట్టి సిగ్గులన్ని ఆరాబెట్టి
కళ్ళలోన వత్తులెట్టి కౌగిలింత మాటు పెట్టి
ఒట్టే పెట్టి వచ్చేసాక మామా నిను ఒళ్ళో పెట్టి లాలించేదే ప్రేమా
పెట్టెయ్యి సందె సీకట్లోనా నను చుట్టెయ్యి కౌగిలింతల్లోనా
ఇక ఆ గొడవ ఈ చొరవ ఆగవులే అలజడిలో
యమహో నీ యమ యమ అందం
చెలరేగింది ఎగా దిగా తాపం
నమహో నీ ఝమ ఝమ వాటం
సుడి రేగింది ఎడా పెడా తాళం

నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి



చిత్రం: కార్తీక దీపం (1979)
సంగీతం: సత్యం
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం: బాలు, జానకి
పల్లవి: నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ
నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ
నీ కౌగిలిలో తల దాచి...
చరణం 1: చల్లగ కాసే పాల వెన్నెల నా మనసేదో వివరించు
అల్లరి చేసే ఓ చిరుగాలి నా కోరికలే వినిపించు
నా కోవెలలో స్వామివి నీవై వలపే దివ్వెగ వెలిగించు
నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ
నీ కౌగిలిలో తల దాచి...
చరణం 2: నింగి సాక్షి.. నేల సాక్షి.. నిను వలచిన నా మనసే సాక్షి
మనసులోన మనుగడలోన నాలో నీవే సగపాలు
వేడుకలోను.. వేదనలోను... పాలు తేనెగ ఉందాము
నీ కౌగిలిలో తల దాచి... నీ చేతులలో కను మూసి
జన్మ జన్మకు జతగా మసలే... వరమే నన్ను పొందనీ
నీ కౌగిలిలో తల దాచి...

అందమా అందుమా అందనంటే అందమా


చిత్రం: గోవిందా గోవిందా (1993)
సంగీతం: రాజ్-కోటి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: బాలు, చిత్ర
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమ్మ చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ
అందమా అందుమా అందనంటే అందమా
చరణం 1 : ఆకలుండదే దాహముండదే .. ఆకతాయి కోరిక కొరుక్కుతింటదే
ఆగనంటది దాగనంటది ఆకుచాటు వేడుక కిరుక్కుమంటది
వెన్నపూలు విన్నపాలు విన్నానమ్మి ..
చిటికనేలు యిచ్చి ఏలుకుంటానమ్మి
రాసి పెట్టి ఉందిగనక నిన్నే నమ్మి..
ఊసులన్ని పూసగుచ్చి ఇస్తాసుమ్మి
ఆలనా పాలనా చూడగా చేరనా చెంత...!!అందమా!!
చరణం 2 : వేయి చెప్పినా లక్ష చెప్పినా లక్ష్య పెట్టదే ఎలా ఇదేమి విలవిలా
తియ్య తియ్యగా నచ్చ చెప్పని ..చిచ్చు కోట్టన్ని ఇలా ..వయ్యారి వెన్నెల
నిలవనీదు నిదరపోదు నారాయణ..
వగల మారి వయసు పోరు నా వల్లన
చిలిపి ఆశ చిటికలోన తీర్చేయ్యనా
మంత్రమేసి మంచి చేసి లాలించనా..
ఆదుకో నాయనా... ఆర్చవా... తీర్చవా.. చింత
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ


రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరిక


చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: సినారె

నేపధ్య గానం: బాలు, సుశీల
రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరిక
దిక్కుల తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుక
వయసు దారి తీసింది...వలపు ఉరకలేసింది
మనసు వెంబడించింది నిమిషమాగక
మనసే వెంబడించింది నిమిషమాగక
రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరిక
చెంతగ చేరితే ..వింతగా ఉండదా
మెత్తగా తాకితే ..కొత్తగా ఉండదా
నిన్న కలగా ఉన్నదీ...నేడు నిజమవుతున్నది.
అనుకున్నది అనుభవమైతే అంతకన్న ఏమున్నది..
వయసు దారి తీసింది...వలపు ఉరకలేసింది
మనసు వెంబడించింది నిమిషమాగక
మనసే వెంబడించింది నిమిషమాగక
రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరిక
కళ్ళతో నవ్వకు...జల్లుమంటున్నది
గుండెలో చూడకు.. గుబులుగా ఉన్నది
తొలిచూపున దాచింది..మలిచూపున తెలిసింది..
ఆ చూపుల అల్లికలోనే పెళ్ళిపిలుపు దాగున్నది
వయసు దారి తీసింది...వలపు ఉరకలేసింది
మనసు వెంబడించింది నిమిషమాగక
మనసే వెంబడించింది నిమిషమాగక
రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరిక

సిరిమల్లె పూవా సిరిమల్లె పూవా


చిత్రం:  పదహారేళ్ళ వయసు (1978)
సంగీతం:  చక్రవర్తి
గీతరచయిత:  వేటూరి
నేపధ్య గానం:  జానకి
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా.......
చరణం 1: తెల్లరబోతుంటే నా కల్లోకి వస్తాడే
కళ్ళారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు,నా ఈడు జోడు ఏడే
ఈ సందెకాడా నా సందమామ రాడే
చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో
చరణం 2: కొండల్లో కోనల్లో కూయన్న ఓ కొయిలా
ఈ పూల వానల్లో ఝుమ్మన్న ఓ తుమ్మెదా
వయసంతా వలపై మనసే మైమరుపై ఊగేనే
పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే
చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో

Tuesday 2 April 2019

ఇది మల్లెల వేళయనీ.. ఇది వెన్నెల మాసమనీ


చిత్రం :  సుఖదుఃఖాలు (1968)
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం :  సుశీల
పల్లవి :
ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
ఇది మల్లెల వేళయనీ.. ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల.. ముందే కూసిందీ విందులు చేసింది
చరణం 1 :
కసిరే ఏండలు కాల్చునని.. ముసిరే వానలు ముంచునని
ఇక కసిరే ఏండలు కాల్చునని.. మరి ముసిరే వానలు ముంచునని
ఎరుగని కొయిల ఎగిరింది..
ఎరుగని కొయిల ఎగిరింది.. చిరిగిన రెక్కల వొరిగింది నేలకు వొరిగింది
ఇది మల్లెల వేళయనీ.. ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల.. ముందే కూసిందీ విందులు చేసింది
చరణం 2 :
మరిగి పోయేది మానవ హృదయం.. కరుణ కరిగేది చల్లని దైవం
మరిగి పోయేది మానవ హృదయం.. కరుణ కరిగేది చల్లని దైవం
వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంతమాసం.. వసి వాడని కుసుమ విలాసం
 ఇది మల్లెల వేళయనీ.. ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల.. ముందే కూసిందీ విందులు చేసింది
చరణం 3 :
ద్వారానికి తారా మణిహారం.. హారతి వెన్నెల కర్పూరం
ద్వారానికి తారా మణిహారం.. హారతి వెన్నెల కర్పూరం
మోసం ద్వేషం లేని సీమలో..
మోసం ద్వేషం లేని సీమలో.. మొగసాల నిలిచెనీ మందారం
ఇది మల్లెల వేళయనీ.. ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల.. ముందే కూసిందీ విందులు చేసింది

చేతిలో చెయ్యేసి చెప్పు బావ


చిత్రం: దసరా బుల్లోడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చేసుకొన్న బాసలు చెరిగిపోవని మరచిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చేసుకొన్న బాసలు చెరిగిపోవని మరచిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధ
చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధ
చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చరణం 1:
పాడుకున్న పాటలు పాతబడి పోవని
చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపురానివ్వనని
పాడుకున్న పాటలు పాతబడి పోవని
చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపురానివ్వనని

పడుచు గుండె బిగువులు సడలిపోనివ్వనని
దుడుకుగ ఉరికిన పరువానికి ఉడుకు తగ్గిపోదని
చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధ
చరణం 2:
కన్నెగా కన్న కలలు కధలుగా చెప్పాలి
మన కధ కలకాలం చెప్పినా కంచికెళ్ళకుండాలి
కన్నెగా కన్న కలలు కధలుగా చెప్పాలి
మన కధ కలకాలం చెప్పినా కంచి కెళ్ళకుండాలి
మన జంట జంటలకే కన్నుకుట్టు కావాలి
ఇంక ఒంటరిగా ఉన్నవాళ్ళు జంటలై పోవాలి
చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చేసుకొన్న బాసలు చెరిగిపోవని మరచిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధ
చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు బావ