Pages

Subscribe:

Saturday 31 August 2013

యువతకు ఘంటసాల వారి సందేశం

ఆ తోటలోనొకటి -సాలూరు రాజేశ్వర రావు

నల్లని వాడా నే గొల్ల పిల్లనోయ్ - వింజమూరి శివ రామారావు గారి పాట

మా తెలుగు తల్లికి - టంగుటూరి సూర్య కుమారి

రావోయి బంగారి మామా - శ్రీ కొనకళ్ళ వెంకట రత్నం గారి పాట - ఘంటసాల గారి నోట

పాట పాడుమా కృష్ణా - సాలూరి రాజేశ్వర రావు

Monday 26 August 2013

మనసున మనసై

1. రచన: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు

ప. మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము


1. ఆశలు తీరని ఆవేశములో...ఆశయాలలో....ఆవేదనలో...
చీకటి మూసిన ఏకాంతములో.....
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము


2. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు....నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము


3. చెలిమియె కరువై.. వలపే అరుదై
చెదిరిన హృదయమే శిలయై పోగా...
నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే...
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము.

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

2. నీవు లేక వీణా..

రచన: ఆచార్య ఆత్రేయ
గానం: సాలూరి రాజేశ్వర రావు
సంగీతం: పి. సుశీల

నీవు లేక వీణ పలుకలేనన్నది
నీవు రాక రాధ నిలువ లేనన్నది... ఆ...
నీవు లేక వీణ...

1. జాజి పూలు నీకై రోజు రోజు పూచే
చూసి చూసి పాపం సొమ్మసిల్లి పోయే
చందమామ నీకై తొంగి తొంగి చూచి
చందమామ నీకై తొంగి తొంగి చూచి
సరసను లేవని అలుకలు బోయే
నీవు లేక వీణ...

2. కలలనైన నిన్ను కనుల చూతమన్నా
నిదుర రాని నాకు కలలు కూడ రావే
కదల లేని కాలం విరహ గీతి రీతి
కదల లేని కాలం విరహ గీతి రీతి
పరువము వృథగా బరువుగ సాగే
నీవు లేక వీణ..

3. తలుపులన్ని నీకై తెరచి వుంచినాను
తలపులెన్నో మదిలో దాచి వేచినాను
తాపమింక నేను ఓపలేను స్వామి
తాపమింక నేను ఓపలేను స్వామి
తరుణిని కరుణను ఏలగ రావా
నీవు లేక వీణ పలుకలేనన్నది
నీవు రాక రాధ నిలువ లేనన్నది... ఆ...
నీవు లేక వీణ...

3. పాడమని నన్నడగవలెనా..

రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : పి.సుశీల

పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా
నేనే పరవశించి పాడనా
పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా

1. నీవు పెంచిన హృదయమే
ఇది నీవు నేర్పిన గానమే... ఆ...
నీవు పెంచిన హృదయమే
ఇది నీవు నేర్పిన గానమే... ఆ...
నీకుగాక ఎవరికొరకు
నీవు వింటే చాలు నాకు
పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా

2. చిన్ననాటి ఆశలే ఈనాడు పూచెను పువ్వులై...
చిన్ననాటి ఆశలే ఈనాడు పూచెను పువ్వులై...
ఆ పూవులన్నీ మాటలై వినిపించు నీకు పాటలై...
పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా
నేనే పరవశించి పాడనా

3. ఈ వీణ మ్రోగ క ఆగినా
నే పాడజాలకపోయినా... ఆ...
ఈ వీణ మ్రోగ క ఆగినా
నే పాడజాలకపోయినా... ఆ...
నీ మనసులో ఈనాడు నిండిన
రాగమటులే ఉండనీ అనురాగమటులే ఉండనీ
పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా... నేనే...

4. ఎవరో జ్వాలను రగిలించారు..
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
రచన : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల

ఎవరో జ్వాలను రగిలించారు
వేరెవరో దానికి బలియైనారు
వేరెవరో దానికి బలియైనారు
ఎవరో జ్వాలను రగిలించారు
వేరెవరో దానికి బలియైనారు

1. అడుగు అడుగున అపజయములతో
అలసి సొలసిన నా హృదయానికి
సుధవై... సుధవై జీవన సుధవై
ఉపశాంతి నివ్వగా ఓర్వనివారలు
ఎవరో జ్వాలను రగిలించారు
వేరెవరో దానికి బలియైనారు

2. అనురాగానికి ప్రతిరూపాలై
ఆది దంపతులవలె మీరుంటే
అనురాగానికి ప్రతిరూపాలై
ఆది దంపతులవలె మీరుంటే
ఆనందంతో మురిసానే... ఆత్మీయులుగా తలచానే
అందుకు ఫలితం అపనిందేనా
ఎవరో జ్వాలను రగిలించారు
వేరెవరో దానికి బలియైనారు

3. మనిషికి మనిషికి మమత కూడదా...
మనసు తెలుసుకొను మనసే లేదా
ఇది తీరని శాపం... ఇది మారని లోకం
మానవుడే దానవుడై మసలే చీకటి నరకం
ఎవరో జ్వాలను రగిలించారు
వేరెవరో దానికి బలియైనారు
వేరెవరో దానికి బలియైనారు

5. ఒంటిగ సమయం చిక్కింది..

ఒంటిగ సమయం చిక్కింది
కంటికి నిద్దుర రాకుంది(2)
మనకు మనకు ఇనప గోడవలె
తడిక అడ్డమై కూర్చుంది
ఒంటిగ సమయం చిక్కిందా
కంటికి నిద్దుర రాకుందా
మనకు మనకు మనసులు కలిసిన
తడిక అడ్డమై కూర్చుందా

1. ఇంటింటా ఒక ముసలి ఘటం(2)
ప్రేమికులకు అది పెను భూతం
కదిలితే భయం మెదిలితే భయం
ఎన్నాళ్లో ఈ ఇరకాటం(2)

2. పెద్ద తలోక్కటి ఉంటేనే
హద్దు పద్దులో ఉంటావు
ప్రేమ ముదిరితే పిచ్చి రేగితే
పార్కులో మళ్ళి సరిగమలే...

3. ఎటుల భరింతును ఈ విరహం
ఒట్టి చూపులతో ఏమి ఫలం
అమ్మ వచ్చినా అరిచి చచ్చినా
విడువలేను ఈ అవకాశం(2)

4. గుట్టుగా సాగే సరసాన్ని
రట్టు చేయకోయ్ నా సామి...
తడిక దాటినా దుడుకు చేసినా
తప్పదు మనకి తదిగిణతోం
అమ్మ చేతిలో తదిగిణతోం


సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
రచన :
గానం : ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్

6. పాడమని నన్నడగ తగునా..
పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా
కృష్ణా..పదుగురెదుటా పాడనా
పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా

1. పొదల మాటున పొంచి పొంచి
ఎదను దోచిన వేణుగానము
 పొదల మాటున పొంచి పొంచి
ఎదను దోచిన వేణుగానము
ఒలకబోసిన రాగసుధకూ
మొలకలెత్తిన లలిత గీతి !!

2. చిలిపి అల్లరి తెలిసినంతగ
వలపు తెలియని గోపకాంతలు
చిలిపి అల్లరి తెలిసినంతగ
వలపు తెలియని గోపకాంతలు
మెచ్చలేరే వెచ్చని హృదయాల పొంగిన మధురగీతి!!

3. ఎవరూలేని యమునాతటినీ ఎక్కడో ఏకాంతమందున
 ఎవరూలేని యమునాతటినీ ఎక్కడో ఏకాంతమందున
నేను నీవై నీవు నేనై
నేను నీవై నీవు నేనై
పరవశించే ప్రణయగీతి!!

రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : పి.సుశీల

7. ఈమౌనం ఈ బిడియం..
పల్లవి : ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేలే ఇదేలే మగువ కానుక... ఈ మౌనం...

1. ఇన్నినాళ్ళ మన వలపులు
వికసించుట ఇందుకా (2)
మమతలన్ని తమకు తామె (2)
అల్లుకొనెడి మాలిక... ఆ... ఆ...॥మౌనం॥

2. మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
అహ... ఓహొ... ఆ....
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
కనులు కలిసి అనువదించు
ప్రణయ భావగీతిక॥మౌనం॥

3. ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక
ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక
ఎంత ఎంత ఎడమైతే... (2)
అంత తీపి కలయిక... ఆ...॥మౌనం॥

రచన : ఆరుద్ర
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, పి.సుశీల

8. నిజం చెప్పవే పిల్లా..
నిజం చెప్పవే పిల్లా ఎలాగుంది ఈ వేళ
నీకెలాగుంది ఈ వేళ
ఏది చూసినా ఏమి చేసినా ఏదోగా ఉంది
ఏమి చెప్పనే పిల్లా భలేగుంది ఈ వేళ
అహ భలేగుంది ఈ వేళ...

1. చిలిపి వయసు కవ్వించే మనసు చిలికి మురిపించే (2)
నీ కన్నుల వాలులో సరదాలు పొంగే జోరులో
సంబరాలతో సరాగాలతో సాగిపోదమా..

2. నాలో వెలిగే దీపం నీ చిరునవ్వు చిందే రూపం(2)
నీ కాంతిలో ఈ లోకమే స్వర్గము
నాలో వెలిగే దీపం...

3. నిన్న లేని పులకింత కన్నెపిల్లకో వింత(2)
పాలబుగ్గలు మీటితే తొలి ప్రేమ మొగ్గలు వేసెనే(2)
ఏల సిగ్గులే ఏమి నిగ్గులే మాకు తెలుసులేవే...

4. రాగం భావం నీవే నా అనురాగ గీతం నీవే(2)
నీ ప్రేమలో నే లీనమై జీవించుటే స్వర్గము
రాగం భావం నీవే

సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
రచన :
గానం : పి.సుశీల, బి.వసంత

9. ఓ ఉంగరాల ముంగురుల రాజా..
ఓ ఉంగరాల ముంగురుల రాజా నీ హంగు చూసి మోసపోను లేరా
నీ హంగు చూసి పొంగి పోను లేరా
ఓ ఉంగరాల ముంగురుల రాజా నీ హంగు చూసి మోసపోను లేరా
నీ హంగు చూసి పొంగి పోను లేరా
నా సామిరంగ దండమోయీ హొయ్ నా జోలికింక రాకోయీ
హాయ్ హాయ్ ఓ సిన్నోడ ఓ సిన్నోడ ఓ సిన్నోడా..

హొయ్ బొంగరాల బుగ్గలున్న దానా
నీ కొంగు తగిలి పొంగిపోతి జాణా
హొయ్ బొంగరాల బుగ్గలున్న దానా
నీ కొంగు తగిలి పొంగిపోతి జాణా హొయ్ హొయ్
నీవ ఖస్సుమంటే తాళలేనే హొయ్ నీ పొందు కోరి వచ్చినానే
హాయ్ హాయ్ ఓ చెలియ ఓ చెలియ ఓ చెలియా..

1. నీకైపు కళ్ళతో నీ కొంటె నవ్వుతోగారడి చేశావూ
భలే భలే నీ తీపి మాటలూ నీళ్ళల్లో మూటలూ నిన్నింక నమ్మనోయీ
నా సిలకా హొయ్ హొయ్ నీ అలకాహొయ్ హొయ్ తెచ్చిందిలే అందం
నా కళ్ళు చూడవే ఈ బొమ్మ ఆడవే మనసంత నీవేలే ఏ
పోపోవోయ్ఓయ్పిల్లోయ్కిల్లాడిచాలులే

2. ముచ్చట్లు గాలితో మురిపాలు పూలతో..నటనలు నాతోనా
సరసాల సుక్కతో సరదాలు మబ్బుతో..సయ్యాట నాతోనా
ఇటు సూడవే హొయ్ హొయ్ నీతోడులే హాయ్ హాయ్
దాసుడు నీవాడే ఏనీవుంటేపక్కనామనసెంతోచల్లనానారాణినీవేలే
ఓ రాజా నా రోజా ఈ రోజు హేహాయ్ హాయ్

సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
రచన : దాశరధి
గానం : మాధవపెద్ది,  పి.సుశీల బృందం











వాతాపి గణపతి౦ భజే

వాతాపి గణపతిం భజే


చిత్రం: వినాయక చవితి
గానం: ఘంటసాల
రచన:శ్రీ ముత్తుస్వామి దీక్షితార్


వాతాపి గణపతిం భజే హం
వాతాపి గణపతిం భజే హం
వాతాపి గణపతిం భజే హం
వారణాస్యం వరప్రదం శ్రీ
వారణాస్యం వరప్రదం శ్రీ !!వాతాపి!!

భూతాది సంసేవిత చరణం
భూత భౌతికా ప్రపంచ భరణం
వీత రాగిణం వినుత యోగినం
విశ్వకారణం విఘ్నవారణం !!వాతాపి!!

పురా కుంభ సంభవ మునివరా
ప్రపూజితం త్రిభువన మధ్యగతం
మురారీ ప్రముఖాద్యుపా స్థితం
మూలాధారా క్షేత్రార్జితం
పరాది చత్వారి వాగాత్మజం
ప్రణవ స్వరూప వక్రతుండం
నిరంతరం నిఖిల చంద్రఖండం
నిజ వామకర విదృతేక్షు దండం
కరాంబుజ పాశ బీజా పూరం
కలుషవిదూరం భూతాకారం
హరాది గురుగుహ తోషిత బింబం
హంసధ్వని భూషిత హేరంబం !!వాతాపి!!