Pages

Subscribe:

Sunday 5 May 2019

పిలువకురా అలుగకురా... నలుగురిలో నను ఓ రాజా


చిత్రం :  సువర్ణ సుందరి (1957)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  సుశీల
పల్లవి : ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
పిలువకురా అలుగకురా...
నలుగురిలో నను ఓ రాజా..
పలుచన సలుపకురా..
పిలువకురా అలుగకురా....
నలుగురిలో నను ఓ రాజా.. ఆ..
పలుచన సలుపకురా..
పిలువకురా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
చరణం 1 : మనసున తాళి మరువనులేర...
గళమున మోడి సలుపకు రాజా....
సమయము కాదురా నిన్ను దరిచేర..
సమయము కాదురా నిన్ను దరిచేర...
కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా...
పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ
చరణం 2 : ఏలినవారి కొలువుర సామీ...
మది నీ రూపే మెదలినగాని..
ఓయన లేనురా కదలగలేర..
ఓయన లేనురా కదలగలేర..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా....
పిలువకురా ఆ ఆ ఆ ఆ ఆ

నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది..


చిత్రం: అంతస్తులు (1965)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
పల్లవి: నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది..ఇంత ఇది..ఇంత ఇది..
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది...
నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది..
నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది..ఇంత ఇది..ఇంత ఇది...
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది...
చరణం 1: తొలినాడు ఏదోల మొదలైనది..ఈ..ఆ రేయి నిదురంతా కలలయినది
తొలినాడు ఏదోల మొదలైనది..ఈ..ఆ రేయి నిదురంతా కలలయినది
మరునాడు మనసంత తానయినది ...ఆ ఇది ఏదో ఇద్దరికి తెలియకున్నది
మరునాడు మనసంత తానయినది ...ఆ ఇది ఏదో ఇద్దరికి తెలియకున్నది
నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది..
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది...
చరణం 2: వయసులో పాకానికి వచ్చినది... తనువులో అణూణువున పొంగినది..
వయసులో పాకానికి వచ్చినది... తనువులో అణూణువున పొంగినది..
 నీకిచ్చేవరకు నిలువలేనన్నది ...ఉరికిఉరికి నీ ఒడిలో ఒదిగినది
నీకిచ్చేవరకు నిలువలేనన్నది ...ఉరికిఉరికి నీ ఒడిలో ఒదిగినది
నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది..ఇంత ఇది..ఇంత ఇది
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది...

నీలికన్నుల నీడలలోనా...దోరవలపుల దారులలోనా


చిత్రం: గుడిగంటలు (1965)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
పల్లవి: అ....ఆ..ఆ..ఆ..ఓ..ఓ..
నీలికన్నుల నీడలలోనా...దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమాయే... అందుకో...నన్నందుకో
అందుకో నన్నందుకో
నీలికన్నుల నీడలలోనా... దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమేదో... ఉందిలే... ముందుందిలే
ఉందిలే ముందుందిలే...
చరణం 1: మబ్బుల పందిరి మనపై నిలిచే...ఎందుకు నిలిచే
పచ్చిక పానుపు వెచ్చగ పిలిచే...ఏమని పిలిచే
వీడని జంటగ రమ్మనీ ...వసి వాడని పూలై పొమ్మనీ
నీలికన్నుల నీడలలోనా... దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమేదో... ఉందిలే... ముందుందిలే
ఉందిలే ముందుందిలే...
చరణం 2: తెలియరానిది ఈ గిలిగింత...ఏ గిలిగింత..
పలుకలేనిది ఈ పులకింత...ఏ పులకింత ...
కనుపించనిదా వింతా...అది కదలాడును మనసంతా
నీలికన్నుల నీడలలోనా...దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమాయే... అందుకో...నన్నందుకో
అందుకో నన్నందుకో
చరణం 3: చల్లగ తాకే జ్వాలలు ఏవో ...ఏమో ఏవో...
అవేడిగ సోకే వెన్నెలలు ఏవో ...ఏమో ఏవో...
చిన్నది విరిసే చూపులు ...చెలి చిలికిన ముసి ముసి నవ్వులు
నీలికన్నుల నీడలలోనా...దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమాయే... అందుకో...నన్నందుకో
అందుకో నన్నందుకో

మబ్బులో ఏముంది


చిత్రం :  లక్షాధికారి (1963)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల,  సుశీల
పల్లవి : మబ్బులో ఏముంది...
నా మనసులో ఏముంది.. నా మనసులో ఏముంది?
మబ్బులో కన్నీరు..
నీ మనసులో పన్నిరు.. నీ మనసులో పన్నీరు..
అవునా..ఉహు..ఊ..ఊ....
చరణం 1: తోటలో ఏముంది.. నా మాట లో ఏముంది? నా మాటలో ఏముంది?
తోటలో మల్లియలు.. నీ మాటలో తేనియలు.. నీ మాటలో తేనియలు ..
ఉహు..ఊ..ఊ..ఊ..
ఊహు..ఊ..ఊ..ఊ..
చరణం 2 : చేనులో ఏముంది?.. నా మేనులో ఏముంది?.. నా మేనులో ఏముంది?
చేనులో బంగారం.. నీ మేనులో సింగారం... నీ మేనులో సింగారం
ఏటిలో ఏముంది?.. నా పాటలో ఏముంది?... నా పాటలో ఏముంది?
ఏటిలో గలగలలు.. నీ పాటలో సరిగమలు... నీ పాటలో సరిగమలు
నేనులో ఏముందీ?.. నీవులో ఏముంది?... నీవులో ఏముంది?
నేనులో నీవుంది... నీవులో నేనుంది... నీవులో నేనుంది
నేనులో నీవుంది నీవులో నేనుంది
నీవులో నేనుంది నేనులో నీవుంది...
అహ..ఆ..అహ..ఆ..
అహ..ఆ..అహ..ఆ..