Pages

Subscribe:

Sunday 10 May 2020

జయము జయము భరతమాత

జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత
ఈ జగాన సాటి యెవ్వరే ఓయమ్మ నీకు       || జయము ||

గంగ యమున గోదారీ సింధు కృష్ణ కావేరీ
బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతీ నర్మద పెన్నా
పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు
జీవనదుల గన్నతల్లివే ఓయమ్మ నీవు   || జయము ||

హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు 
దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు
పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు 
నిజముగ నువు రత్గర్భవే ఓయమ్మ నీవు   || జయము ||

లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు
నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు 
వేదాలను వెలికితెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు
నిజముగ నువు జగద్గురువువే ఓయమ్మ నీవు  || జయము ||