Pages

Subscribe:

Tuesday 25 November 2014

అందాల ఓ చిలకా అందుకో నా లేఖ

  
చిత్రం : లేత మనసులు (1966)
సంగీతం : M.S.విశ్వనాథన్
రచన :
గానం: పి బి శ్రీనివాస్, పి సుశీల

ప: అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా
అందాల చెలికాడా అందుకో నా లేఖ
నా కనులతో రాశాను ఈ మదిలోన దాచాను

౧. మిసమిసలాడేవెందుకని
తళతళలాడేవేమిటని ||2||
కురులు మోముపై వాలెనేలనో
విరులు కురులలో నవ్వెనెందుకో
అడుగుతడబడే చిలకకేలనో
పెదవి వణికెను చెలియకెందుకో ||అందాల ఓ చిలకా||

౨. మిసమిసలాడే వయసోయి
తళతళలాడే కనులోయి ||2||
కురులు మోముపై మరులు గొనెనులే
విరులు కురులలో సిరులు నింపెలే
అడుగుతడబడె సిగ్గు బరువుతో
పెదవి వణికెలే వలపు పిలుపుతో ||అందాల చెలికాడా||

౩. నీవే పాఠం నేర్పితివి నీవే మార్గం చూపితివి
ప్రణయ పాఠము వయసు నేర్పులే
మధుర మార్గము మనసు చూపులే
నీవు పాడగా నేను ఆడగా
యుగము క్షణముగా గడిచిపోవుగా ||అందాల ఓ చిలకా||

అందెను నేడే అందని జాబిల్లి

 
చిత్రం : ఆత్మగౌరవం (1966)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

ప: అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్నీ ఆతని వెన్నెలలే
అందెను నేడే అందని జాబిల్లి

1.ఇన్నేళ్ళకు విరిసె వసంతములు
ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు
నిదురించిన ఆశలు చిగురించెలే (2)
చెలికాడే నాలో తలపులు రేపెనులే
అందెను నేడే అందని జాబిల్లి

2. నా చెక్కిలి మెల్లగ మీటగనే
నరనరముల వీణలు మ్రోగినవి
గిలిగింతల నా మేను పులకించెలే (2)
నెలరాజే నాతో సరసములాడెనులే
అందెను నేడే అందని జాబిల్లి

3. ఇక రాలవు కన్నుల ముత్యములు
ఇక వాడవు తోటల కుసుమములు
వినువీధిని నామది విహరించెలే (2)
వలరాజే నాలో వలపులు చిలికెనులే ॥



ఒక పూల బాణం తగిలింది మదిలో

   
 చిత్రం : ఆత్మ గౌరవం (1965)
సంగీతం : సాలూరి రాజేశ్వర్ రావు
రచన : దాశరథి
గానం : ఘంటసాల , సుశీల

ప: ఒక పూల బాణం తగిలింది మదిలో
తొలి ప్రేమ దీపం వెలిగింది లే
నాలో వెలిగిందిలే ||ఒక||

1. అలనాటి కలలే ఫలియించే నేడే ||అల
మనసైన వాడే మనసిచ్చి నాడే
ఈ ప్రేమ లో లోకమే పొంగి పోయి
వసంతాల అందాల ఆనందాల ఆడాలొయి!!

౨. ఏ పూర్వ బంధమో అనుబంధమాయె
అపురూప మైన అనురాగ మాయె
నీ కౌగిటా హాయిగా సోలిపోయి
సరదాల ఉయ్యాల ఉల్లాసం గా వూగాలోయి


Friday 14 November 2014

నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని

            


చిత్రం: గులేబకావళి కథ
సంగీతం: జోసఫ్ కృష్ణమూర్తి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

ప: నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి

౧. తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూలదండవోలె కర్పూర కళికవోలె కర్పూర కళికవోలె
ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు
ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు.. సంకెలలు వేసినావు!!

౨. నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై
నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో
ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం
ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం...!!

సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ

              


చిత్రం: కంచుకోట (1961)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల, జానకి

ప: సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ
సురవైభవానా భాసుర కీర్తిలోనా
సురవైభవాన భాసుర కీర్తిలోనా
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ

సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ
సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ
సిరిలోన గానీ మగసిరిలోన గానీ
సిరిలోన గానీ మగసిరిలోన గానీ
సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ

౧. ప్రజలను నీకంటి పాపలుగా కాచి
ఆ...
ప్రజలను నీకంటి పాపలుగా కాచి
పరరాజులదరంగ కరవాలమును దూసి
ప్రజలను నీకంటి పాపలుగా కాచి
పరరాజులదరంగ కరవాలమును దూసి
శాంతిని వెలయించి మంచిని వెలిగించి
శాంతిని వెలయించి మంచిని వెలిగించి
జగతిని లాలించి పాలించినావూ....!!

౨. మరుడే తొందరచేయ విరిబోణులనుగూడి
మధువే పొంగులువార మనసార తూగాడి
ఆ... ఆ... ఆ...
మరుడే తొందరచేయ విరిబోణులనుగూడి
మధువే పొంగులువార మనసార తూగాడి
నవ్వులు చిలికించి మువ్వలు పలికించి
నవ్వులు చిలికించి మువ్వలు పలికించి
యవ్వనవీణనూ కవ్వించినావూ...!!

౩. రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్
నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్
రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్
నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్
అసమప్రభావ జోహార్
రసికావతంస జోహార్
అసమప్రభావ జోహార్
రసికావతంస జోహార్
జోహార్ జోహార్ జోహార్ జోహార్
జోహార్ జోహార్ జోహార్ జోహార్
ఆ...ఆ...
ఆ...ఆ...