Pages

Subscribe:

Thursday 31 October 2019

కలువకు చంద్రుడు ఎంతో దూరం



చిత్రం: చిల్లర దేవుళ్ళు (1975)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు

పల్లవి: కలువకు చంద్రుడు ఎంతో దూరం..
కమలానికి సూర్యుడు మరీ దూరం..

దూరమైన కొలదీ.. పెరుగును అనురాగం..
విరహంలోనే వున్నది అనుబంధం..
కలువకు చంద్రుడు ఎంతో దూరం..
కమలానికి సూర్యుడు మరీ దూరం

చరణం 1: నవ్వు నవ్వుకు తేడా వుంటుందీ..
నవ్వే అదృష్టం ఎందరికుంటుంది ??
ఏ కన్నీరైనా వెచ్చగ వుంటుందీ..
అది కలిమిలేములను మరిపిస్తుంది..

కలువకు చంద్రుడు ఎంతో దూరం..
కమలానికి సూర్యుడు మరీ దూరం

చరణం 2: వలపు కన్నా తలపే తీయనా...
కలయిక కన్నా కలలే తీయనా..
చూపులకన్నా ఎదురు చూపులే తీయనా...
నేటికన్న రేపే తీయనా..

కలువకు చంద్రుడు ఎంతో దూరం..
కమలానికి సూర్యుడు మరీ దూరం

చరణం 3: మనసు మనిషిని మనిషిగ చేస్తుందీ..
వలపా మనసుకు అందానిస్తుంది..
ఈ రెండూ లేక జీవితమేముంది??
ఆ దేవుడికి.. మనిషికి.. తేడా ఏముంది??

కలువకు చంద్రుడు ఎంతో దూరం..
కమలానికి సూర్యుడు మరీ దూరం
దూరమైన కొలదీ.. పెరుగును అనురాగం..
విరహంలోనే వున్నది అనుబంధం..
కలువకు చంద్రుడు ఎంతో దూరం..
కమలానికి సూర్యుడు మరీ దూరం


Sunday 5 May 2019

పిలువకురా అలుగకురా... నలుగురిలో నను ఓ రాజా


చిత్రం :  సువర్ణ సుందరి (1957)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  సుశీల
పల్లవి : ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
పిలువకురా అలుగకురా...
నలుగురిలో నను ఓ రాజా..
పలుచన సలుపకురా..
పిలువకురా అలుగకురా....
నలుగురిలో నను ఓ రాజా.. ఆ..
పలుచన సలుపకురా..
పిలువకురా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
చరణం 1 : మనసున తాళి మరువనులేర...
గళమున మోడి సలుపకు రాజా....
సమయము కాదురా నిన్ను దరిచేర..
సమయము కాదురా నిన్ను దరిచేర...
కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా...
పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ
చరణం 2 : ఏలినవారి కొలువుర సామీ...
మది నీ రూపే మెదలినగాని..
ఓయన లేనురా కదలగలేర..
ఓయన లేనురా కదలగలేర..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా....
పిలువకురా ఆ ఆ ఆ ఆ ఆ

నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది..


చిత్రం: అంతస్తులు (1965)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
పల్లవి: నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది..ఇంత ఇది..ఇంత ఇది..
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది...
నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది..
నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది..ఇంత ఇది..ఇంత ఇది...
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది...
చరణం 1: తొలినాడు ఏదోల మొదలైనది..ఈ..ఆ రేయి నిదురంతా కలలయినది
తొలినాడు ఏదోల మొదలైనది..ఈ..ఆ రేయి నిదురంతా కలలయినది
మరునాడు మనసంత తానయినది ...ఆ ఇది ఏదో ఇద్దరికి తెలియకున్నది
మరునాడు మనసంత తానయినది ...ఆ ఇది ఏదో ఇద్దరికి తెలియకున్నది
నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది..
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది...
చరణం 2: వయసులో పాకానికి వచ్చినది... తనువులో అణూణువున పొంగినది..
వయసులో పాకానికి వచ్చినది... తనువులో అణూణువున పొంగినది..
 నీకిచ్చేవరకు నిలువలేనన్నది ...ఉరికిఉరికి నీ ఒడిలో ఒదిగినది
నీకిచ్చేవరకు నిలువలేనన్నది ...ఉరికిఉరికి నీ ఒడిలో ఒదిగినది
నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది..ఇంత ఇది..ఇంత ఇది
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది...

నీలికన్నుల నీడలలోనా...దోరవలపుల దారులలోనా


చిత్రం: గుడిగంటలు (1965)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
పల్లవి: అ....ఆ..ఆ..ఆ..ఓ..ఓ..
నీలికన్నుల నీడలలోనా...దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమాయే... అందుకో...నన్నందుకో
అందుకో నన్నందుకో
నీలికన్నుల నీడలలోనా... దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమేదో... ఉందిలే... ముందుందిలే
ఉందిలే ముందుందిలే...
చరణం 1: మబ్బుల పందిరి మనపై నిలిచే...ఎందుకు నిలిచే
పచ్చిక పానుపు వెచ్చగ పిలిచే...ఏమని పిలిచే
వీడని జంటగ రమ్మనీ ...వసి వాడని పూలై పొమ్మనీ
నీలికన్నుల నీడలలోనా... దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమేదో... ఉందిలే... ముందుందిలే
ఉందిలే ముందుందిలే...
చరణం 2: తెలియరానిది ఈ గిలిగింత...ఏ గిలిగింత..
పలుకలేనిది ఈ పులకింత...ఏ పులకింత ...
కనుపించనిదా వింతా...అది కదలాడును మనసంతా
నీలికన్నుల నీడలలోనా...దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమాయే... అందుకో...నన్నందుకో
అందుకో నన్నందుకో
చరణం 3: చల్లగ తాకే జ్వాలలు ఏవో ...ఏమో ఏవో...
అవేడిగ సోకే వెన్నెలలు ఏవో ...ఏమో ఏవో...
చిన్నది విరిసే చూపులు ...చెలి చిలికిన ముసి ముసి నవ్వులు
నీలికన్నుల నీడలలోనా...దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమాయే... అందుకో...నన్నందుకో
అందుకో నన్నందుకో

మబ్బులో ఏముంది


చిత్రం :  లక్షాధికారి (1963)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల,  సుశీల
పల్లవి : మబ్బులో ఏముంది...
నా మనసులో ఏముంది.. నా మనసులో ఏముంది?
మబ్బులో కన్నీరు..
నీ మనసులో పన్నిరు.. నీ మనసులో పన్నీరు..
అవునా..ఉహు..ఊ..ఊ....
చరణం 1: తోటలో ఏముంది.. నా మాట లో ఏముంది? నా మాటలో ఏముంది?
తోటలో మల్లియలు.. నీ మాటలో తేనియలు.. నీ మాటలో తేనియలు ..
ఉహు..ఊ..ఊ..ఊ..
ఊహు..ఊ..ఊ..ఊ..
చరణం 2 : చేనులో ఏముంది?.. నా మేనులో ఏముంది?.. నా మేనులో ఏముంది?
చేనులో బంగారం.. నీ మేనులో సింగారం... నీ మేనులో సింగారం
ఏటిలో ఏముంది?.. నా పాటలో ఏముంది?... నా పాటలో ఏముంది?
ఏటిలో గలగలలు.. నీ పాటలో సరిగమలు... నీ పాటలో సరిగమలు
నేనులో ఏముందీ?.. నీవులో ఏముంది?... నీవులో ఏముంది?
నేనులో నీవుంది... నీవులో నేనుంది... నీవులో నేనుంది
నేనులో నీవుంది నీవులో నేనుంది
నీవులో నేనుంది నేనులో నీవుంది...
అహ..ఆ..అహ..ఆ..
అహ..ఆ..అహ..ఆ..


Sunday 7 April 2019

అమ్మాయి ముద్దు ఇవ్వందే.. ఈ రేయి తెల్లవారనివ్వనంతే


చిత్రం: క్షణం క్షణం  (1991)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: బాలు, చిత్ర
పల్లవి : అమ్మాయి ముద్దు ఇవ్వందే.. ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయీ నీ ముద్దు చెల్లించితే.. అమ్మమ్మమ్మమ్మో గొడవలే
ముద్దిమ్మంది బుగ్గ
వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గేలేని సిగ్గా
ముద్దిమ్మంటే బుగ్గ
అగ్గల్లే వస్తే ఆపేదెట్ట హద్దూ పద్దు వద్దా
చరణం 1 : మోజు లేదనకు.. ఉందనుకో ఇందరిలో ఎలా మనకు
మోగిపొమ్మనకూ... చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో
చూడదా సహించని వెన్నెల దహించిన కన్నులా
కళ్ళు మూసేసుకో హయిగా!!అమ్మాయి!! 
చరణం 2 : పారిపోను కదా.. అది సరే అసలు కథ అవ్వాలి కదా
యేది ఆ సరదా.. అన్నిటికీ సిద్ధపడే వచ్చాను కదా
అందుకే అటూ ఇటు చూడకు.. సుఖాలను వీడకు
తొందరేముందిలే విందుకు
ముద్దిమ్మంది బుగ్గ
వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గేలేని సిగ్గా
ముద్దిమ్మంటే బుగ్గ
అగ్గల్లే వస్తే ఆపేదెట్ట హద్దూ పద్దు వద్దా!!అమ్మాయి!!

ఆకు చాటు పిందె తడిసే .. కోక మాటు పిల్ల తడిసే


చిత్రం :  వేటగాడు (1979)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల
పల్లవి : ఆకు చాటు పిందె తడిసే .. కోక మాటు పిల్ల తడిసే
ఆకు చాటు పిందె తడిసే .. కోక మాటు పిల్ల తడిసే
ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది
గూడు చాటు గువ్వ తడిసే .. గుండె మాటు గుట్టు తడిసే
గూడు చాటు గువ్వ తడిసే .. గుండె మాటు గుట్టు తడిసే
ఆకాశ గంగొచ్చింది.. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది .. కొంగుల్ని ముడిపెట్టింది 
చరణం 1 : ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటే .. అహ అహ.. అహా అహ
చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే .. అహ అహ .. అహ అహ
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే ..
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే ..
ఓ చినుకు నీ మెడలో నగ లాగ నవుతుంటే
నీ మాట విని మబ్బు మెరిసి ..అహ
జడివానలే కురిసి కురిసి ..
వళ్ళు తడిసి ..వెల్లి విరిసి...
వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి
అహ అహ ఆహ అహ.. అహ ఆహ ..
ఆకు చాటు పిందె తడిసే .. కోక మాటు పిల్ల తడిసే
ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది
చరణం 2 : మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే .. అహ అహ .. అహ అహ
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే .. అహ అహ .. అహా అహ అహ
ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే..
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే
అహ .. నీ పాట విని మెరుపులొచ్చి... అహ
నీ విరుపులే ముడుపు లిచ్చి
చలిని పెంచి .. చెలిమి పంచి
తనలో వెచ్చంగా తడి ఆర్చుకోవాలి
అహ అహ ఆహ అహ.. అహ ఆహ ..
ఆకు చాటు పిందె తడిసే .. కోక మాటు పిల్ల తడిసే
ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది

కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని


చిత్రం :  వసంత కోకిల (1982)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  మైలవరపు గోపి
నేపధ్య గానం :  బాలు
పల్లవి: కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో
చరణం 1 : మోసం తెలియని లోకం మనదీ
తీయగ సాగే రాగం మనదీ
ఎందుకు కలిపాడో..బొమ్మలను నడిపే వాడెవడో
నీకూ నాకూ సరిజోడని..కలలోనైనా విడరాదనీ
కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో
చరణం 2 : కారడవులలో కనిపించావూ
నా మనసేమో కదిలించావూ
గుడిలో పూజారై నా హృదయం నీకై పరిచాను
ఈ అనుబంధం ఏ జన్మదీ..ఉంటే చాలు నీ సన్నిధి
కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో

ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో


చిత్రం :  ప్రేమాభిషేకం (1981)
సంగీతం :         చక్రవర్తి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి: ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ఒక దేవత గుడిలో..  ఒక దేవుని ఒడిలో
నిదురించే అనురాగం...  కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
చరణం 1: మరులు పూచిన పూలపందిరిలో..
మమతలల్లిన ప్రేమ సుందరికీ...
పట్టాభిషేకం... పట్టాభిషేకం
మనసు విరిచినా మనసు మరువనీ
మధుర జీవిత మానవమూర్తికి
మంత్రాభిషేకం... మంత్రాభిషేకం

రాగాల సిగలో.. అనురాగాల గుడిలో ...
భావాలబడిలో.. అనుభవాల ఒడిలో ...
వెలసిన రాగదేవతా... రాగాభిషేకం
వెలసిన ప్రేమవిజేతా... ప్రేమాభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
చరణం 2: కలలచాటున పెళ్ళిపల్లకిలో
కదలివచ్చిన పెళ్ళికూతురికీ..
పుష్పాభిషేకం.. పుష్పాభిషేకం
పాట మారినా ... పల్లవి మార్చనీ
ప్రణయలోకపు ప్రేమమూర్తికి..
స్వర్ణాభిషేకం.. స్వర్ణాభిషేకం
స్వప్నాల నింగిలో.. స్వర్గాల బాటలో...
బంగారు తోటలో.. రతనాల కొమ్మకు...
విరిసిన స్వప్న సుందరీ...  క్షీరాభిషేకం...
కొలిచినప్రేమ పూజారీ.. అమృతాభిషేకం...
 ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ఒక దేవత  గుడిలో... ఒక  దేవుడి ఒడిలో
నిదురించే అనురాగం... కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం