Pages

Subscribe:

Monday 26 October 2015

కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా


కలయా... నిజమా... తొలిరేయి హాయి మహిమా ||2||
అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆప తరమా
అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా


౧. లేనిపోని ఏ కూనిరాగమో లేచిరా అంటున్నదీ.. అహా...
ఊరుకోని ఏ వెర్రి కోరికో తీర్చవా అంటున్నదీ..
కోక ముళ్ళ కూపీ తీసే కైపు చూపు కొరుకుతున్నది
కుర్ర కళ్ళు చీర గళ్ళలొ దారే లేక తిరుగుతున్నవి
ముంచే మైకమో... మురిపించే మోహమో||కలయా||


౨. చేయి వేయనా సేవ చేయనా ఓయ్ అనే వయ్యారమా.. హహ హ..
పాల ముంచినా నీట ముంచినా నీ దయే శ్రుంగారమా... అహా...
ఆగలేని ఆకలేవిటొ పైకి పైకి దూకుతున్నది
కాలు నేల నిలవకున్నది ఆకశాన తేలుతున్నది
హా అంతా మాయగా అనిపించే కాలమూ||కలయా||


Sunday 25 October 2015

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని


 చిత్రం : అనుకోకుండా ఒక రోజు (2005)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : సిరివెన్నెల
గానం : స్మిత

ఎవరైనా చూసుంటారా
నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని
నే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్ని
పరిపాలిస్తున్నా రాజునేనై కోటిగుండెల కోటల్ని
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని

చరణం : 1
రాళ్ళే ఉలిక్కిపడాలి నా రాగం వింటే
ఊళ్ళే ఉప్పొంగిపోవాలి నా వేగం వెంటే
కొండవాగులై ఇలా నేను చిటికేస్తే
క్షణాలన్నీ వీణ తీగలై స్వరాలెన్నో కురిపిస్తాయంటే అంటే
అది నిజమోకాదో తేలాలంటే
చూపిస్తాగా నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగా
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని

చరణం : 2
చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కథ తెలిసేలా
ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడున్న దాఖలా
ఆంధ్రుడెవరంటే జగదేకవీరుడని
ఆ స్వర్గం కూడ తలవంచేలా
మన జెండా ఎగరాలీ వేళ చుక్కల్ని తాకేంతలా
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని
నే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్ని
పరిపాలిస్తున్నా రాజు నేనై కోటిగుండెల కోటల్ని
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని


చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది మనీ మనీ


 చిత్రం : మనీ (1993)
సంగీతం : శ్రీ  మూర్తి
రచన : సిరి వెన్నెల  సీతారామ శాస్త్రి
గానం  : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం

ప: చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు
ఐనా అన్నీ అంది మనీ మనీ
పచ్చనోటుతో లైఫు లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టడానికి పాడెకట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బుని లబ్డబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా

౧. ఇంటద్దె కట్టావ నా తండ్రి నో ఎంట్రీ వీధి వాకిట్లో
దొంగల్లే దూరాలి సైలెంట్లీ నీ ఇంట్లో చిమ్మచీకట్లో
అందుకే పదా బ్రదర్ మనీ వేటకీ
అప్పుకే పదా బ్రదర్ ప్రతీ పూటకీ
రోటీ కప్డా రూము అన్నీ రూపీ రూపాలే
సొమ్ముని శరణమ్మని చరణమ్ము నమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా!!

౨. ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా
డ్రీమించుకొవచ్చు ధీమాగా డ్రామాలో ప్రేమస్టోరీలా
పార్కులో కనే కలే ఖరీదైనది
బ్లాకులో కొనే వెలే సినీప్రేమది
చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికులెవ్వరికీ
జీవితం ప్రతినిమిషము సొమ్మిచ్చిపుచ్చుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా!!





విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం


 చిత్రం : సిరివెన్నెల (1987)
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం...
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం...
కనుల కొలనులొ ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం...
ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించిపంచి గానం....ఆ ఆ..

సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది...
సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది...
నే పాడిన జీవన గీతం...ఈ గీతం..

విరించినై విరచించితిని ఈ కవనం..
విపంచినై వినిపించితిని ఈ గీతం....

ప్రాగ్దిస వేణీయ పైన దినకర మయూఖ తంత్రులపైన..
జాగృత విహంగ తతులే వినీల గగనపు వెదిక పైన
ప్రాగ్దిస వేణీయ పైన దినకర మయూఖ తంత్రులపైన..
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ..
విశ్వకార్యమునకిది భాష్యముగావిరించినై!!విరించినై!!

జనించు ప్రతిశిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం
జనించు ప్రతిశిశు గల్ళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం
అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా..
సాగిన సృష్టి విలాసము నే!!విరించినై!!

నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం
నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది...
నేపాడిన జీవన గీతం...ఈ గీతం..

నా పాట పంచామృతం.


నా పాట పంచామృతం.. ||2||
నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం ||2||

వల్లకి మీటగ పల్లవపాణి అంగుళి చేయనా పల్లవిని ||2||
శారద స్వరముల సంచారానికి..
శారద స్వరముల సంచారానికి చరణములందించనా..

నా పాట పంచామృతం
నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం

గళము కొలను కాగా.. ప్రతి పాట పద్మమేగా..
పదము వెల్లివిరిసి రాదా విధిసతి పాదపీఠి కాగా..
శృతిలయలు మంగళ హారతులై.. స్వరసరళి స్వాగత గీతికలై..
ప్రతిక్షణం సుమార్చనం.. సరస్వతీ సమర్పణం..
గగనము గెలువగ గమక గతులు సాగా
పశువుల శిశువుల ఫణుల శిరసులూగా...
నా పాట పంచామృతం

దా నిసనిదమా దనిదమగా మదమగసా
సని సగమ దనిస గమద నిసగ మగస నిదమగ
నా పాట పంచామృతం
నీ దనిసగ నిగసని దమగాగ
సనిదదాని సదాదామనీని దాగాగ నిగదసమనిగద
నా పాట పంచామృతం
సస్సగమగసని సాగామాగా సమగసని
నిసగ దనిస నిసగ మగస గస గస నిదమ గసని
సమగదని గమదనిస సగనిదమగ
నా పాట పంచామృతం

సా పా సా సనిపమ గసనిపస
సగమప మగ సగమప మగ సగమప మప మపని పమపా
సరిగప దప గపదా పగదా గపదపగరి ససరిగరీ
సా రిమపనిస రిమపనిస
మపనిసరిమా రిపమానిసరీ
సామ సామ సా మపదసరి రీ సాగపమా
మపదద్దాప మపదద్దాప మపదద్దాప మపసదా
పమపదసా పమపదరీ
సరిరి సరిరి సరిరి సరిరి సరిసదసరి
దసరి పదసరి మపదసరి రిమపదసరి సరిపమదసరి
పనిస గపద రిమప సగమగ సమగసరిదమగ
నా పాట పంచామృతం..
నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం

బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మా

 
 చిత్రం : ఇద్దరు మిత్రులు (1999)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : పార్థసారధి , చిత్ర

పల్లవి :
బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మా
బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మా
ఎన్నాళ్ళనుంచి కన్న కలలు తెచ్చి అరుదైన రూపం ఈ బొమ్మ
చెంత చెదరని మురిపించే చిత్రం చూడనీ
వీరివీరి గుమ్మాడీ వాడీ పేరేంటమ్మా అమ్మాయి ఓ . . . ||బంగారం||

చరణం : 1
జో . . . లాలి అని కొత్తరాగాలెన్నో పలుకమ్మా తీయగా
ఈ . . . మంచు బొమ్మ పంచప్రాణాలతో నిలువెల్లా విరియగా
అమ్మ అంటుంది కమ్మగా పసిపాప తేనే పాట
అమ్మాయిగారు అమ్మగా పదవిని  పొందునట
ఇల్లంతా బొమ్మల కొలువు మనసంతా నవ్వుల నెలవుఓ ||బంగారం||

చరణం : 2
అడగక ముందే అన్నీ చేసి సేవకుడివనిపిస్తావు
అలసిన ఆశకి జీవం పోసి దేవుడిలా కనిపిస్తావు
ఈ జన్మలోను నే తీర్చలేని రుణమై బంధించావు
నీ స్నేహంతోనే చిగురించమని వరమే - అందించావు
ఎప్పుడూ నా కళ్ళు చూడనీ వెలుగే చూపించినావు
ఎప్పుడు నా గుండెపాడనీ మధురీమ నేర్పావు
నీలికళ్ళే చిందే తడిలో హరివిల్లే రాని త్వరలో ఓ . . .
ఓ . . .మాతృత్వానికి మగరూపానివై
నాన్నతనంలో కర్ణుడివై అన్నగుణంలో కృష్ణుడివై
బతుకంతా జతగా నిలిచే విధివో
పతినే మించిన తోడువై
బంధుత్వాలకి అందని బంధం ఉందని చూపిన నేస్తమా


ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుళ్ళు

                    
 చిత్రం : స్వర్ణకమలం
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : ఇళయరాజా

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు!!ఘల్లు ఘల్లు!!

౧. లయకే నిలయమై నీపాదం సాగాలి
మళయానిల గతిలో సుమ బాలగ తూగాలి
వలలో ఒదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురు వేడి
తిరిగే కాలానికీ
ఆఅ ఆఆ ఆ
తిరిగే కాలానికీ తీరొకటుంది
అది నీ పాఠానికి దొరకను అంది
నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటె
విరుచుకుపడు సురగంగకు విలువేముంది విలువేముందీ!!ఘల్లు ఘల్లు!!

౨. దూకే అలలకూ ఏ తాళం వేస్తారు
ఆహహ
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు
ఉం ఉం
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్ధం
వద్దని ఆపలేరు ఆఅ ఆఅ..
వద్దని ఆపలేరు ఉరికే ఊహని
హద్దులు దాటరాదు ఆశల వాహిని
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరి వనముల పరిమళముల విలువేముంది విలువేముందీ!!ఘల్లు ఘల్లు!!

తరలి రాద తనే వసంతం


తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కొసం ||తరలి||
గగనాల దాక అల సాగ కుంటే
మేఘాల రాగం ఇల చేరుకోద ||తరలి||


వెన్నెల దీపం కొందరిదా
అడవిని సైతం వెలుగు కదా ||2||
ఎల్లలు లేని చల్లని గాలి
అందరి కోసం అందును కాదా
ప్రతి మదిని లేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏది సొంతం కోసం కాదను సందేశం
పంచే గుణమే పోతె ప్రపంచమేశూన్యం
ఇది తెలియని మనుగడ కథ
దిశ తెలియని గమనము కద ||తరలి||

బ్రతుకున లేనీ శ్రుతి కలదా
ఎద సడి లోనే లయ లేదా ||2||
ఏ కళ కైనా ఏ కథ కైనా
జీవిత రంగం వేదిక కాదా
ప్రజా ధనం కాని కళా విలాసం
ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసే కోయిల పోతె కాలం ఆగిందా
సాగే ఏరే పాడే మరో పదం రాదా
మురళికి గల స్వరముల కళ
పెదవిని విడి పలుకదు కద ||తరలి||

లలిత ప్రియ కమలం విరిసినది


లలిత ప్రియ కమలం విరిసినది ||2||
కన్నుల కొలనిని ఆ..
ఉదయ రవి కిరణం మెరిసినది
ఊహల జగతిని ఆ.. ||ఉదయ||
అమృత కలశముగా ప్రతి నిమిషం ||2||
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది ||లలిత||

రేయి పగలు కలిపే సూత్రం సాంధ్య రాగం
కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేల నింగి కలిపే బంధం ఇంధ్రచాపం
కాదా మన స్నేహం ముడివేసే పరువం
కళల విరుల వనం మన హృదయం ||2||
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం
కోటి తలపుల చిగురులు తొడిగెను
తేటి స్వరముల మధువులు చిలికెను
తీపి పలుకుల చిలుకల కిలకిల
తీగ సొగసుల తొణికిన మిలమిల
పాడుతున్నది ఎద మురళి
నీ రాగ చరితలగల మృదు రవళి
తూగుతున్నది మధుర వని
లేత విరి కులుకుల నటన కని
వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను ||లలిత||

కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగా
కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం
కాదా మమకారం నీ పూజా కుసుమం
మనసు హిమగిరిగా మారినది ||2||
కలసిన మమతల స్వరగతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము
వీణ పలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వగ నిలిచెను కాలము
పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం
రాయమని మాయని మధు కావ్యం
స్వాగతించెను ప్రేమ పథం
సాగినది ఇరువురి బ్రతుకు రథం
కోరికల తారకల సీమలకు చేరుకొనే వడి వడి పరుగిడి ||ఉదయ||

నమ్మకు నమ్మకు ఈ రేయిని


సీకటమ్మ సీకటి ముచ్చనైన సీకటి
ఎచ్చనైన ఊసులెన్నో రెచ్చగొట్టు సీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి
ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి
పొద్దు పొడుపే లేని సీకటే ఉందిపోనీ
మన మధ్య రానీక లోకాన్ని నిద్దరోనీ
రాయే రాయే రామసిలక సద్దుకుపోయే సీకటెనకా
నమ్మకు నమ్మకు ఈ రేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకు
రవి కిరణం కనపడితే తెలియును తేడాలన్ని
నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు
నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికి
పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
ఏ హాయి రాదోయి నీ వైపు మరువకు అది
నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు
ఆహా నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక
ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
ఆనాడు వాసంత గీతాలు పలుకును కదా
నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు
ఆహా నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని

తెలవారదేమో స్వామీ

        
పల్లవి:
తెలవారదేమో స్వామీ తెలవారదేమో స్వామీ
నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలుమంగకూ
తెలవారదేమో స్వామీ
నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలుమంగకూ
తెలవారదేమో స్వామీ
చరణం 1:
చెలువమునేలగా చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు ||2||
కలల అలజడికి నిద్దుర కరవై ||2||
అలసిన దేవేరి.. అలసిన దేవేరి.. అలమేలుమంగకూ ||తెలవారదేమో స్వామీ||

చరణం 2:
మక్కువ మీరగా అక్కున జేరిచి అంగజుకేళిని పొంగుచు తేల్చగా ||2||
ఆ మత్తునే మది మరి మరి తలచగా .. మరి మరి తలచగా
అలసిన దేవేరి.. అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామీ.. గా మ ప ని
తెలవారదేమో సా ని ద ప మ ప మ గ ని స గా మ
తెలవారదేమో స్వామీ
పా ని ద ప మ గ మ ప స ని ద ప మ గ మ
ప స ని రి స గ రి మ గ రి సా రి నీ స ||తెలవారదేమో స్వామీ||

మెరిసే తారలదే రూపం


మెరిసే తారలదే రూపం
విరిసే పూవులదే రూపం
అది నా కంటికి శూన్యం

మనసున కొలువై మమతల నెలవై
వెలసిన దేవిది ఈ రూపం
నా కన్నులు చూడని రూపం
గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం ॥౨॥

ఎవరిరాకతో గళమున పాటల ఏరువాక సాగేనో
ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా

ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా

నా కన్నులు చూడని రూపం
గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా ॥౨॥

వెదురును మురళిగ మలచి
ఈ వెదురును మురళిగ మలచి
నాలో జీవన నాదం పలికిన
నీవే నా ప్రాణ స్పందన
నీకే నా హృదయ నివేదన

మనసున కొలువై మమతల నెలవై
వెలసిన దేవిది ఈ రూపం
నా కన్నులు చూడని రూపం
గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం

ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు

                    
పల్లవి:
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
నను గన్న నావాళ్ళు, నా కళ్ళ లోగిళ్ళు || ఈ గాలి ||

చరణం:
చిన్నారి గొరవంక, కూసేను ఆవంక,
నారాక తెలిసాక, వచ్చేను నావంక | చిన్నారి |
ఎన్నాళ్ళో గడిచాకా, ఇన్నాళ్ళకు కలిసాక | ఎనాళ్ళో |
ఉప్పొంగిన గుండెల కేక, ఎగసేను నింగిదాక | ఎగసేను| || ఈ గాలి ||

చరణం:
ఏనాడు ఏశిల్పీ, కన్నాడో ఈ కలలు,
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళలు | ఏనాడు |
ఏ తలపుల వలపులతో తెలిపాడో ఈ కళలు
ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను

కన్నెమూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న తారచిలుకు కాంతి చినుకులై | కన్నె |
గగన గళము నుండి అమర గానవాహిని...ఆ....ఆ... | గగన |
జాలువారుతోంది ఇలా అమృతవర్షిణీ...అమృతవర్షీణీ...అమృతవర్షీణీ
ఈ స్వాతివానలో నా ఆత్మ స్నానమాడే
నీ మురళిలో నాహృదయమే స్వరములు గా మారె
ఆహాహా....హాహహా....... || ఈ గాలి ||

ఆదిభిక్షువు వాడినేది కోరేది


 చిత్రం : సిరివెన్నెల (1986)
సంగీతం :కె.వి.మహదేవన్
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది
ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది

తీపిరాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది
తీపిరాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి
మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది

తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాలను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది

గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిచేరు
మన్మథుని మసి జేసినాడు వాడినేది కోరేది
వరగర్వమున మూడు లోకాలు పీడింప తలపోయు
దనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉబ్బుశంకరుడు వాడినేది కోరేది
ముక్కంటి, ముక్కోపి
ముక్కంటి, ముక్కోపి తిక్కశంకరుడు

ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది

ఏదో ఒక రాగం పిలిచిందీ ఈవేళా


చిత్రం: రాజా
సంగీత దర్శకత్వం: ఎస్.ఎ. రాజ్ కుమార్
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: చిత్ర

ఏదో ఒక రాగం పిలిచిందీ ఈవేళా...
నాలో నిదురించే గతమంతా కదిలేలా...
నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా...
నా ఊపిరి ఊయలలో చిరు నవ్వులు చిలికేలా....
జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు...
జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు...
అమ్మా, అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే...
రా, అమ్మా.... అని అమ్మే లాలించిన జ్ఞాపకమే...
అమ్మ కళ్ళలో అపుడపుడూ చెమరింతలు జ్ఞాపకమే...
అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం...
అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం... //ఏదో//
గుళ్ళో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే...
బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే...
గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే...
నెమలి కళ్ళనే దాచే చోటు జ్ఞాపకం...
జామ పళ్ళనే దోచే తోట జ్ఞాపకం.... //ఏదో//

వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు


ప: వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా ఛాన్సు ఇంక వేసెయ్యి మరో డోసు
వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా ఛాన్సు ఇంక వేసెయ్యి మరో డోసు 
పిచ్చెక్కి ఆడియన్సు రెచ్చిపోయేలా చెయ్యి డాన్సు
చెప్పింది చెయ్యరా నీవేరా ముందు డేసు
వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు

౧. అమితాబచ్చను కన్నా ఏం తక్కువ నువ్వైనా
హాలివుడ్లో అయినా ఎవరెక్కువ నీ కన్నా
ఫైటు ఫీటు ఆట పాట రావా నీకైనా
చిరంజీవైనా పుడుతూనే మెగాస్టార్ అయిపోలేదయ్యా
తెగించే సత్తా చూపందే సడన్‌గా స్వర్గం రాదయ్యా
బాలయ్య వెంకటేషూ నాగార్జునా నరేషు
రాజేంద్రుడూ సురేషు రాజశేఖరూ అదర్సు
మొత్తంగా అందరూ అయిపోవాలోయ్ మటాషు!!


౨. గూండా రౌడీ దాదా అంటారే బైటుంటే
ఇక్కడ చేసే పన్లే సినిమాల్లో చూపిస్తే
ఓహో అంటూ జై కొడతారు తేడా మేకప్పే
నువ్వుంటే చాల్లే అంటారు కథెందుకు పోన్లే అంటారు
కటౌట్లూ గట్రా కడతారు టికెట్లకు కొట్టుకు ఛస్తారు
బావుంది గాని ప్లాను పల్టీ కొట్టిందో ఏమి గాను
బేకారి బాతు మాను జర దారూ తగ్గించు ఖాను అరే ఛీ పో
శకున పక్షిలా తగులుకోకు ముందు
వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా ఛాన్సు ఇంక వేసెయ్యి మరో డోసు
చిత్రం: మనీ

కన్నుల్లో నీ రూపమే


చిత్రం: నిన్నే పెళ్ళాడతా
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం:సందీప్ చౌతా
గానం: చిత్ర, హరిహరన్

ప: కన్నుల్లో నీ రూపమే..గుండెల్లో నీ ధ్యానమే..
నా ఆశ నీ స్నేహమే..నా శ్వాస నీ కోసమే..
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఏ మౌనమే.!!కన్నుల్లో!!

౧. మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి
నీ చూపునాపేదెలా..
నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న
నా మనసు తేలేదెలా..
గిలిగింత పెడుతున్న నీ చిలిపి చూపులతో
ఏమో ఎలా వేగడం.. !!కన్నుల్లో!!

౨. అదిరేటి పెదవుల్ని బ్రతిమాలుకున్నాను
మదిలోని మాటేంటని..
తల వంచుకుని నేను తెగ ఎదురు చూశాను
నీ తెగువ చూడాలని..
చూస్తూనే రేయంత తెలవారిపోతుందో
ఏమో ఎలా ఆపడం!!కన్నుల్లో!!

ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో


 చిత్రం: ఆర్య
సంగీత దర్శకత్వం - దేవిశ్రీ ప్రసాద్
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

 పల్లవి :ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో
ప్రేమా ఆ సందడి నీదేనా
ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో
ప్రేమా ఆ సవ్వడి నీదేనా
ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా
ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా
ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే
నువ్వుంటే నిజమేగా స్వప్నం
నువ్వుంటే ప్రతి మాట సత్యం
నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం
నువ్వుంటే ప్రతి అడుగు అందం
నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం
నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం

చరణం 1ఓ... పాట పాడదా మౌనం పురివిప్పి ఆడదా ప్రాణం
అడవినైన పూదోట చేయదా ప్రేమబాటలో పయనం
దారిచూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం
ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం
ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం
ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం
నువ్వుంటే ప్రతి ఆశ సొంతం
నువ్వుంటే చిరుగాలే గంధం
నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం
నువ్వుంటే ప్రతిమాట వేదం
నువ్వుంటే ప్రతిపలుకు రాగం
నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం

చరణం 2ఓ... ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా
చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా
మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపాన
ఆమెలోని ఆనందసాగరం నన్ను ముంచు సమయాన
హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే
సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే
ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోనా
నువ్వుంటే దిగులంటూ రాదే
నువ్వుంటే వెలుగంటూ పోదే
నువ్వుంటే మరి మాటలు కూడ పాటైపోతాయే
నువ్వుంటే ఎదురంటూ లేదే
నువ్వుంటే అలుపంటూ రాదే
నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే


Wednesday 21 October 2015

శ్రీ రాజరాజేశ్వరీ! శ్రీ రాజరాజేశ్వరీ!!

http://picosong.com/6yeU
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు వ్రాసిన `శ్రీమాతా లలితా' ఆల్బంలో అమ్మవారి చిరునామా చెప్పే పాట.
పల్లవి:
శ్రీ రాజరాజేశ్వరీ! శ్రీ రాజరాజేశ్వరీ!!
శ్రీచక్ర సింహాసనాధీశ్వరీ! శ్రీ రాజరాజేశ్వరీ!

అనుపల్లవి:
రాజశేఖరహృదయరాణీ మహేశ్వరీ!
సుముఖషణ్ముఖజనని! శుద్ధజ్ఞానేశ్వరీ!
చరణం:
అమృతసాగరమందు అదిమణిద్వీపము
ఆచోట కడిమితోటలనడిమి భవనము
భవనమున సభయందు పంచబ్రహ్మాసనము
ఆ స్వర్ణపీఠిపై అమ్మ అపురూపము
పల్లవి:
శ్రీ రాజరాజేశ్వరీ! శ్రీ రాజరాజేశ్వరీ!!
శ్రీచక్ర సింహాసనాధీశ్వరీ! శ్రీ రాజరాజేశ్వరీ!
చరణం:
వాగ్దేవతలుపలికె వేలనామములు
దేవమకుటములిచ్చె మణులహారతులు
శివజటనదియించె సిద్ధపాద్యమ్ము
సర్వశక్తులనెలవు శ్రీమాత కొలువు
పల్లవి:
శ్రీ రాజరాజేశ్వరీ! శ్రీ రాజరాజేశ్వరీ!!
శ్రీచక్ర సింహాసనాధీశ్వరీ! శ్రీ రాజరాజేశ్వరీ!
అనుపల్లవి:
రాజశేఖరహృదయరాణీ మహేశ్వరీ!
సుముఖషణ్ముఖజనని! శుద్ధజ్ఞానేశ్వరీ!

Sunday 18 October 2015

మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది

         
మరో  ప్రపంచం మరో  ప్రపంచం మరో  ప్రపంచం పిలిచింది
పదండి ముందుకు పదండి  తోసుకు  పోదాం  పోదాం  పై  పైకి
మరో  ప్రపంచం మరో  ప్రపంచం మరో  ప్రపంచం పిలిచింది
ఇదే  మహా ప్రస్థానం   ఇదే మహా ప్రస్థానం  జీవిత  పధాన  సమతా  గమ్యం  చేరగా
ఇదే  మహా ప్రస్థానం భారత  జనాల  భాదల గాధలు మారగా
పదండి  పోదాం  కనపడలేదా  పవిత్ర  సుందర  నవోదయం
మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది

దారి పొడుగునా గుండె  నెత్తురులు  తర్పణ  చేస్తూ  పదండి  ముందుకు
బాటలు  నడచి  పేటలు  కడచి  కోటలన్నిటిని  దాటండి
ప్రజా  విరోధుల  పనిపట్టగా  ప్రతిజ్ఞ  చేస్తూ  పదండి  ముందుకు
ధర్మ  విదూరుల  దానవ  రాజ్యం  ద్వంసం  చేస్తూ  పదండి  ముందుకు
కనపడలేదా  మరోప్రపంచపు  కణ  కణ  మండే  త్రేతాగ్ని
మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది

ఎముకలు  కుళ్ళిన  వయస్సు  మళ్ళిన  సోమరులారా  చావండి
నెత్తురు  మండే  శక్తులు  నిండే  సైనికులారా  రారండి
హరోం  హరోం  హర  హర  హర హరోం హర  హరా  అని  కదలండి
మరోప్రపంచపు  కంచు  నగారా  విరామమెరుగక  మ్రోగింది
సల సల  కాగే చమురా  కాదిది కాదిది ఉష్ణ  రక్త  కాసారం...యువ  చైతన్య  వికాసం
కనపడలేదా  మరో  ప్రపంచపు  అగ్ని  కిరీటపు  ధగ  ధగలు
ఎర్ర  బావుటా  నిగ  నిగలు  హోమ జ్యాలల  భుగ  భుగలు
మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది

చీకటి  శక్తుల  పీకలు  నులిమే  వెలుతురువైపు  మహా  ప్రస్థానం
దోపిడీ  బుద్దుల  తుదముట్టించే  న్యాయం  వైపు  మహా ప్రస్థానం
ఇది  మరోప్రపంచపు  మంచితనానికి  మానవజాతి  మహా  ప్రస్థానం
మహా ప్రస్థానం....మహా ప్రస్థానం




కళ్ళలో పెళ్లిపందిరి కనపడసాగే

 


 చిత్రం : ఆత్మీయులు (1969)

సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
రచన : కొసరాజు
గానం : ఘంటసాల ,పి.సుశీల


కళ్ళలో పెళ్లిపందిరి కనపడసాగే
పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే(2)

౧. నుదుట కళ్యాణ తిలకముతో
పసుపు పారాణి పదములతో
పెదవిపై మెదిలే నగవులతో
వధువు నను ఓరగా చూస్తుంటే
జీవితాన పూల వాన

౨. సన్నాయి చల్లగా మ్రోగి
పన్నీటి జల్లులే రేగి(2)
మనసైన వరుడు దరిచేరి
మెడలోనతాళి కడుతుంటే
జీవితాన పూలవాన

౩. వలపు హృదయాలు పులకించి
మధుర స్వప్నాలు ఫలియించి(2)
లోకమే వెన్నెల వెలుగైతే
భావియే నందన వనమైతే
జీవితాన పూల వాన