Pages

Subscribe:

Wednesday 27 August 2014

తియ తీయని తేనెల మాటలతో - Teri pyaari surat ko kisiki nazar na lage

                

                
చిత్రం: ఖైదీ కన్నయ్య
రచన: జి.కృష్ణమూర్తి,
సంగీతం: రాజన్ నాగేంద్ర
గానం: పి. సుశీల, ఆర్‌.రాజశ్రీ

తీయ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దూ
తెలియని చీకటి తొలగించీ
వెలుగిచ్చేది చదువే సూమా మానవద్దూ
దొంగల చేతికి దొరకనిదీ
దానము చేసిన తరగనిదీ
పదుగురిలోనా పరువును పెంచీ
పేరు తెచ్చే పెన్నిధదీ

పాఠాలన్నీ చదివేస్తాను
ఫస్టుగ నేను పాసౌతా
శభాష్‌................. ||తీయ తీయని||

అల్లరి చేయుట చెల్లనిదీ
ఎల్లప్పు డాడుట కూడనిదీ
ఏడువరాదు ఏమరరాదు
వీరుని వలెనే నిలవాలీ
బెదరను నేను అదరను నేను
ఏ దెదురైనా ఎదిరిస్తా
శభాష్‌............... ||తీయ తీయని||

బ్రతుకను బాటను కడదాకా
నడిచియె పోవలె ఒంటరిగా
యిడుములు రానీ పిడుగులు పడనీ
నీ అడుగులు తడబడునా
పిడుగులు పడినా జడవను నేను
వడి వడగానే అడుగేస్తా
శభాష్‌................. ||తీయ తీయని||


Tuesday 26 August 2014

గోరువెచ్చని సూరీడమ్మా

     చిత్రం: జయసుధ
సాహిత్యం: దాసరి నారాయణరావు
సంగీతం: రమేష్ నాయుడు
గానం : సుశీల

గోరువెచ్చని సూరీడమ్మా
పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
గోరువెచ్చని సూరీడమ్మా
పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
వద్దన్నా రావద్దన్నా
గుండెల్లో గుడిసె వేసి అది గుడిగా చేసి
ఆ గుడిలో దాగున్నాడమ్మా
ఆ గుడిలో దాగున్నాడమ్మా
గోరువెచ్చని సూరీడమ్మా
పొద్దుపొడుపులో వచ్చాడమ్మా

౧. మిట్టమధ్యాహ్నం నడినెత్తిన వచ్చాడు
మిట్టమధ్యాహ్నం నడినెత్తిన వచ్చాడు
ఒంటరిగా పోతుంటే ఎంటెంట పడ్డాడు
ఇనకుండా పోతుంటే అరిసరిసీ పిలిచాడు
పిలిచి పిలిచి అలుపొచ్చి పైకెక్కానన్నాడు
ఎతికి ఎతికి అలకొచ్చి ఏడెక్కానన్నాడు
ఆ ఏడి దిగాలంటే నా తోడు కావాలంట
నే తోడు ఇస్తానంటే తను దిగి వస్తాడంటా!!

౨. పొద్దుగూకేయేల ఎదురుగా వచ్చాడు
పొద్దుగూకేయేల ఎదురుగా వచ్చాడు
ఎనుతిరిగీ పోతుంటే ఎనకెనక పిలిచాడు
పోనీ అని తిరిగితే ఎరుపెక్కి ఉన్నాడు
ఆగి ఆగి ఆగలేక దిగివచ్చానన్నాడు
చూసి చూసి మత్తెక్కి పిచ్చెత్తిందన్నాడు
ఆ పిచ్చి దిగాలంటే నా తోడు కావాలంట
నే తోడు ఇస్తానంటే పొమ్మన్నా పోడంట !!

సన్నగా సన సన్నగా వినిపించే ఒక పిలుపు

     
చిత్రం: దీపారాధన (1980)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: దాసరి
నేపధ్య గానం: బాలు, సుశీల

ప: సన్నగా.. సన సన్నగా..వినిపించే ఒక పిలుపు
సన్నగా .. కను సన్నగా.. కనిపించే ఒక మెరుపు
ఆ పిలుపు మెరుపుదో.. ఆ మెరుపే పిలుపుదో

౧.  కోరికమ్మ గుడిలో కోయిలమ్మ కూసిందో
జాజులమ్మ తోటలో గాజులమ్మ పిలిచిందో
జాజులు జాజులు చేరి గుసగుసమన్నాయి.. ల.. ల.. ల.. ల
గాజులు గాజులు చేరి గలగలమన్నాయి
అన్నాయి అమ్మాయి నీ నడుమే సన్నాయి
విన్నాయి అబ్బాయి ఈ నీ మాటల సన్నాయి!!

౨.  చుక్కలమ్మ వాకిట్లో జాబిలమ్మ పూచిందో
మబ్బులమ్మ పందిట్లో ఉరుములమ్మ ఉరిమిందో
మబ్బు మబ్బు కలిసి మంచం వేశాయి.. ఆహాహా..
చుక్క చుక్క కలిసి పక్కలు వేశాయి
వేశాయి అబ్బాయి ప్రేమకు పీటలు వేశాయి
వేశాయి అమ్మాయి పెళ్ళికి బాటలు వేశాయి!!

Monday 25 August 2014

బాబూ వినరా అన్నా దమ్ముల కధవొకటి

   
బాబూ వినరా
అన్నా దమ్ముల కధవొకటి
కలతలు లేని నలుగురు కలిసి
సాగించారు పండంటి కాపురం

ఒక్క మాటపై ఎపుడు నిలిచారు వారు
ఒక్క బాటపై కలిసి నడిచారు వారు
ఆ...ఆ....ఓ.......(ఒక్క మాటపై)
అన్నంటే తమ్ములకు అనురాగమే
అన్నకు తమ్ములంటే అనుబంధమే!!బాబు!!

౧. చల్లని తల్లి ఆ ఇల్లాలు
ఇంటికి వెలుగై నిలిచెను(2)
పిల్లలకు పెద్దలకు తల్లివంటిది
ఆ ఇల్లు ఆమెతో స్వర్గామైనది!!బాబు!!

౨. అన్న మనసులో ఉన్నవి
ఎన్నో కోరికలు
తమ్ములకు జరగాలి పెళ్లి పేరంటాలు
పిల్లలతో ఆ ఇల్లు విలసిల్లాలి కలకాలం
ఈలాగే కలిసి ఉండాలి!!బాబు!!

ఏ రాగమో ఇది ఏ తాళమో

    
చిత్రం: అమరదీపం
రచన: ఆత్రేయ
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
గానం: ఎస్ పి బాలు, సుశీల
ప: ఏ రాగమో ఇది ఏ తాళమో (2)
అనురాగాని కనువైన
శ్రుతి కలిపినామో
ఏ రాగమో ఇది ఏ తాళమో (2)
మన కల్యాణ
శుభవేళ
మోగించు మేళమో
ఏ రాగమో
ఇది ఏ తాళమో


౧. ఎదలో మెదిలే సంగతులన్నీ
పలికెను సంగీతమై
పలికెను సంగీతమై...
కలిసిన కన్నుల మెరిసే కళలే
వెలిసెను గమకములై
వెలిసెను గమకములై...
హొయలైన నడకలే లయలైనవి
చతురాడు నవ్వులే గతులైనవి
సరి సరి అనగానే
మరి మరి కొసరాడు
మురిపాలె మన
జంట స్వరమైనది॥రాగమో॥

౨. విరికన్నె తనకు
పరువమే కాదు
పరువూ కలదన్నది
పరువూ కలదన్నది...
భ్రమరము తనకు
అనుభవమే కాదు
అనుబంధముందన్నది
అనుబంధముందన్నది...
కోకిలమ్మ గుండెకు గొంతున్నది
కొమ్మలో దానికి గూడున్నది
సరి మగవానికి సగమని తలపోయు
మన జంటకే జంట సరి ఉన్నది॥రాగమో॥

Humko Humise Chura Lo

 
Movie/Album: मोहब्बतें (2000)
Music By: जतिन-ललित
Lyrics By: आनंद बक्षी
Performed By: लता मंगेशकर, उदित नारायण

हमको हमीसे चुरा लो
दिल में कहीं तुम छुपा लो
हम अकेले, खो न जाएँ
दूर तुमसे, हो न जाएँ
पास आओ गले से लगा लो

ये दिल धड़का दो, जुल्फें बिखरा दो
शर्मा के अपना आँचल लहरा दो
हम जुल्फें तो बिखरा दें, दिन में रात न हो जाए
हम आँचल तो लहरा दें, पर बरसात न हो जाए
होने दो बरसातें, करनी हैं कुछ बातें
पास आओ गले से लगा लो.
हमको हमीसे चुरा लो...

तुमपे मरते हैं, हम मर जायेंगे
ये सब कहते हैं, हम कर जायेंगे
चुटकी भर सिन्दूर से तुम अब ये मांग ज़रा भर दो
कल क्या हो किसने देखा सब कुछ आज अभी कर दो
हो न हो सब राज़ी, दिल राज़ी रब राज़ी
पास आओ गले से लगा लो
हमको हमीसे चुरा लो...

Sunday 24 August 2014

సుందరి నేనే నువ్వంట చూడని నీలో నన్నంట


ప: సుందరి నేనే నువ్వంట చూడని నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంట జన్మకే తోడై నేనుంట
గుండెలో నిండమంటా నీడగా పాడమంట
నా సిరి నీవేనట………..(సుందరి)


౧. అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా……..
మధురాల మధువులు చిందే చల్లని ప్రేమే మాయమా….
రేపవలు నిద్దురలోన ఎద నీ తోడే కోరును
యుద్దాన ఏమైనా నా ఆత్మే నిన్నే చేరును
ఎద తెలుపు ఈ వేళ ఏల ఈ శోధన..
జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన
నాలో ప్రేమే మరిచావో ప్రేమే నన్నే గెలిచేనే (సుందరి)

౨. పూవులే ముళ్ళై తోచు నీవే నన్ను వీడితే
ఊహలే పూలై పూచు నీ ఎద మాటున చేరితే
మాసాలు వారాలవును నీవు, నేను కుడితే
వారాలు మాసాలవును బాటే మారి సాగితే
పొంగునీ బంధాలే నీ దరి చేరితే గాయాలు ఆరేను
నీ దరి చేరితే నీవే కదా నా ప్రాణం నీవే కదా నా లోకం (సుందరి)

చిత్రం : దళపతి
సంగీతం : ఇళయరాజా
గానం : బాలసుబ్రహ్మణ్యం,చిత్ర
రచన: 

మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోన

                                           
ప: మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన
ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే
మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన
ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే

౧. అధరాల మీద ఆడింది నామం
అధరాల మీద ఆడింది నామం
కనుపాపలందే కదిలింది రూపం
కనుపాపలందే కదిలింది రూపం
ఆ రూపమే మరి మరీ నిలిచిందిలే!!

౨. సిరిమల్లెపువ్వు కురిసింది నవ్వు
నెలరాజు అందం వేసింది బంధం
నెలరాజు అందం వేసింది బంధం
ఆ బంధమే మరీ మరీ ఆనందమే!!


ఆలోకయే శ్రీ బాలకృష్ణం



         
ఆలోకయే శ్రీ బాలకృష్ణం - సఖి
ఆనంద సుందర తాండవ కృష్ణమ్!!

౧. నవనీత ఖండ దధిచోరకృష్ణమ్ - భక్త
భవపాశబంధ మోచన కృష్ణమ్!!

౨. నీలమేఘశ్యామ సుందరకృష్ణమ్ - నిత్య
నిర్మలానందబోధ లక్షణ కృష్ణమ్!!

౩. చరణనిక్వణిత నూపుర కృష్ణం - కర
సంగత కనక కంకణ కృష్ణమ్!!

4. కింకిణీజాల ఘణఘణితకృష్ణం - లోక
 శంకితతారావళి మౌక్తిక కృష్ణమ్!!

౫. సుందర నాసామౌక్తికశోభితకృష్ణం - నంద
నందన మఖండవిభూతి కృష్ణమ్!౧

౬. కంఠోపకంఠశోభి కౌస్తుభకృష్ణమ్ - కలి
కల్మషతిమిరభాస్కర కృష్ణమ్!!

౭. వంశనాదవినోద సుందరకృష్ణం - పరమ
హంసకులశంసిత చరిత కృష్ణమ్!!

౮. గోవత్సబృంద పాలకకష్ణం - కృత
గోపికాజాల ఖేలన కృష్ణమ్!!


౯. నందసునందాది వందిత కృష్ణం - శ్రీ
నారాయణ తీర్థ వరద కృష్ణమ్!!































































రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా


చిత్రం: శ్రీఆంజనేయం
సంగీతం: మణిశర్మ
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: మల్లికార్జున్

ప: రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
అంత భక్తి పరవశమా... కంట మమ్ము గనుమా
సరదాగా నా గాలిపాట వినుమా
విన్నాక బదులిచ్చి ఆదుకోనుమా
గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగా
నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమోకటేగా
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
అంత భక్తి పరవశమా.... కంట మమ్ము గనుమా

౧. అమ్మల్లే నను పెంచింది పల్లెసీమ
నాన్నల్లే నడిపించింది ఊరంత ప్రేమ
అమ్మల్లే నను పెంచింది పల్లెసీమ
నాన్నల్లే నడిపించింది ఊరంత ప్రేమ
ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా
మట్టి సొంతం నా చిట్టి జన్మం
అన్ని సొంత ఇళ్ళే అంతా అయినవాళ్ళే
స్నేహబంధం నా పూర్వపుణ్యం
బతుకంతా ఇది తీరే రుణమా...
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
అంత భక్తి పరవశమా.... కంట మమ్ము గనుమా

౨. ఏ ఆటలాదిస్తావో కోతిబోమ్మా
బాటచూపిస్తావో కానున్న బ్రహ్మ
ప్రసన్నాంజనేయం అదే నామధేయం
ప్రతి మంచి కార్యం జరిపించు దైవం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం
నావెంటే నువ్వుంటే భయమా....

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
అంత భక్తి పరవశమా..... కంట మమ్ము గనుమా
సరదాగా నా గాలిపాట వినుమా
విన్నాక బదులిచ్చి ఆదుకోనుమా
గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగా
నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా