Pages

Subscribe:

Saturday 30 May 2015

చందమామ రమ్మంది చూడు.. చల్లగాలి రమ్మంది చూడూ

చందమామ రమ్మంది చూడు.. చల్లగాలి రమ్మంది చూడూ..
ఆ పైన.. ఇంక ఆ పైన.. నువ్వు నా కళ్ళలో తొంగి చూదూ
చందమామ బాగుంది నేడు చల్లగాలి బాగుంది నేడు
ఏముంది.. ఇంక ఏముంది.. అది అంతే కదా ఏనాడు
చందమామ బాగుంది నేడు

1. పూవులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు
పూవులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు
వెన్నెలే ఎందుకో నన్ను కవ్వించే నేడు
తెలుసుకోలేవు నీవూ పలకగాలేను నేను
చందమామ రమ్మంది చూడూ

2. పూవులే నవ్వితే నవ్వుకోనిమ్ము నేడు
పూవులే నవ్వితే నవ్వుకోనిమ్ము నేడు
ఉందిగా వెన్నెలా ఎందుకమ్మాయి తోడు
నీది నా దారి కాదు నాది నీ దారి కాదు
చందమామ బాగుంది నేడు

3. చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు
చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు
చెంతగా నిలిచినా వింత నాకేమి లేదు
అడవి మనిషివి నీవు..ఆమాటె తగదన్నాను
చందమామ రమ్మంది చూడు.. చల్లగాలి రమ్మంది చూడు
ఆ పైన.. ఇంక ఆ పైన.. నువ్వు నా కళ్ళలో తొంగి చూడు
చందమామ రమ్మంది చూడు

ఎవరూ లేని చోట ఇదిగో చిన్నమాట

మా ఊళ్లో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది

 చిత్రం : అవేకళ్ళు (1967)
రచన : కొసరాజు
సంగీతం : వేదా
గానం : ఘంటసాల, పి.నాగేశ్వరరావు, బృందం

ప: మా ఊళ్లో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది
డడాఢడాఢడడడాఢడ
మా ఊళ్లో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది
ఆవూళ్లో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు
చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచక్క

హోయ్... మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
హోయ్... చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచక్క
హోయ్... మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
హోయ్... బలెబలెబలెబలెబలే.... య్య

మా ఊళ్లో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది
ఆవూళ్లో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు

1. కంటిమీద కునుకురాదు బావా అంది
కన్ను మూసుకో నన్ను తలచుకో పిల్లా అన్నాడు

హోయ్... లాయిలల్ల లాయిలల్ల లల్లలా
హోయ్... లాయిలల్ల లాయిలల్ల లల్లలా
హోయ్... లాయిలల్ల లాయిలల్లలల్ల లల్లలల్లలా...

కంటిమీద కునుకురాదు బావా అంది
కన్ను మూసుకో నన్ను తలచుకో పిల్లా అన్నాడు
ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో
ఓలమ్మో గైరమ్మో కెవ్వంటు అరిచిందయ్యా

హటకే హటకే హటకే అరె... బచ్‌కే బచ్‌కే బచ్‌కే
హటకే హటకే హటకే అరె... బచ్‌కే బచ్‌కే బచ్‌కే
హోయ్... బలెబలెబలెబలెబలే.... య్య

2. బుర్రుపిట్టా అహా తుర్రుమంటే ఓహో బాబోయ్ అంది
అత్తకొడుకుని అరవబోకులే పిల్లా అన్నాడు

హోయ్... లాయిలల్ల లాయిలల్ల లల్లలా
హోయ్... లాయిలల్ల లాయిలల్ల లల్లలా
హోయ్... లాయిలల్ల లాయిలల్లలల్ల లల్లలల్లలా...

బుర్రుపిట్టా అహా తుర్రుమంటే ఓహో బాబోయ్ అంది
అత్తకొడుకుని అరవబోకులే పిల్లా అన్నాడు
ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో
ఓలమ్మో గైరమ్మో కెవ్వంటు అరిచిందయ్యా

హటకే హటకే హటకే అరె... బచ్‌కే బచ్‌కే బచ్‌కే
హటకే హటకే హటకే అరె... బచ్‌కే బచ్‌కే బచ్‌కే
హోయ్... బలెబలెబలెబలెబలే.... య్య

మా ఊళ్లో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది
ఆవూళ్లో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు

చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచక్క
మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచక్క
మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
చెమ్మచెక్క మల్లెమొగ్గ... చెమ్మచెక్క మల్లెమొగ్గ
చెమ్మచెక్క మల్లెమొగ్గ... చెమ్మచెక్క మల్లెమొగ్గ
బలెబలెబలెబలెబలే.... య్య

గంగా యమునా తరంగాలతో

నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే

 చిత్రం : గూఢచారి 116 (1966)
సంగీతం : టి. చలపతి రావు
రచన  : డా. సి. నారాయణ రెడ్డి
గానం : ఘంటసాల, పి. సుశీల

ప: నువ్వు నా ముందుంటే.. నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు.. రివ్వుమంటుంది వయసు..

1. ముద్దబంతిలా ఉన్నావు.. ముద్దులొలికిపోతున్నావు..
జింక పిల్లలా చెంగు చెంగుమని చిలిపి సైగలే చేసేవు..

నువ్వు నా ముందుంటే.. నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు.. రివ్వుమంటుంది వయసు..

చల్లచల్లగ రగిలించేవు.. మెల్లమెల్లగ పెనవేసేవు..
బుగ్గపైన కొనగోట మీటి నా సిగ్గు దొంతరలు దోచేవు..

నువ్వు నా ముందుంటే.. నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు.. రివ్వుమంటుంది వయసు..

లేత లేతగా నవ్వేవు.. లేని కోరికలు రువ్వేవు..
మాటలల్లి మరుమందు జల్లి నను మత్తులోన పడవేసేవు..

నువ్వు నా ముందుంటే.. నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు.. రివ్వుమంటుంది వయసు..

ఏమమ్మా నిన్నేనమ్మా ఏలాగున్నావు?

 చిత్రం : తేనె మనసులు (1965)

సంగీతం : కె.వి.మహదేవన్ 
రచన : ఆత్రేయ 
గానం : ఘంటసాల , పి.సుశీల

ప: ఏమమ్మా!నిన్నేనమ్మా!
ఏలాగున్నావు?
ఏదోలేండి!మీ దయవల్ల
ఈలాగున్నాను
అలాగంటే ఏలాగండి
అయినవాళ్ళని అడిగాము
అంతే లెండి! అంతకు మించి
ఏదో ఏదో వుందని అన్నానా?

1. నడవకు నడవకు అమ్మయ్యో
నడిచావంటే అమ్మయ్యో
నడుమే నలిగిపోతుంది
నీ నడుమే నలిగిపోతుంది
పొగడకు పొగడకు అయ్యయ్యో
పొగిడారంటే అయ్యయ్యో
మనిషే వెగటైపోతారు
మనిషే వెగటైపోతారు!!

2. చూడకు!అలా చూడకు!
చూశావంటే ఏదో ఏదో అవుతోంది
ఎదలో ప్రేమే పుడుతుంది
పుట్టనీ! పాపం పుట్టనీ
ప్రేమే పుడితే పెంచేదాన్ని నేనున్నా
లాలించేదాన్ని నేనున్నా
జోజోజో...జోజోజో!!

దివి నుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై

దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై
గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై

1. అందని జాబిలి అందాలు పొందాలి అనుకున్నానొకనాడు ఆనాడు
అందిన జాబిలి పొందులో అందాలు … అందిన జాబిలి పొందాలో అందాలు
పొందాను ఈనాడు ఈనాడు …. పొందాను ఈనాడు ఈనాడు!!

2. కనరాని దేవుని కనులా జూడాలని కలగంటి నొకనాడు ఆనాడు
కనరాని దేవుని కనులా జూడాలని కలగంటి నొకనాడు ఆనాడు
కల నిజము జేసి కౌగిలిలో జేర్చి .. కల నిజము జేసి కౌగిలిలో జేర్చి
కరిగించే ఈనాడు ఈనాడు … కరిగించే ఈనాడు ఈనాడు!!గుడిలోన!!

3. కడలిలో పుట్టావు అలలపై తేలావు నుఱగవై వచ్చావు ఎందుకో …
కడలి అంచువు నిన్ను కలిసి నీ ఒడిలో .. ఒరిగీ కరగాలని ఆశతో ….
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై అ ….
గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై

నీ ఎదుట నేను వారెదుట నీవు

 చిత్రం: తేనె మనసులు
గానం: సుశీల

చందమామా అందాల మామా
ప: నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు
నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు
పెళ్ళిచూపులకు వారొచ్చారు చూడాలని నే ఓరగ చూశా
పెళ్ళిచూపులకు వారొచ్చారు చూడాలని నే ఓరగ చూశా
వల్లమాలినా సిగ్గొచ్చింది కన్నుల దాకా కన్నులు పోక
మగసిరి ఎడదనె చూశాను
మగసిరి ఎడదనె చూశాను తల దాచుకొనుటకది చాలన్నాను!!

పెళ్ళిచూపులలో బిగుసుకొని పేరేమి చదువేమి ప్రేమిస్తావా వయసెంతా
పెళ్ళిచూపులలో బిగుసుకొని పేరేమి చదువేమి ప్రేమిస్తావా వయసెంతా
అని అడిగారా అసలొచ్చారా
నాలో వారు ఏం చూశారో నావారయ్యారు
నాలో వారు ఏం చూశారో నావారయ్యారు
అందులకే మా ఇద్దరి జంట అపురూపం అంటా!!

చల్లని వెన్నెల దొరవంటారు తీయని నవ్వుల సిరివంటారు
చల్లని వెన్నెల దొరవంటారు తీయని నవ్వుల సిరివంటారు
ఆ వెన్నెలలోని వేడిగాడ్పులు నవ్వులలోని నిప్పురవ్వలు
అనుభవించి అనమంటాను
అనుభవించి అనమంటాను వయసుకు వైరివి నీవంటాను
నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు
చందమామా అందాల మామా