Pages

Subscribe:

Friday 25 July 2014

సరేలే ఊరుకో పరేషానెందుకు



సరేలే ఊరుకో పరేషానెందుకు
సరేలే ఊరుకో పరేషానెందుకు
చలేసే ఊరిలో జనాలే ఉండరా

ఎడారి దారిలో ఒయాసిస్సుండదా
అదోలా మూడు కాస్త మారిపోతే మూతి ముడుచుకునుంటారా
ఆటలోనో పాటలోనో మూడు మళ్ళీ మార్చుకోరా
మేరా నాం జోకరు మేరా కాం నౌకరు
ఇదో నా చేతిలో అలాడిన్ లాంతరు
Anything కోరుకో క్షణాల్లో హాజరు
ఖరీదేం లేదు గాని ఊరికేలే ఊపు రాదే ఓ మైనా
Claps కొట్టి ఈలలేస్తే చూపుతానే నా నమూనా

పిల్లి పిల్లదెపుడు ఒకే మాట కదా
మియామియాం మియా మియామియాం మియా
కోడి పిల్లదెపుడు ఒకే కూత కదా
కొక్కొ కొక్కొరకో కొక్కొ కొక్కొరకో
కోకిలమ్మ ఆకలైనా ట్యూను మాత్రం మార్చదే
రామచిలక రాతిరైనా కీచురాయై కూయదే
అలాగే నీ పెదాల్లో నవ్వునెపుడూ మారనీయకే ఏమైనా
కష్టమొస్తే care చెయ్యక నవ్వుతో తరివేయవమ్మా

మేరా నాం జోకరు మేరా కాం నౌకరు
ఇదో నా చేతిలో అలాడిన్ లాంతరు
Anything కోరుకో క్షణాల్లో హాజరు
ఖరీదేం లేదు గాని ఊరికేలే ఊపు రాదే ఓ మైనా
Claps కొట్టి ఈలలేస్తే చూపుతానే నా నమూనా

గూటి బిళ్ళ ఆడుదాం సిక్సర్లు కొడదాం
క్రికెట్ కాదు గాని ఫన్నీగానే ఉంది
ఏటిలోన దిగుదాం ఈతలు కొడదాం
Buffellows కది బాత్రూం కాదా మరి
రాణిగారి ఫోజులో నువు కూరుచోమ్మా ఠీవిగా
గేదెగారి వీపు మీద షైరుకెళదాం స్టైలుగా
జురాసిక్ పార్కుకన్నా బెస్టు ప్లేస్ ఈ పల్లెటూరే బుల్లెమ్మా
బోలెడన్ని వింతలున్నాయ్ బోరులేక చూడవమ్మా

మేరా నాం జోకరు మేరా కాం నౌకరు
ఇదో నా చేతిలో అలాడిన్ లాంతరు
Anything కోరుకో క్షణాల్లో హాజరు
ఖరీదేం లేదు గాని ఊరికేలే ఊపు రాదే ఓ మైనా
Claps కొట్టి ఈలలేస్తే చూపుతానే నా నమూనా

Thursday 24 July 2014

మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక

     
చిత్రం: దీక్ష
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
సంగీతం: పెండ్యాల

గానం: బాలు

మెరిసే మేఘమాలిక ఉరుములు చాలుచాలిక
చెలితో మాటలాడనీ వలపే పాట పాడనీ...వలపే పాట పాడనీ!!

కమలాలే నా రమణి నయనాలై విరిసే
అద్దాలే నా చెలియ చెక్కిళ్లై మెరిసే
ఆ నయనాల కమలాలలోనా
నా జిలుగు కలలు చూసుకోనీ
ఆ అద్ధాల చెక్కిళ్ళలోనా
నా ముద్దులే దాచుకోనీ!!

మధుమాసం చెలిమోవిని దరహాసం చేసే
చెలి జాబిలి చెలిమోమున కలలారబోసే
ఆ దరహాస కిరణాలలోనా నను కలకాలం కరిగిపోనీ
ఆ కలల పండు వెన్నెలలోనా
నా వలపులన్ని వెలిగిపోనీ!!

Monday 21 July 2014

తెల్లమబ్బు తేరుమీద ఇలకు దిగిన వెండి చందమామా

            

            


చిన్నోడు పెద్దోడు చిత్రం కోసం ఒక బాణీని సిద్ధం చేసి వినిపించారట బాలూ గారు. బాణీ విన్న నిర్మాత శివలంక ప్రసాద్ గారు కాస్త క్లాస్ అయిపోతుందేమో అని భయపడ్డారట. అయితే దర్శకులు రేలంగి నరసింహారావు గారు ఓకె అనడంతో పాట వ్రాయడానికి వెన్నెలకంటి గారిని పిలిపించారట. బాలుగారి వరస మీద మనసైన వెన్నెలకంటి గారు వెంటనే ఒకటి కాదు ఆరు పల్లవులు వ్రాసేశారట. వాటిలో అందరికీ నచ్చిన పల్లవి “తెల్లమబ్బు తేరుమీద ఇలకు దిగిన చందమామ” అన్న పల్లవి. వెన్నెల లాంటి భావంతో వెన్నెలకంటి నాకిచ్చిన కానుక ఇది అని బాలూ గారు ఇప్పటికీ చెప్పుకునే పల్లవి వరుసకు అద్భుతమైన ఆలాపనను జోడించి ఆ పాటకు పరిమళాలను అద్దింది మరెవరో కాదు అప్పటి బాలూ గారి అసిస్టెంట్, ఇప్పటి సంగీత దర్శకులు శ్రీనివాసమూర్తి గారు.
గానం: బాలు, జానకి

ప: తెల్లమబ్బు తేరు మీద ఇలకు దిగిన వెండి చందమామా
ఓ భామా నువ్వే నా ప్రేమా
రెక్క విసిరి ఊహలన్ని రెపరెపలాడేటి గగన సీమా
కలిసేమా ఒకటై ఒదిగేమా

౧. యుగాలు వేచినా నిరీక్షలోనా
ఎడారి గుండెలో వరాల వానా
పదాలకందనీ యతంట నువ్వు
పదాల వాలినా సుమాన్ని నేను
వయసే తపించీ వలపే జపించీ
కలలే ఫలించీ కలిపే విరించీ
కుందనాల బొమ్మ కనువిందు చేసెనమ్మా
కోరివచ్చె కొమ్మ దరిజేరి ఏలుకోమ్మా
ఆరు  ఋతువులేకమైన ఆమని మనదే సుమా!!రెక్క!!

౨. గులాబి సిగ్గులా నివాళులీనా
వరించి నిన్ను నే తరించిపోనా
విరాళి సైపనీ వియోగ వీణ
సరాగమైనదీ స్వరాలలోన
చూపుల మందారం పాపట సింధూరం
కులుకే సింగారం పలుకే బంగారం
చిరునవ్వుల సారం చిగురించిన సంసారం
 చెలిసొగసుల గారం చెలరేగిన శృంగారం
కలసిన హృదయాలలోన వెలసిన రస మందిరం!!తెల్ల!!




స్వరం చరణం కలవనీ సంగీత నాట్యముల సంగమమై

తిలక్ కామోద్ రాగమంటే విజయావారి చిత్రాలకు పనిచేసినటువంటి అందరి స్వరకర్తలకూ ఇష్టమట. రాగమంటేమాధవపెద్ది సురేష్ గారికి మరీ మరీ ఇష్టమట. అందుకే ఆనవాయితీని నిలబెడుతూ ఆత్మానందాన్ని పొందుతూ శ్రీకృష్ణార్జున విజయంలో అదే రాగంలో ఒక పాటను చేశారట. పాటవల్ల సురేష్ గారికి ఉత్తమ నంది పురస్కారం కూడా వచ్చింది. బాలుగారు, చిత్ర గారు, రేణుక గారు ఆలపించారు గీతాన్ని.            
                       

Saturday 5 July 2014

మౌనమె నీభాష ఓ మూగమనసా


మౌనమె నీ భాష ఓ మూగ మనసా ||2||
తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు ||మౌనమె||

౧. చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటకరంగానివే... మనసా
తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో ||2|| ||మనసా||

౨. కోర్కెల సెగ నీవు కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే... మనసా
మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ||2|| ||మనసా||