Pages

Subscribe:

Sunday 26 January 2014

భారతదేశం మన జన్మప్రదేశం

భారత దేశం మన జన్మ ప్రదేశం
భారత ఖండం ఒక అమృత భాండం
నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం
రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం

౧. ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం
దక్షిణాన నెలకొన్నది హిందు సముద్రం
తూరుపు దిశ పొంగిపొరలె గంగా సంద్రం
పశ్చిమాన అనంతమై సింధు సముద్రం

౨. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం
రత్న గర్భ పేరుగన్న భారత దేశం
ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం
సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం

౩. కోకిలమ్మ పాడగలదు జాతీయగీతం
కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం
గుండె గుండె కలుసుకొనుటె సమరస భావం
చేయి చేయి కలిపితేనె ప్రగతుల తీరం

భారతి నా కన్నతల్లి

        
భారతి నా కన్నతల్లి భాగ్యోదయ కల్పవల్లి 
విశ్వ శాంతి విరియించిన చిరుపువ్వుల శిరసు మల్లి || భారతి || 

వార్ధిత్రయ భవ్య వసన వింధ్యాచల విశద రచన 
కాశ్మీరపు రోశ్మి వదన నిర్మల గుణ నిఖిల సదన || భారతి || 

సన్నుత హిమశిఖరము వలె ఉన్నత మస్తక శోభిని 
పావన గంగా నది వలె జీవన గీతాదాయిని || భారతి || 

భారతి బంగరు ముంగిట భగవంతుడె పారాడెను 
ఋషి సంతతి గొంతు విప్పి ఋక్కులు చక్కగ పాడెను || భారతి ||

క్షమతా కేతనమెత్తెను సమతా శంఖమునొత్తెను
వితరణ గుణ గౌరవమున విశ్వమునే ముంచెత్తెను!!భారతి!!



Thursday 23 January 2014

తపము ఫలించిన శుభవేళా

   
చిత్రం: శ్రీకృష్ణార్జున యుద్ధం
గానం: ఘంటసాల, సుశీల
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
రచన: పింగళి నాగేంద్రరావు


ప. తపము ఫలించిన శుభవేళా బెదరగనేలా ప్రియురాలా||2||
ఎదుట నిలువుమని మంత్రము వేసి చెదరగనేల జవరాలా

౧.  తెలిమబ్బులలో జాబిలి వలెనే మేలిముసుగులో దాగెదవేల||2||
వలచి వరించి మనసు హరించి నను చికురించగనేలా!!తపము!!

౨.  చూపులతోనే పలుకరించుతూ చాటున వలపులు చిలకరించుతూ||2||
కోరిక తీరే తరుణము రాగా తీరా ఇపుడీ జాగేలా

Tuesday 21 January 2014

నీవు రావు నిదుర రాదు

    
చిత్రం  : పూల రంగడు (1967)
సంగీతం  :  ఎస్. రాజేశ్వరరావు
రచన  :  దాశరథి
గానం  : పి. సుశీల


నీవు రావు నిదురరాదు... నిలిచిపోయే ఈ రేయి
నీవు రావు నిదురరాదు...

౧. తారా జాబిలి ఒకటై... సరసమాడే ఆ రేయి ..ఈ ఈ .....
ఆ ఆ ఆ ఆ.....
తారా జాబిలి ఒకటై... సరసమాడే ఆ రేయి...
చింతా  చీకటి ఒకటై...చిన్నబోయే ఈ రేయి

౨. ఆశలు మదిలో విరిసే... దోసిట విరులై కురిసే
ఆలయాన చేరి చూడ..ఆలయాన చేరి చూడ...
స్వామికానరాడాయే..నా స్వామికానరాడాయె...

కౌగిలిలో ఒదిగిపోయే... కలలుగనే వేళాయే
కౌగిలిలో ఒదిగిపోయే... కలలుగనే వేళాయే
ఎదురుచూసి ఎదురుచూసి...
ఎదురుచూసి ఎదురుచూసి... కన్నుదోయి అలసిపోయె

చిగురులు వేసిన కలలన్ని..

  
చిత్రం  : పూల రంగడు
సంగీతం  :  ఎస్. రాజేశ్వరరావు
రచన  :  దాశరథి
గానం  : కె. బి. మోహన్ రాజు, పి. సుశీల

ప. చిగురులు వేసిన కలలన్ని..
సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్నీ..
మమతల తీరం చేరినవి.. మమతల తీరంచేరినవి..
ఆ.ఆ.ఓ...ఓ...ఓ

1. సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నానూ..ఊ..
సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నాను
నిండు మనసు పందిరి కాగా ...
నిన్ను అందుకున్నాను.. నిన్నే అందుకున్నాను...

2. దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
నా తనువు అణువణువు..
నీదే నీదే ఈనాడు.. నీదే నీదే ఏనాడు...

3. నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే..ఏ..
నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే
పరిమళాల తరగలలోనే..ఏ...ఆ ఆ ఆ...
పరిమళాల తరగలలోనే...
కరిగించిన చెలియవు నీవే.. కరగించిన చెలియవు నీవే

టాటా వీడుకోలు

   
చిత్రం : బుద్ధిమంతుడు (1969)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : ఆరుద్ర
గానం : ఘంటసాల

టాటా వీడుకోలు… గుడ్ బై ఇంకా సెలవు
తొలినాటి స్నేహితులారా… చెలరేగే కోరికలారా…
టాటా వీడుకోలు… గుడ్ బై ఇంకా సెలవు…
టాటా వీడుకోలు…


ప్రియురాలి వలపులకన్నా నునువెచ్ననిదేది లేదని… 
నిన్ననే నాకు తెలిసింది… ఒక చిన్నది నాకు తెలిపింది…
ఆ… ప్రేమ నగరుకే పోతాను… పోతాను… పోతాను…
ఈ… కామ నగరుకు రాను… ఇక రాను…

టాటా వీడుకోలు గుడ్ బై ఇంకా సెలవు
టాటా వీడుకోలు…

ఇచ్చుటలో ఉన్న హాయీ వేరెచ్ఛటను లేనే లేదనీ…
లేటుగా తెలుసుకున్నాను… నా లోటును దిద్దుకున్నాను
ఆ స్నేహ నగరుకే పోతాను… పోతాను… పోతాను…
ఈ మోహా నగరుకు రాను… ఇక రాను…

టాటా వీడుకూలు గుడ్ బై ఇంకా సెలవు
టాటా వీడుకోలు…

మధుపాత్ర కెదలొ ఇంక ఏమాత్రం చోటు లేదనీ… -
మనసైన పిల్లె చెప్పింది… -
నా మనసంతా తానై నిండింది
నే… రాగ నగరుకే పోతాను…
అనురాగ నగరుకే పోతాను… పోతాను…

ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులు

      
చిత్రం: మూగమనసులు
గానం: ఘంటసాల
రచన: ఆచార్య ఆత్రేయ
సంగీతం: కె వి మహదేవన్

ప|| ముద్దబంతి పూవులో మూగ కళ్ళ ఊసులు
ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే || ముద్దబంతి ||

చ|| పూలదండలో దారం దాగుందని తెలుసును
పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా? ఆ....... | పూల |
నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా? || ముద్దబంతి ||

చ|| మనసు మూగదేకాని బాసుంటది దానికి
చెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది
ఎదమీద ఎదపెట్టి సొదలన్నీ యినుకో
యినుకునీ బతుకునూ ఇంపుగా దిద్దుకో || ముద్దబంతి ||

చ|| ముక్కోటి దేవుళ్ళు మురిసి సూస్తుంటారు
ముందు జనమ బంధాలు ముడివేసి పెడతారు
కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపుతీపి దీవెనలు
మూగమనసు బాసలూ (2) మీకిద్దరికీ జోతలు || ముద్దబంతి ||

ఆగదూ ఆగదు

   
చిత్రం: ప్రేమాభిషేకం
గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
రచన: దాసరి నారాయణరావు
సంగీతం: చక్రవర్తి


ఆగదూ ఆగదూ
ఆగదు యేనిమిషము నీకోసమూ
ఆగితే సాగదు ఈ లోకమూ
ఆగదు యేనిమిషము నీకోసమూ
ఆగితే సాగదు ఈ లోకమూ
ముందుకు సాగదు ఈ లోకమూ!!ఆగదూ!!

౧. జాబిలి చల్లననీ
వెన్నెల దీపమనీ
తెలిసినా గ్రహణమూ రాక ఆగదు
పూవులు లలితమనీ
తాకితే రాలుననీ
తెలిసినా పెనుగాలీ రాక ఆగదు
హృదయం అద్దమనీ పగిలితే అతకదనీ
తెలిసినా మృత్యువు రాక ఆగదూ!!ఆగదు!!

౨. జీవితమొక పయనమనీ
గమ్యం తెలియదనీ
తెలిసినా ఈ మనిషీ పయనమాగదూ
జననం ధర్మమనీ
మరణం కర్మమనీ
తెలిసినా జనన మరణ చక్రమాగదు
మరణం తథ్యమనీ యేజీవికి తప్పదనీ
తెలిసినా ఈ మనిషీ తపన ఆగదు
ఈబ్రతుకు తపన ఆగదూ
!!ఆగదు!!

౩. మనసు మనసు కలయికలో
ఉదయించక ఆగదూ అనురాగం
అనురాగపు అర్పణలో
జనియించక మానదూ త్యాగం
ప్రేమ చెరిగినా మనసు చెదిరినా
ఆగదు త్యాగాభిషేకం
గెలుపు ఓడినా ఓటమి గెలిచినా
ఆగదు ప్రేమాభిషేకం